Home News కులాల కతీతంగా యాదాద్రి లో అర్చక శిక్షణ

కులాల కతీతంగా యాదాద్రి లో అర్చక శిక్షణ

0
SHARE
గుట్టలో గ్రామదేవాలయ పూజారి శిక్షణలో పాల్గొన్న పూజారులు

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గ్రామదేవాలయాల పూజారి (అర్చకుల) శిక్షణ తరగతులను స్థానిక యాదాద్రి గార్డెన్‌లో నిర్వహించారు. ఆదివారం(7-జనవరి, 18) నాడు 30 మండలాల నుంచి 180 మంది గ్రామ పూజారులు హాజరై శిక్షణను తీసుకుంటున్నారు. ఉదయం నగర సంకీర్తనతో మొదలై సాయంత్రం శాంతి మంత్రంతో ముగుస్తుందని యాదాద్రి భువనగిరి ధర్మ జాగరణ ప్రముఖ్ తెలిపారు.

కులాల కతీతంగా ఈ శిక్షణను ఇవ్వడం జరుగుతుందని వివిధ మండలాల నుండి 180 మంది పూజారులు శిక్షణను తీసుకునేందకు వచ్చారని వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

శిక్షణ పొందిన వారు గ్రామ దేవాలయాలలో పూజలు నిర్వహించుతూ సేవ చేసుకోవచ్చునని అన్నారు. గ్రామాలలో ప్రజలకు భక్తి భావంతో పాటు పూజలు నిర్వహించేందకు పూజారులకు శిక్షణను ఇస్తున్నామన్నారు.

యాదగిరిగుట్ట పురవీధుల గుండా గ్రామ దేవాలయాల పూజారులు భక్తి భావంతో పాటలు పాడుతూ దేవుడిని స్మరిస్తూ తిరుగడంతో పురవీధులన్ని భక్తి భావంతో పులకరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పూజారులు, స్థానికులు పాల్గొన్నారు.