రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాత డా. హెడ్గేవార్ పాత్ర
– డా.శ్రీరంగ్ గోడ్బోలే
1938-39 లో హైదరాబాదురాజ్యంలోని హిందూ ప్రజల న్యాయపరమైన అధికారాల కోసం జరిగిన నిరాయుధ పోరాట ఉద్యమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాత డా|| హెడ్గేవార్ పాత్ర ఏమిటి ? ఏదైనా చారిత్రాత్మక సంఘటనకు సంబంధించి ఎవరైనా మహాపురుషుడి పాత్రను గురించి అర్థం చేసుకోవాలంటే, ఆ మహాపురుషుడు తనకుతానుగా నిర్దేశించుకున్నజీవనలక్ష్యం, ఆ జీవనలక్ష్యంపట్ల ఆయనకున్న తార్కిక ఆలోచన, సమకాలీన సంఘటనలపట్ల ఆయన దృష్టికోణం ఆ మహాపురుషుని విలువల గురించి అర్థం చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. డా. హెడ్గేవార్ భాగ్యనగర్ నిరాయుధ పోరాటం విషయం గురించి కూడా ఇలాగే ఆలోచించాలి.
హెడ్గేవార్ జీవనలక్ష్యం
స్వాతంత్య ప్రాప్తి కోసం జరిగిన ప్రయత్నాలలో భాగంగా అనేక మార్గాలు, సంస్థల నుండి అనుభవం పొంది డా.హెడ్గేవార్ 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్థాపించినపుడు ఆయన ముందు ఏ ఉద్దేశ్యం ఉన్నది? 1938 డిసెంబర్ లో నాగపూర్ శిబిరంలో చేసిన ఉపన్యాసంలో డాక్టర్జీ తమ జీవనలక్ష్యాన్నిస్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే, ‘ హిందుస్థాన్ హిందువుల దేశం, దానికి యజమానులు హిందువులే.. ఈ సత్యాన్ని వ్యావహారిక రూపంలోని రూపించే బాధ్యతమనది కాదా? ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏర్పడినపుడల్లా మనం మన తత్వానికి ఓ ఆకృతినిచ్చాం. ఈ కారణంగానే మనం సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు, దేశంలోని నలుమూలలా ఆ సంస్థ బీజాలను నాటడానికి శ్రమిస్తున్నాము. దేశమంతటిలోని హిందూసమాజం సంఘటిత రూపంలో తన కాళ్ళమీద నిలబడాలనే ఉద్దేశ్యంతో మనం మన మొత్తం జీవితాన్ని దానికొరకు ధారపోయాలని సంకల్పం తీసుకున్నాం.” ( రా. స్వ. సంఘ్, అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు, RSS Nagpur Lashkari Chhavanni 1938 – 0002 to 0009 ).
నిజాం తన పూర్వజులైన మహమ్మద్ గజని, తుగ్లక్, ఔరంగజేబు, టిప్పులలాగా హిందువులమీద అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. దానిని ఎదుర్కోవడం నిస్సందేహంగా తప్పనిసరి. అయితే ఒక నిజాం వెళ్ళిపోతే అతడి స్థానంలో మరో ఇస్లాం మతోన్మాది హిందువుల ఛాతీమీద కూర్చోడనుకోవడానికి ఉందా? హిందూసమాజంలో అంతర్గతశక్తిని పెంచడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని గుర్తించిన డాక్టర్జీ “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన కార్యక్షేత్రంగా దేన్నైతే ఎంచుకుందో అది బాగా ఆలోచించి ఎంపిక చేసుకున్నది. అందువల్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరే ఇతర గందరగోళాలలో చిక్కుకొనదు. తన లక్ష్యంపై దృష్టిసారించి మనం నిర్ధారించుకున్న మార్గంలో ముందుకు సాగిపోవాలి. మన జీవితంలోని ప్రతిక్షణం ఈ సత్కార్యంలో ఎలా ఖర్చుచేయగలమనే ఆలోచనను దివారాత్రాలు చేయడంతోబాటు తదనుసారంగా పనిచేయడాన్నినేర్చుకోవాలి” అన్నారు.
విదేశీ దురాక్రమణదారులను నాశనం చేయడమనేది తప్పనిసరి. అయితే విదేశీసమాజానికి మన సమాజం మీద దాడి చేయాలనే కోరిక కలగకుండా ఉండే పరిస్థితి నిర్మాణం చేయడమన్నది డాక్టర్జీ స్థిరలక్ష్యం అయింది. దీర్ఘకాలిక ఉద్దేశ్యాన్నిముందుంచుకున్నవ్యక్తికి, తాత్కాలిక సంఘటనలలో తన శక్తిని ఏమేరకు వినియోగించాలనే వివేకం కలిగి ఉండడం అవసరం . మళ్ళీ డాక్టర్జీ మాటల్లోనే “విశాలవటవృక్షం ఏదో ఒకటిరెండురోజుల్లో పెరిగిపోయేది కాదు. మెంతిమొక్క రెండురోజుల్లో పెరుగుతుందికాని నాలుగు రోజులకే వాడిపోతుంది. అదే వటవృక్షమైతే ఒకసారి పుట్టుకొచ్చిందంటే, వేలాదిమందికి నీడనిస్తుంది. దాని కొమ్మలు ఆకాశాన్నికౌగిలించుకోవాలనే ఆతృత కలిగి ఉంటాయి. శిరస్సు ఆకాశాన్నితాకుతూ ఉంటుంది. దాని వేర్లు పాతాళగంగను కలుసుకుంటాయి. అలాంటి స్పృహ – కలిగిన, గౌరవాన్వితమైన వ్యాప్తికొరకు, గొప్ప వైభవాన్నిపొందడానికి అది బీటలువారిన, రాళ్ళురప్పలు కలగలిసిన నేలతో, అసంఖ్యాకమైన వేర్లను చొచ్చుకుపోయేలాచేసి అనేక సంవత్సరాలపాటు శ్రమపడుతుంది. హిందూరాష్ట్రపు విశాలవటవృక్షం హిందువులకు నీడనిచ్చే యోగ్యత, సామర్థ్యం కలిగినదిగా తయారవ్వాలంటే ధ్యేయపూర్వకకార్యం చేయాల్సి ఉంటుంది. అలాగే నిరంతరం సంస్థను పెంచుతూపోవాలి”. (మదుసూదనకులకర్ణి సంకలనం చేసిన కేశవ బలిరామ్ హెడ్గేవార్ ; గోపాల్ గణేశ్అధికారి సంకలనం, మహారాష్ట్ర ప్రకాశనసంస్థ 1940)
సంఘశక్తి
యుగపరివర్తన కార్యాన్ని స్వీకరించిన డాక్టర్జీ ప్రారంభించిన సంఘకార్యం 1938 – 39 లో ఏస్థితిలో ఉంది? స్వీకరించినకార్యం గురించిన ఎలాంటి భేషజమూ లేకుండా విశ్లేషించడం కేవలం డాక్టర్జీకే చెల్లింది. 1938లో డాక్టర్జీ ఇచ్చిన ఒక ఉపన్యాసంలో “నేడు 400 సంఘశాఖలు, 40 వేలమంది స్వయంసేవకులు ఉన్నారు. ఇది నిజమే అయినా వీరిలో ఎంతమంది కార్యవిస్తరణ కొరకు పని చేస్తారన్నది మనం ఆలోచించాల్సిన అవసరంలేదా? ఈ నలభైవేల మందిలో కార్యతత్పరతతో విస్తరించాలనుకునేవారి సంఖ్య ఎంత ఉండాలనుకుంటున్నామో, అంత లేదన్నది మనం గుర్తించితీరాలి” అన్నారు. వేలాది సంఘ స్వయంసేవకుల నుండి డాక్టర్జీ అపేక్షను పూర్తిచేయగల స్వయంసేవకులను ఎలా లెక్కి౦చగలము? ఆనాటి సంఘశిబిరాలలో, అధికారిప్రశిక్షణావర్గ (OTC) లలో పాల్గొన్న శిక్షార్థి స్వయంసేవకుల సంఖ్య దీనికి సహాయపడగలదు. 1937 వరకు నాగపూర్ జిల్లా శిబిరం, నాగపూర్ శిబిరం అని వివిడివిడిగా కాక ఒక్కటిగానే నాగపూర్ లో నిర్వహించేవారు. 1937 డిశంబర్ లో నాగపూర్ కేంద్ర శిబిరాన్ని జిల్లా శిబిరం నుండి విడదీశారు. మొట్టమొదటిజిల్లా శిబిరం కాటోల్లో నిర్వహించారు. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు Dr Hedgewar letters cleaned 1937/ November 1937/25-11-37 a, 25-11-37 b)
అకోలా జిల్లా సంఘచాలక్ గోపాలకృష్ణ ఉరఫ్ బాబాసాహెబ్ చింతలేకు 1935 సెప్టెంబర్ 17న వ్రాసిన ఒక ఉత్తరంలో ‘బరార్ లో సంఘకార్యం గురించి నిష్పాక్షిక విశ్లేషణ చేస్తూ ఈనాటికి అమరావతిజిల్లా ఏమాత్రం సంఘటితం కాలేదు. అలాంటపుడు అమరావతి సంఘకార్యం గురించి పేర్కొనడం ఎలా సాధ్యమవుతుంది. బుల్డాణా జిల్లాలో ప్రముఖమైన శాఖ ఏదన్నది కూడా నేటికి నిర్ధారణ కాలేదు. ఆ జిల్లాకు జిల్లాసంఘచాలక్ ను నియుక్తి చేయలేదింకా. మొత్తం బరార్ కు సంఘచాలక్ ను ఇప్పటికీ చేయలేదు” అని అన్నారు.
(సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు, Dr. Hedgewar letters cleaned / 1935/ September 1935 17/9/35 a).
న్యాయవాది శ్రీధర్ అనంత ఉరఫ్ బాపూసాహెబ్ సహాని రూపంలో 1936 డిశంబర్ లో బరార్ కు, న్యాయవాది రామచంద్ర నారాయణ ఉరఫ్ బాబాసాహెబ్ పాధ్యే రూపంలో 1938 ఫిబ్రవరి 12 న మధ్యప్రాంతానికి ప్రాంత సంఘచాలకులు లభించారు . 1936 ఫిబ్రవరిలో బాబాసాహెబ్ చింతలేకు ఉత్తరం ద్వారా బాధను వ్యక్తపరుస్తూ డాక్టర్జీ “నేడు నాగపూర్ సంఘ్ వద్ద ఒక్క పైసా కూడా మిగలలేదు” అని వ్రాశారు. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు Dr Hedgewar letters cleaned / 1936 / April 1936 undated a)
భాగానగర్ నిరాయుధ సత్యాగ్రహానికి ప్రముఖంగా నాయకత్వం లభించిన పుణెనగరంలో మహారాష్ట్ర ప్రాంత మొట్టమొదటి అధికారి ప్రశిక్షణావర్గ 1935 లోజరిగింది. అందులో పుణె నుండి 20 మంది, కొల్హాపూర్ నుండి 10 మంది, చిప్లున్ నుండి 6 మంది, సాంగ్లి నుండి ఇద్దరు, ఇతరచోట్ల నుండి మిగతావారు ఇలా మొత్తం 50 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. 1938 జూన్ 8 న నాగపూర్ ఆఫీసర్ స్టానింగ్ శిబిర సమారోప్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ క్యాంప్ సర్వాధికారి ప్రొ. మాధవరావు గోల్వాల్కర్ గురూజీ, ముంబై, బరార్, నాగపూర్, మహాకోసల్ , ఉత్తర హిందుస్థాన్, పంజాబు మొదలగు ప్రాంతాలు వేర్వేరు ప్రదేశాలకు చెందిన సంఘశాఖల నుండి సుమారు 525 మంది స్వయంసేవకులు పాల్గొన్నారని సమాచారం తెలిపారు. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు OTC Nagpar • Samapan Samaroh 1938)
‘సంఘ్ స్థాపనలో ఆలస్యం జరిగింది‘
నిరాయుధ సత్యాగ్రహ పోరాటం ప్రారంభమైనప్పుడే ప్రపంచ పరిస్థితి మారింది. రెండవప్రపంచయుద్ధం గుమ్మంలోకి వచ్చింది. భవిష్యత్తులో ప్రపంచయుద్ధం రాబోతుందనే అనుమానం 1922 నాటికే డాక్టర్జీకి కలిగింది. 1932 నాటి ఒక సంభాషణలో “మనం సమయాన్నివ్యర్థం చేశాం. రాబోయే అయిదు – పదేళ్ళలో ప్రపంచంలో యుద్ధవాతావరణం ఏర్పడబోతోంది. గతంలో జరిగిన యుద్ధం కారణం ఈయుద్ధంలో (స్వాతంత్య్రంకోసం) విశేష లాభమవుతుందని చెప్పవచ్చు” అన్నారాయన. డాక్టర్జీ చెప్పిన ఈ విషయం గురించి 1930-34 మధ్య చంద్రపూర్ సంఘచాలక్ గా ఉన్న న్యాయవాది రామచంద్ర రాజేశ్వర్ ఉరఫ్ తాత్యాజీ దేశముఖ్ సంస్మరణరూపంలోవ్రాసి ఉంచారు. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు Tribute to Dr Hedgewar Hastlikhit Lekh / -1 0007)
1925 కు కనీసం పదిసంవత్సరాల ముందు సంఘం స్థాపించిఉండాల్సిందనే ఆలోచనతోబాటు యుద్ధం ప్రారంభంకావచ్చనేది డాక్టర్జీ మాటల్లో వ్యక్తమైంది. ( సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు Nana Palkar |/Hedgewar Notes -4-4-106)
1934 ఆగష్టు 15న యవత్ మల్ జిల్లా సంఘచాలక్ అన్నాసాహెబ్ బత్కర్ కు వ్రాసిన ఉత్తరంలో సంస్థ భవిష్యత్ విస్తరణ, శక్తి గురించి డాక్టర్జీ “సంఘకార్యం ఇంత ఆలస్యంగా పారంభించాల్సిన పనికాదు. మనం మన అఖిల మహారాష్ట్రలో వీలైనంత త్వరగా సంఘటితకార్యం చేసి మహారాష్ట్రను ఇతర ప్రాంతాల ముందు ఒక ఉదాహరణగా చూపించి, అయిదు – పదేళ్ళలో హిందుస్థానాన్నిసంఘటితం చేయాలి” అని వ్రాశారు. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు Dr HedgewarLetters cleaned / 1934 / August 1934 15-8-34 a, 15 – 8 – 34 b)
లాహోర్, జబల్పూర్ ,లక్నో, ఢిల్లీలో సంఘకార్యం ప్రారంభించడానికి డాక్టర్జీ పంపించిన విద్యార్థిప్రచారకులు 28 జూన్ నుండి 1 జులై లోపల నాగపూర్ నుండి బయల్దేరివెళ్ళారు.
తన జీవనకార్యం పూర్తవ్వడాన్ని చూసే అవకాశం ఆ విధాత డాక్టర్జీకి ఇవ్వలేదనేది దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం . `1939 లో ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక, తన కార్యం సరిగా వేళ్లూనుకోలేదనే బాధ డాక్టర్జీకి ఉండేది. ఇది ఆయన ప్రవర్తన ద్వారా నాకు అర్థమయ్యేది’ అని బరార్ ప్రాంత సంఘచాలక్ బాపూసాహెబ్ సహాని పేర్కొన్నారు. ( సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు . Nama Palkar / Hedgewar notes – 22-215)
1940 మేలో జరిగిన ఒక సంఘటన గురించి జనసంఘ్ అధ్యక్షులుగా ఉండిన పండిత బచ్రాజ్ వ్యాస్ ఇలా వివరించారు – “డాక్టర్జీని కలవడానికి వెళ్ళినపుడు ఆయన ఇలాఅన్నారు.. ఐరోపాదేశాలలో పది, పదిహేను ఏళ్ళలో జరిగిన అభివృద్ధితో, అదే పదిహేను ఏళ్ళలో మనం ఎంతో కష్టపడిన తర్వాత కూడా ఎన్నోప్రాంతాలలోమన పని ప్రారంభమైంది అనేది చూస్తేగనుక మనస్సు వ్యాకులతతో నిండిపోతుంది. అయితే కష్టపడటంతప్ప మరే ఇతర మార్గమూలేదు. ఈ ఒక్క జన్మలో దేశోద్ధరణకార్యం పూర్తవడం బహుశా ఆ భగవదేచ్ఛకాదేమో అనిపిస్తుంది. ఇంకెన్నిరోజులు పనిచేయాల్సి వస్తుందో; అయినా ఈ మార్గంతప్ప మరో మార్గమేదీలేదు. ఎందుకంటే విజయం అనేది ఈ మార్గం ద్వారానే లభిస్తుందనే విశ్వాసముంది’. (సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు Nama Pellkar /Hedgewar notes -33-109) తర్వాత నెల అంటే 1940 జూన్ 21 న డాక్టర్జీ ఐహికయాత్ర ముగిసింది.
సంఘం తటస్థమేకాని స్వయంసేవక్ పాల్గొనడం ఐచ్చికం
హిందూసంఘటన అనే నిత్యకార్యాన్నినిర్లక్ష్యం చేయకుండా నిరాయుధ సత్యాగ్రహంలాంటి అవసరమైన, నైమిత్తిక ఉద్యమాలకు సహకారం అందించడమన్నది డాక్టర్జీ ముందున్న ఒక సవాలు. సంఘాన్ని ఉద్యమాలకు తటస్థంగా ఉంచుతూనే వాటికి వ్యక్తిగత రూపంలో సమర్థన తెలుపుతూ సంఘ స్వయంసేవకులు వాటిలో పాల్గొనేందుకు అనుమతించే పనిని డాక్టర్జీ నిర్వర్తించారు. చేతిలోకి తీసుకున్న పని ఈ జన్మలో పూర్తిచేయలేనేమోననే బాధను మనసులోనే దాచుకుంటూ ఆయన ఇవన్నీ చేయడం విశేషమే.
ఆయన నిర్వర్తించిన ఈ పనిని సమీక్షించడమనేది హిందుల నిష్ఠ మీద ఆధారపడి జరగలేదు. ఫలితంగా డాక్టర్జీ గురించి విశ్లేషణలు చేయబడ్డాయి. ఆయన నిర్వర్తించిన పాత్రపై తీవ్ర విమర్శ చేస్తూ 12 వ్యాసాలు 1939 మే 14 లోస్థాపితమైన ‘హిందూసైనికదళ్’ ఉపాధ్యక్షుడు గోపాల్ గోవింద ఉరఫ్ దాదాసాహెబ్ అధికారి అనే స్వయంసేవక్, ‘వందేమాతరం’ వారపత్రిక సంపాదకుడు వ్రాశారు. (డాక్టర్జీ చనిపోయినప్పుడు దాదాసాహెబ్ అధికారి ఎంతో భావోద్వేగంతో కూడిన శ్రద్ధాంజలి వ్యాసం వ్రాశారు) ఈ విశ్లేషణపై హిందుత్వనిష్ఠ కలిగిన ‘సావధాన్ ‘ వారపత్రిక (1939 మే 27న) సమాధానమిస్తూ ‘ దేశవిమోచనం కోసం చివరివరకూ ఒకే దెబ్బవేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంతిమ యుద్ధక్షణం రావడానికి పూర్వతయారీ దేశవిమోచనానికి నిత్యకార్యం కాగా భాగానగర్ వంటి ఉద్యమం దేశవిమోచనానికి నైమిత్తికకార్యం. ఈ వేర్వేరు పనులు చేసే సంస్థలు వేరుగా ఉంటాయి, ఉండాలి కూడా. అయినా ఈ రెండుపనులు సమాంతరంగా జరగాలి, జరపాలంటే నిత్యకార్యంలో అంతరాయం కలిగితే దానివల్ల, తనదైన విశిష్టత, సర్వస్వశక్తి నిత్యనైమిత్తికకార్యాలలోఖర్చుచేయలేదు’
(సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు Nana Palkar / Hedgewar Notes – 5, 5 – 151)
సంఘానికి సమాజం కాకుండా మరో స్వంత అస్తిత్వంలేదు
నిరాయుధ సత్యాగ్రహపోరాటంలో పాలుపంచుకోవడానికి అనుమతించే ఉత్తరాన్నిడాక్టర్జీ సంఘశాఖలకు వ్రాయలేదు. అయితే ఎవరైనా సత్యాగ్రహంలో పాల్గొనాలనే కోరిక వ్యక్తపరిస్తే, ఆయన వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం వ్రాసి అభినందించారు.”రా. స్వ. సంఘ్ స్వయంసేవక్, హిందూసమాజపు ఒ కఘటకుడు అవుతాడు. సంఘానికి వచ్చేటపుడు సమాజపు సభ్యత్వానికి రాజీనామాపత్రం ఇచ్చిరాడు. హిందూసమాజపు ఒక ఘటకుడిగా ఇలాంటి ఉద్యమం కోసం ఏది అవసరమో అది చేయడానికి స్వయంసేవక్ కూడా స్వతంత్రుడే’ అనే ఆలోచనను డాక్టర్జీ కలిగిఉండేవారు.
(సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు. Registers / Register 1 DSC – 0056)
దేశహితానికి చెందిన ఏ ఉద్యమంలోనైనా సంఘ స్వయంసేవకులు తమ సంస్థాగత అస్తిత్వాన్ని సమాజంలో విలీనం చేస్తూ సమాజ ఘటకుడి రూపంలో సహజంగానే భాగస్వాములు కావాలి అనే ప్రాథమిక ఆలోచన డాక్టర్జీ నిర్వర్తించిన పాత్ర వెనుక ఉంది .
సంఘటనాత్మక దృష్టితో సంఘాన్నితటస్థంగాఉంచుతూ కూడా ఉద్యమానికి తగినంత సంఖ్యలో పంపించి లబ్ధి చేకూర్చేలా బాధ్యతవహించారు డాక్టర్జీ. మహారాష్ట్ర ప్రాంత హిందూసభ కార్యదర్శి శంకర రామచంద్రదాతే గారు ఈ ఉద్యమంలోప్రారంభకాలం నుండి పాల్గొంటున్నారు. 1933 లో ఆయన సంఘప్రతిజ్ఞ స్వీకరించారు. నిజాంపాలనలోని మరాఠ్వాడాలో రహస్యంగా పర్యవేక్షించి అక్కడి హిందువుల పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మహారాష్ట్ర ప్రాంత హిందూసభ ద్వారా నియమింపబడిన త్రిసభ్యసమితిలో ఆయన ఒక సభ్యుడు. 1938 మేలో డాక్టర్జీ హిందుయువక పరిషత్ కొరకు పుణెకు వచ్చినపుడు, ఆయనను కలిసినప్పటి వివరాలను దాతే తెలిపారు. డాక్టర్జీని “ధ్యేయవాదంతో కూడిన సౌజన్యమూర్తి’ అని పేర్కొంటూ మహారాష్ట్ర నుండి కనీసం 500 నిరాయుధ ఉద్యమకారులు బయల్దేరాలని ఆయన సలహా ఇచ్చారు ( రాష్ట్రకాంగ్రెస్ ప్రతినిధి, ఆర్యసమాజీయులు, హిందూసభావాదులు) నిజాంరాజ్యం నుండి వేయికి పైగా ప్రజలు సత్యాగ్రహంలో పాల్గొంటారనే ఆశాభావం వ్యక్తపరిచారు. ఆయన సూచనకు మేము ఎంతో ఋణపడ్డాము. అయితే నేటివరకూ అంత పెద్దసంఖ్యలో మేము సత్యాగ్రహం నిర్వహించలేదు. ఈ కారణంగానూ, మావద్ద ఆ విధమైన సువ్యవస్థితమైన సంస్థలేనందున మేము హెడ్గేవార్ సమక్షంలో మా ప్రశ్నను వేయాలని నిశ్చయించుకున్నాము. దాని ప్రకారం ఆయన పూణె పర్యటన సందర్భంగా, మేము ముగ్గురమూ ఆయనను కలవడం, మా దృష్టికి వచ్చిన నిజాంరాజ్య పరిస్థితి, అక్కడి నాయకులతో జరిగిన సంభషణ వివరాలను ఆయనకు చెప్పడం జరిగింది. మా మాటలు, ఆశయాన్నిఆయన వెంటనే అర్ధం చేసుకుని, విశ్వాసపూరితంగా అయిదువందలమందిని సత్యాగ్రహం కోసం పంపించాలంతేగదా, దాని గురించి బెంగపడకండి, మిగిలినదంతా మేము చూసుకుంటాము అన్నారు. ఏ ఆత్మవిశ్వాసంతో ఈ మాటలన్నీఆయన అన్నారో, సానుభూతిని వ్యక్తం చేశారో అదంతా ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఉద్యమం ప్రారంభించడానికి ముందు హెడ్గేవార్ దానిని సమర్థించారు, విశ్వాసం కలిగించారు. అలాగే పని పెంచడానికి ఆత్మవిశ్వాసం కలిగించారు.
(సంఘ్ అభిలేఖాగార్, హెడ్గేవార్ఉత్తరాలు Dr Hedgewar Athavani 2 0001 – A t0 0001 – డి ; 1955 జులై 11నదాతే వ్రాసిన సంస్మరణ )
నిరాయుధ సత్యాగ్రహఉద్యమం ఎదుగుదలలో పాల్గొని, దాని చరిత్ర వ్రాసిన ఔరంగాబాదుకు చెందిన న్యాయవాది దత్తాత్రేయ జి. దేశపాండే ఉరఫ్ బాబూరావు జాఫరాబాద్కర్ “డా|| హెడ్గేవార్, సర్ సంఘచాలక్ పద్ధతి, ఆదేశానుసారం వేలాదిమంది నిరాయుధ సత్యాగ్రహులు ప్రదర్శనకి సిద్ధమయ్యారు. వారంతా గుంపులుగుంపులుగా రాజ్యంలోకి ప్రవేశించి సత్యాగ్రహం చేశారు, జైలు జీవితాన్ని అనుభవించారు. నాగపూర్ హిందూసభకార్యకర్తలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకులు మధ్య భేదమేమీ లేదు. అభేద్యమైన హృదయం మాత్రమే ఆనాడు ఉండింది..ప్రౌఢస్వయంసేవకులు హిందూసభ కార్యకర్తలుగా మారిపోయారు ” అని వ్రాశారు .
(ద. గ. దేశ్ పాండే, హైదరాబాదు – వర్వాడముక్తిసంగ్రామ్, నవభారత్ ప్రకాశన్ సంస్థ, ముంబై 1987 , పేజీలు 84,85)
సావర్కర్ – హెడ్గేవార్ సారూప్యత
నిరాయుధ ప్రతిక్రియకు ప్రేరణ స్వాతంత్య్రవీరసావర్కర్. హిందూరాష్ట్రపతి బా.సావర్కర్, సర్ సంఘచాలక్ డా || హెడ్గేవార్ మధ్య పరస్పరస్నేహం, ఆదరభావం, సారూప్యత ఉన్నాయి. డాక్టర్జీ పాత్ర విషయంలో సావర్కర్ గారి ఆలోచన ఎలా ఉన్నది? దీని గురించిన వివరం డాక్టర్జీ స్వర్గస్థులయ్యాక, హిందూమహాసభ అధ్యక్షుడు 1940 జులై 13న నూతన సర్ సంఘచాలక్ గోళ్వాల్కర్ గురూజీకి ఆంగ్లభాషలో వ్రాసిన ఉత్తరం ద్వారా తెలుస్తుంది . డాక్టర్జీపట్ల అపారమైన స్నేహాన్ని ప్రకటిస్తూ సావర్కర్ గారు “ హెడ్గేవార్ జీవితకాలంలో హిందూస్థాన్ అంతటా వేలాదిసంఖ్యలో పాల్గొన్న అనేక సంఘసభలలో నేను ఉపన్యాసాలిచ్చాను. (అయితే) సంఘంవిషయంలో చెప్పాలంటే. ఏ ప్రశ్నకైనా డాక్టర్ హెడ్గేవార్ మాటలే అంతిమం, ఆయన తెలివితేటలు, మేధస్సుపట్ల, నాకు పూర్తి విశ్వాసం ఉంది” అన్నారు.
(సంఘ్ అభిలేఖగార్, హెడ్గేవార్ ఉత్తరాలు, Dr. Hedgewar Miscellanies / Mumbai / V.D. Savarkar 0001). మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ కాశీనాధ్ భాస్కర్ ఉరఫ్ కాకావిమయే, సతారా జిల్లా సంఘచాలక్ శివరామ్ విష్ణు ఉరఫ్ భావరావ్ మోదక్, షోలాపూర్ జిల్లా సంఘచాలక్ రా మచంద్రశంకర్ ఉరఫ్ రాంభావురాజవాడే, అహ్మద్ నగర్ సంఘచాలక్ చింతామణి మోహనరాజ్ ఉరఫ్ నానారావుసప్తర్షి, సంఘచాలక్ డా॥యాదవశ్రీహరి ఉరఫ్ తాత్యాజీఆణే, సావనేర్ సంఘచాలక్ నారాయణకృష్ణాజీ ఉరఫ్ నానాజీఅంబాకర్, డా॥ల.వా. పరాంజపే, విశ్వనాధరావుకెల్కర్, ముంబైకి చెందిన డా. నారాయణరావు సావర్కర్, ఉమర్ఖేడ్ కు చెందిన నానాసాహెబ్ నాయక్ మొదలైన ప్రముఖ సంఘ స్వయంసేవకులు, హిందూమహాసభ కార్యకర్తలూ కూడా ఉన్నారు. వారంతా నిరాయుధ సత్యాగ్రహఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. డాక్టర్జీ సమర్థనతో ఏఏ స్వ. సే.లు. ఆ ఉద్యమంలోపాలుపంచుకున్నారనేది తర్వాతి వ్యాసంలో చూద్దాం ….
Read Also : హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: మొదటి భాగం
హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం
హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ ప్రతిఘటన – మూడవ భాగం
హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ ప్రతిఘటన – నాలుగవ భాగం