విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన 1200 మందికి పైగా గిరిజనులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారితో కలిసి శ్రీ స్వాత్మానందేంద్రస్వామి తిరుమల పిఏసి-3 నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్రస్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించి మతమార్పిడులను అరికట్టేందుకు గిరిజన ప్రాంతాల్లోని హిందువులను చైతన్య పరచడం కోసం 2019లో హిందూ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 33 వేల కిలోమీటర్లకు పైగా మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు హిందూ మతం ఔన్నత్యాన్ని వివరించినట్టు చెప్పారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో యాత్ర ముగించడం సంతోషంగా ఉందన్నారు.
1200 మందికిపైగా గిరిజనులు, దళితులతో కలిసి స్వామివారిని దర్శించుకుని హిందూ ధర్మ వ్యాప్తికి తగిన శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్టు చెప్పారు.
వి.ఎస్.కే ఆంధ్ర సౌజన్యంతో..