భారతీయ జీవన విధానం గొప్పదని, సమరసత సమభావంతోనే సమాజం మనుగడ సాధ్యమవుతుందని సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జి అన్నారు. అన్ని కులాలను గౌరవించి ఐక్యంగా జీవించినపుడే సమరసత హిందూ సమాజ సంఘటన సాధ్యమవుతుందన్నారు.
శుక్రవారం నాడు (26-Jan-18) మెదక్ లోని జీకెఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ కుల వృత్తుల వారితో సమరసత సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అప్పల ప్రసాద్ జి మాట్లాడుతూ కులాల మధ్య సయోధ్య అవసరమని, మనవులందరు సమానమేనని హైందవ సంస్కృతిలో ఆంటరానితనానికి స్థానం లేదని హిందూ పురాణాలూ, ఉపనిషత్తులు, వేదాలలో ఎక్కడా కుల ప్రస్తావన లేదన్నారు.
శ్రీ రాముడు అరుంధతి ఇంట్లో భోజనం చేయడం, శబరీ భక్తి తో ఎంగిలి రేగి పండ్లు రాముడికి తినిపించడం, జటాయువు పక్షికి తండ్రితో సమానంగా అంత్యక్రియలు చేయడం శ్రీ రాముడి సమరసత ను తెలియచేస్తుందన్నారు.
కులాల వివక్ష తీసుకొని వచ్చి హిందూ సమాజంలో తారతమ్య బేదాలు తీసుకొని వచ్చే శక్తుల నుండి ఉండాలన్నారు.
మనమందరం సోదరులం అని చిన్నపుడే చేసే భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞ పాఠ్య పుస్తకాలలో ఉంటుంది అనే విషయాన్నీ గుర్తు చేశారు.
అనంతరం 25 కుల వృతులకు చెందిన పెద్దలకు గ్రామస్తులు అంత కలిసి సన్మానం చేసారు. నిరుపేదలకు దుప్పట్లు సైతం అందచేసారు.
ఈ కార్యక్రమం లో సామజిక సమరసత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు శ్రీ రవి, ప్రధాన కార్యదర్శి శ్రీ మశ్చేంద్రనాథ్, శ్రీ భైరి నరసింహులు, శ్రీ చోళ పవన్ కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కోశాధికారి, వివిధ కుల సంఘాల పెద్దలు, వివేకానంద యూత్ సబ్యులు, వి హెచ్ పి, భజరంగ్ దళ్, వీధ్యపీఠం కార్యకర్తలు పాల్గొన్నారు.