Home News మానవ హక్కుల పరిరక్షణ అంటూ చట్టాలను ఉల్లంఘించిన ఆమ్నెస్టీ  

మానవ హక్కుల పరిరక్షణ అంటూ చట్టాలను ఉల్లంఘించిన ఆమ్నెస్టీ  

0
SHARE

మానవ హక్కుల పేరిట భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించినందుకు గాను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమెస్ట్నీ పై చర్యలు తీసుకోవడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు ఉండడం వల్లనే సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ లను స్తంభింపచేయడం జరిగిందని, ఈ విషయమై ఆమ్నెస్టీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని తేల్చి చెప్పింది. ఆమ్నెస్టీ వ్యవహారానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం ఈ విషయాలు స్పష్టం చేసింది. మానవహక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న తమ సంస్థను భారత ప్రభుత్వం వెంటాడి, వేధింపులకు గురి చేసిందని,అందుకే ఇక్కడ తమ కార్యకలాపాలు నిలుపు చేస్తున్నామని ఆమ్నెస్టీ అంతకు ముందు ప్రకటించింది.  భారత్ లో యధేచ్చగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందంటూ  ఆమ్నెస్టీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ప్రభుత్వం  ప్రకటన విడుదల చేసింది.

మానవ హక్కుల సాకు చూపించి దేశంలో చట్టాలను ఉల్లంఘించడం కుదరదని స్పష్టం చేసింది. నీతి వాక్యాలు చెబుతూ చట్టాలను ఉల్లంఘిస్తూ చేసిన వ్యతిరేక కార్యకలాపాల నుంచి తప్పించుకునేందుకు సంస్థ చూస్తోందని హోంశాఖ వెల్లడించింది. విదేశీ విరాళాల ద్వారా నిధులు సమకూర్చే సంస్థలు దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

“భారతదేశంలో పూర్తి వాక్‌ స్వాతంత్య్రం, స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ, బహుళ ప్రజాస్వామ్య సంస్కృతి కలిగి ఉంది. ప్రజాస్వామ వ్యవస్థపై ప్రభుత్వానికి అపూర్వమైన నమ్మకం ఉంది, కానీ నిబంధనలను పాటించడంలో అమ్నెస్టీ వైఫల్యం చెందిందని, ప్రజాస్వామ్యం గురించి వ్యాఖ్యానించడానికి అర్హత ఆ  సంస్థకు లేదు” అని హోం శాఖ తేల్చి చెప్పింది.

 అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అయిన అమెస్ట్ని   ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యూలేషన్‌ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) ప్రకారం విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ఒక్క సారి మాత్రమే అనుమతి పొందిందని, అది కూడా 20 ఏండ్ల క్రితం 2000 సంవత్సరంలో తీసుకుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి లేకుండానే విదేశాల నుంచి విరాళాలు సేకరిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి పదే పదే దరఖాస్తులు ఉన్నప్పటికీ చట్టం ప్రకారం అటువంటి ఆమోదం పొందటానికి అర్హత లేనందున, తరువాతి ప్రభుత్వాలు ఆమోదాన్ని నిరాకరించాయి.

కానీ చట్టాన్ని ఉల్లంఘించిన ఆమెస్ట్నీ సంస్థ యూకే దేశంలోని నాలుగు సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడుల ద్వారా విరాళాలను స్వీకరించింది. ఎఫ్‌సీఆర్ఏ , హోం శాఖ అనుమతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ సంస్థ పాల్పడిన చట్ట విరుద్ద చర్యలను కేంద్రం తప్పు పట్టింది. అయితే భారత ప్రభుత్వం తమ సంస్థపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, సెప్టెంబర్‌ 10న తమ  సంస్థకు సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించింది. ఈ అరోపణలపై ప్రభ్వుత్వం స్పందించిన ప్రభుత్వం  ఆమెస్ట్నీ సంస్థకు విదేశాల నుంచి వచ్చిన అనుమానాస్పద రూ. 51 కోట్లపైనే ఈడీ దర్యాప్తు చేస్తోందని, ఆ ఖాతాలను మాత్రమే నిలిపివేయడం జరిగిందని స్పష్టంచేసింది.

Source : PIB