Home Telugu Articles దేశ భద్రతకు ముప్పు.. హైబ్రీడ్ టెర్రరిస్టులు

దేశ భద్రతకు ముప్పు.. హైబ్రీడ్ టెర్రరిస్టులు

0
SHARE

లష్కరే తోయిబా నుంచి పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు చెందిన స్థానికులైన ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను మే 23న శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టుల అరెస్టును జమ్మూ కాశ్మీర్ పోలీసుల సాధించిన అతి పెద్ద విజయంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఎవరు ఈ హైబ్రీడ్ టెర్రరిస్టులు.. వారు ఎందుకంత ప్రమాదకారులు?

గడచిన కొద్ది సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్‌లో హైబ్రీడ్ టెర్రరిస్టులు లేదా పార్ట్ టైమ్ టెర్రరిస్టుల సంఖ్య పెరిగిపోతున్నది. ‘హైబ్రీడ్’ టెర్రరిస్టులు అసలైన టెర్రరిస్టుల జాబితాలో కనిపించరు. సామాన్యుల తరహాలో ఏదో ఒక వృత్తి వ్యాపకాల్లో జీవనం సాగిస్తుంటారు. ఉగ్ర దాడులు చేపట్టిన తర్వాత ఎలాంటి ఆనవాళ్ళు మిగల్చకుండా సామాన్య ప్రజల్లో కలిసిపోతుంటారు. భద్రతా ఏజెన్సీల ప్రకారం ఈ టెర్రరిస్టులు కరడుగట్టిన టెర్రరిస్టులు కారు. అయితే జాతి వ్యతిరేక శక్తుల ద్వారా ప్రేరేపించబడిన వీరు.. ఉగ్ర దాడులు చేపట్టడానికి సముఖంగా ఉంటారు.

ఈ టెర్రరిస్టులను ‘పక్కింటి కురాళ్ళు’ గా సెక్యూరిటీ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. టెర్రరిస్టు సంస్థలు వీరిని స్టాండ్‌బై గా ఉంచుకుంటాయి. ఉగ్రదాడులకు మధ్య కాలంలో ఈ హైబ్రీడ్ టెర్రరిస్టులు సర్వసాధారణమైన జీవనాన్ని సాగిస్తుంటారు. సామాన్య ప్రజలు మిళితమైపోయి జీవిస్తున్న కారణంగా హైబ్రీడ్ టెర్రరిస్టులపై నిఘా పెట్టి, వారి ఆనవాళ్ళను పట్టడం సెక్యూరిటీ ఏజెన్సీలకు కష్టంగా మారుతున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

హైబ్రీడ్ టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును స్పష్టం చేస్తున్నట్టుగా, 2021లో సామాన్య పౌరులు, సెలవులో ఉన్న పోలీసులు, రాజకీయ కార్యకర్తలు, తదితరులపై డజన్లకొద్దీ దాడులు జరిగాయని భద్రతా ఏజెన్సీలకు చెందిన వర్గాలు తెలిపాయి. వీటిలో అత్యధిక దాడులకు హైబ్రీడ్ టెర్రరిస్టులు తెగబడ్డారు. ఈ హైబ్రీడ్ టెర్రరిస్టులను కనిపెట్టడంలో సాంకేతిక గాడ్జెట్లతో పాటుగా సోషల్ మీడియా కార్యకలాపాలపై పర్యవేక్షణ సాయపడుతున్నాయని 2021 సంవత్సరం జనవరి మాసంలో చేసిన ఒక ప్రకటనలో ఐజీ కుమార్ తెలిపారు.

ఇటీవల భగ్నమైన హైబ్రీడ్ టెర్రరిస్టుల పన్నాగాలు

మే ఒకటవ తేదీన, కుల్గామ్, శ్రీనగర్ జిల్లాల్లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను భద్రతా ఏజెన్సీలు అరెస్టు చేశాయి. వారి నుంచి ఒక పిస్టల్, రెండు గ్రనేడ్లు, 51 పిస్టల్ రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మే 8న, జమ్మూ కాశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఇద్దరు యువకులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. చెక్‌పాయింట్‌ను ధ్వంసం చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే చురుకుగా స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

SOURCE : OPINDIA