Home Telugu Articles అన్ని భాషలను జాతీయ భాషలుగా పరిగణిస్తాను: ‘భాషా సమస్య’ పై శ్రీ గురూజీ

అన్ని భాషలను జాతీయ భాషలుగా పరిగణిస్తాను: ‘భాషా సమస్య’ పై శ్రీ గురూజీ

0
SHARE

భారత్‌‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్(RSS) అనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా దేశంలో అన్ని భాషలూ జాతీయ భాషలేనని RSS చెబుతూ వస్తున్నది.

‘భాష సమస్య’ పై వారి అభిప్రాయాలను RSS ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ గోల్వాల్కర్ స్పష్టంగా తెలిపారు. వారి అభిప్రాయాలతో కూడిన రెండు ఇంటర్వ్యూలు ‘ఆర్గనైజర్’ పత్రికలో 1957 డిసెంబర్‌లో మరియు 1967 అక్టోబర్‌లో వరుసగా ప్రచురితమయ్యాయి. ప్రశ్న, జవాబు రూపంలో ప్రచురితమైన ఇంటర్వ్యూల తెలుగు అనువాదం దిగువన ఇస్తున్నాము.

ప్రశ్న: దేశ భాషల్లో ఏది మన జాతీయ భాష అవుతుంది?
జవాబు: మన భాషలన్నింటిని జాతీయ భాషలుగా నేను పరిగణిస్తాను. అవి సరిసమానమైన మన జాతీయ వారసత్వ సంపద. వాటిలో హిందీ ఒకటి. దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న భాష కావడంతో హిందీని రాష్ట్ర భాషగా స్వీకరించడానికి సంకల్పించారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా పేర్కొనడం సరికాదు. అది సహేతుకమైన దృక్కోణం కాదు.

ప్ర: కొద్ది కాలం క్రితం, డాక్టర్ సి.రామస్వామి అయ్యర్ హిందీ భాషను బహిరంగంగా అపహాస్యం చేశారు. తులసీ రామాయణం, రైల్వే టైమ్ టేబుల్‌ను హిందీలో ప్రచురితమైన రెండు గొప్ప పుస్తకాలుగా ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ సి.పి.రామస్వామి అయ్యర్ వ్యాఖ్యలకు సర్దార్ పనిక్కర్ వంత పాడారు.
జ: హిందీ భాషను నిర్లక్ష్యం చేసే వారు మాత్రమే ఆ భాషను అపహాస్యం చేస్తారు. ఇతర భాషలను వెక్కిరించే ఈ ధోరణికి స్వస్తి చెప్పాలి. కొద్ది కాలం క్రితం, ప్రముఖ మరాఠా నాటకకర్త రామ్ గణేష్ గడ్కరీ తాను రూపొందించిన ఒకానొక పాత్రతో “దక్షిణాది భాషలు, కొన్ని రాళ్ళను ఒక డబ్బాలో వేసి ఆడిస్తే, ఆ భాషలను మీరు వినవచ్చు” అని చెప్పించారు. హాస్యం పుట్టించడానికి మాత్రమే అలా చెప్పించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అలాంటి విచ్ఛినకరమైన వినోదం దేశానికి ఏ మాత్రం మంచిది కాదు.

ప్ర: హిందీ ఎదుగుదల తమ మాతృభాషలను గ్రహణంలా కమ్మేస్తుందని కొందరు భావిస్తున్నారు
జ: అలా జరుగుతుందని నేను అనుకోవడంలేదు. ఉదాహరణకు, ఆంగ్ల భాష ఆధిపత్యంలోనూ బెంగాలీ, తమిళం, మరాఠీ, తెలుగు భాషలు వర్థిల్లాయి. హిందీ భాష ఎదుగుదలతో ఈ భాషలు మరింతగా వర్థిల్లుతాయి. అదే సమయంలో హిందీ మరింతగా విరాజిల్లుతుంది. బెంగాలీ భాష హిందీయీకరణ గురించి బెంగాలీలు భయపడటం ఎందుకు? గడిచిన 20 సంవత్సరాలుగా బెంగాలీ భాష ఉర్దూయికరణకు గురైంది. ‘ఉదయం’ పదానికి గాను బెంగాలీలో ‘ప్రభాతే’ పదాన్ని వినియోగించేవారు. కానీ ప్రస్తుతం ‘ప్రభాతే’ స్థానాన్ని ‘ఫజరే’ అనే ఉర్దూ పదం ఆక్రమించుకుంటున్నది. కానీ దీనిపై ఇంతవరకు బెంగాలీల నుంచి ఒక్క నిరసన గళం కూడా వినిపించలేదు. అలాంటప్పుడు హిందీ భాష అంటే వారికి ఎందుకు అంత ఏహ్యభావం?

తమిళ భాషను హిందీ దెబ్బ తీస్తుందని కొద్ది కాలం క్రితం మదురైలో ఒక అడ్వకేట్ నాతో అన్నారు. అదెలా అని నేను అతడిని అడిగాను కానీ అతడు వివరించలేకపోయాడు. జిల్లా కోర్టులో అనుమతించినప్పటికీ తమిళ భాషకు బదులుగా ఆంగ్ల భాషను ఎందుకు వినియోగిస్తున్నారని నేను అతడిని ప్రశ్నించాను. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు నేను అతడితో తమిళానికి శత్రువు హిందీ కాదు. ఇరు భాషలకు శత్రువు ఆంగ్ల భాష అని అన్నాను.

ప్ర: నాలుగు భాషలు – మాతృభాష, హిందీ, సంస్కృతం, ఆంగ్లము మరీ ఎక్కువ అని మీరు భావించడంలేదా? అవి ఒక విద్యార్థి విలువైన సమయంలో సగ భాగాన్ని వినియోగించుకుంటాయి.
జ: కావచ్చు కానీ ఆ నాలుగు భాషల్లోనూ అత్యధికంగా ఉపేక్షించవలసిన భాష ఆంగ్లము. అది తప్పనసరి భాషగా ఉండరాదు. ప్రభుత్వం ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి, తక్షణం అమలు చేసిన పక్షంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది. ప్రస్తుత నిర్ణయరాహిత్యం ఆంగ్ల భాషను మరింత బలోపేతం చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు బాలబాలికల్లో అత్యధికులు కాన్వెంట్ పాఠశాలలకు వెళుతున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి “ఆంగ్లభాషను భారత్ వ్యవహార భాషగా చేయాలి” అని బహిరంగంగా విజ్ఞప్తి చేయటం ప్రారంభించారు. ఈ కీలకమైన రాష్ట్ర వ్యవహారంలో ప్రభుత్వం ఒక ఊగిసలాట వైఖరిని చేపట్టిన పక్షంలో అది ప్రజా విశ్వాసాన్ని భూస్థాపితం చేస్తుంది.
పూర్వ మధ్యప్రదేశ్‌లో విద్యా శాఖ తన కార్యకలాపాలను హిందీ, మరాఠీ భాషల్లో కొనసాగిస్తున్నది. కానీ అతి పెద్ద బాంబే ఆవిర్భవించిన తర్వాత పూర్వ మధ్యప్రదేశ్‌లో మరాఠీ ప్రాంతాలు తిరిగి ఆంగ్ల భాష వైపునకు మొగ్గు చూపాయి.
పూర్తి మార్పు కోసం రాజ్యాంగం నిర్దేశించిన కాల పరిమితికి లోబడి 1965 నాటికి రాష్ట్ర భాషగా ఆంగ్లభాష స్థానాన్ని భర్తీ చేయడమే ఏకైక మార్గం. ప్రకటిత విధానానికి మరియు దానిని అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏకరీతిన ఉండాలి.

ప్ర: రాష్ట్ర భాషగా హిందీని ఆపాదించిన పక్షంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడతారని రాజాజీ అంటున్నారు
జ: అలాంటిదేమీ ఉండదు. వారు భాషలను చాలా త్వరగా స్వీకరిస్తారు. దక్షిణ భారతీయులు కాశీ లేదా ప్రయాగ వచ్చినప్పుడు ఏ భాషలో మాట్లాడుతారు? అది హిందీ భాష లాంటిదే కదా?

ప్ర: ఈ యాత్రికుల్లో అత్యధికులు బ్రాహ్మణులు కారా?
జ: కారు. ఇతరులు అధికంగా ఉన్నారు. కాశీ విశ్వనాథ దేవస్థానంలో వినియోగించే గంధం, పుష్పాలు, అగరుబత్తులు, తదితర పూజా సామాగ్రిని తమిళనాడులో నట్టుకొట్టై చెట్టియార్‌లకు చెందిన సంస్థ ప్రతి దినం సరఫరా చేస్తున్నది.

ప్ర: ఆంగ్ల భాష అందరికీ సరిసమానమైన విదేశీ భాష కనుక రాష్ట్ర భాషగా దాని కొనసాగింపు న్యాయమైనది మరియు సముచితముగా ఉంటుందని రాజాజీ అంటున్నారు
జ: అందరికీ సరిసమానమైన విదేశీ భాషను అంతే సరిసమానంగా దానిని అందరూ త్యజించాలి. అది అందరికీ సరిసమానంగా అన్యాయమైనది మరియు అసంబంద్ధమైనది. తమిళ భాషను ఒక రాష్ట్ర భాషగా ఆపాదించాలని ఈ నేతలు వాదించిన పక్షంలో దానికి ఒక అర్థం ఉంటుంది. అది అత్యంత ఘనమైనది మరియు అత్యంత పురాతనమైనది అని వారు చెప్పవచ్చు. దానికి కొంత ఔచిత్యం ఉండాలి. కానీ ఆంగ్ల భాష నైరాశ్యంతో కూడుకున్న ఒక ఆలోచన.

ప్ర: ఈ విధంగా మాట్లాడుతున్న ప్రముఖ నాయకులకు వివరణ ఏమిటి?
జ: రెండు వివరణలు సాధ్యం. అయితే వారు DMK అనుకూల పవనాలను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు లేదా వ్యక్తి యొక్క సంకుచితవాదానికి దీనిని ఒక ఎరగా చూపి దాని ప్రాతిపదికగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే ప్రయత్నం కావచ్చు. మొదటి ప్రయత్నం చేయవచ్చు కానీ అది విఫలమవుతుంది. రాజాజీ కేవలం DMK ఆలోచలను మాత్రమే గౌరవిస్తున్నారు. రెండవది, హిందీని ప్రవేశపెట్టిన పక్షంలో దేశం మరింతగా విభజనకు నోచుకుంటుందని బెదిరించడం రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదు.
ప్ర: 1965లో హిందీని రాష్ట్ర భాషగా చేసిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలతో కూడిన ద్విభాషావిధానాన్ని ప్రవేశపెట్టడం సలహా ఇవ్వతగినదిగా భావిస్తున్నారా?
జ: లేదు. ఇప్పుడే ద్విభాషావిధానాన్ని ఆపాదించుకుందాం. 1965కు కొన్ని సంవత్సరాల మునుపే అమలు చేసుకుందాం. వాస్తవానికి ద్విభాషావిధానం మనకు ఇప్పటికే ఉండి ఉండవలసినది.

ప్ర: ఆంగ్ల భాషకు బదులుగా హిందీని ప్రవేశపెట్టిన పక్షంలో ఆంగ్ల భాషలో నిష్ణాతులైన తాము, హిందీ భాషలో అంతే ప్రావీణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది కనుక ప్రభుత్వ సర్వీసుల నియామకం విషయంలో అది తమకు ప్రతికూలమవుతుందని దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు భావిస్తున్నారు.
జ: ముందుగా, దక్షిణ భారతదేశంలో నివసించే ప్రజలు ఆంగ్ల భాషలో నిష్ణాతులని చెప్పడం సరికాదు. దేశ జనాభాలో ఒక శాతం ప్రజల్లో ఆంగ్ల భాష తెలిసిన వారిలో అత్యధికులు మాట్లాడే భాషను ఆంగ్ల భాష అని గుర్తించడం చాలా కష్టం. ఇందుకు దక్షిణాది ప్రజలు మినహాయింపు కాదు. ఈ దిశగా ప్రభుత్వం ఒకసారి కచ్చితమైన నిర్ణయం తీసుకున్న 10 సంవత్సరాల వ్యవధిలోనే దక్షిణాది ప్రజలు హిందీ భాషను సులభంగా అందుకుంటారు. ఇప్పుటికే సేవకులు, హమాలీలు ‘టూ పైస్’ నుంచి ‘దో పైసే’ (రెండు పైసలు) కు మారిపోయారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి చిన్నమార్పును ఎందుకు పట్టించుకోరు?

ప్ర: కానీ వారు (దక్షిణాది ప్రజలు) హిందీ మాతృభాషగా ఉన్న వారి తరహాలో హిందీలో మాట్లాడటం మరియు వ్రాయడం చేయగలరా?
జ: ఎందుకు చేయలేరు? 15 కోట్ల నుంచి 20 కోట్ల మందికి మాతృభాషగా చెలామణి అవుతున్నహిందీ భాష మాత్రమే రాష్ట్ర భాషగా ఆపాదించబడుతుందని భావించడం సరికాదు. అలాంటిదేమీ ఉండదు. వీరంతా కూడా హిందీకి చెందిన అన్ని రకాల్లోనూ మాట్లాడుతుంటారు. ప్రామాణికమైన సంస్కృతీకరణ చెందిన హిందీ మాత్రమే కేంద్ర భాష అవుతుంది. ఆ మేరకు, ప్రతి ఒక్కరూ దానిని సరిసమానమైన సౌలభ్యంతో నేర్చుకోగలరు. దక్షిణాదికి చెందిన హిందీ భాషా విద్యార్థులు ఉత్తరాది విద్యార్థుల కన్నా స్వచ్ఛమైన హిందీని మాట్లాడుతారని, వ్రాస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్ర: వారిలోని భయాలను పారద్రోలడానికి హిందీయేతర భాషలు మాతృభాషగా కలవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా?
జ: అలాంటి ఒక డిమాండ్ అనవసరం మరియు అవాంఛనీయము. అది జాతి సమరసతను దెబ్బ తీస్తుంది. హిందీ మాతృభాషగా కలిగిన వారితో వారు సమర్థమంతంగా పోటీ పడగలరు. ఏదెలాగున్నా, వారికి హిందీలో ప్రావీణ్యం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరడానికి అవసరమైన మేరకు హిందీ భాషలో ప్రవేశం వారికి ఉంటే చాలు. ఏదైనా ఇబ్బందులు ఉన్నపక్షంలో అన్ని సాంకేతిక పదాలకు ఒక ఉమ్మడి సంస్కృత నిఘంటువును తీసుకురావడం ద్వారా వాటిని తగ్గించవచ్చు. అన్ని భాషలకు ఒక ఏకరీతి లిపి అమలు వారిని మరింత దగ్గర చేస్తుంది. ఆంగ్ల భాషకు కేటాయించే సమయంలో అర్థ భాగాన్ని కేటాయించడం ద్వారా హిందీ భాషను వారు అత్యంత సునాయసంగా స్వీకరించవచ్చు.

ప్ర: ఆంగ్ల భాషను ఒక అంతర్జాతీయ వాణిజ్యం మరియు దౌత్యానికి చెందిన భాషగా ఆ భాషను సమర్థించేవారు అంటున్నారు.
జ: అది సరికాదు. ఆంగ్ల భాష కేవలం ఒక శక్తిమంతమైన కూటమికి మాత్రమే ప్రబలమైన భాష. ఏదెలాగున్నా, ఆంగ్లం నేర్చుకోవాలనుకునేవారిని వారంతట వారుగా నేర్చుకోనిద్దాం. అత్యున్నత ఆర్థిక వ్యవహారాలు లేదా అత్యున్నత దౌత్యంతో ఏ మాత్రం సంబంధం లేని ప్రతి పాఠశాల విద్యార్థి దానిని (ఆంగ్ల భాష) ఎందుకు నేర్చుకోవాలి?

ప్ర: వారికి బెంగాల్, మహారాష్ట్ర లాంటి హిందీయేతర ప్రాంతాల్లో అనేక మంది మద్దతుదారులు లభించే అవకాశం ఉందా?
జ: లేదు. అత్యధికంగా ఇప్పటికీ బ్రిటీషా పాలన నుంచి లబ్దిని విశ్వసించే ’ వయోవృద్ధ ఉదారవాదులు’ వారితో చేరవచ్చు. వారు తమకు మాత్రమే పరిమితమైన ఒక గతానికి చెందినవారు.

ప్ర: హిందీని ప్రవేశపెట్టడానికి ఒక ఏకాభిప్రాయంతో కూడుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం పొందాలని ప్రధాన మంత్రి అంటున్నారు.
జ: కానీ life insurance ను జాతీయం చేసినప్పుడు వారు ఏ ఒక్కరిని సంప్రదించలేదు! వారు గ్రామదాన్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కానీ అటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇటు పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ దాని గురించి ఏమీ చెప్పలేదు.

ప్ర: కేంద్ర ప్రభుత్వపు భాష విధానం గురించి మీ అభిప్రాయం?
జ: నాకు ఎక్కడా కూడా ఎలాంటి విధానం కనిపించడంలేదు. నాకు కనిపిస్తున్నది అంతా ఊగిసలాట మరియు నిర్ణయ రాహిత్యం. ప్రభుత్వం వృత్తాల్లో పరిభ్రమిస్తున్నట్టు కనిపిస్తున్నది.

శ్రీ పి.బి.గజేంద్ర గడ్కర్ వ్రాసిన ఒక కథనం ( ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా, అక్టోబర్ 17, 1967) చదివాను. అందులో చివరి పేరా వేర్పాటువాద ధోరణులను బలపరుస్తున్నది. విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాల్లో హిందీని ప్రవేశపెట్టిన పక్షంలో ఒక ‘యుద్ధ సన్నద్ధ స్పందన’ కోసం ఆయన వాదించారు.

ప్ర: విద్యా విధానంలో అన్ని స్థాయుల్లోనూ మాతృభాషలోనే విద్యా బోధన జరగాలనే విద్యా మంత్రి శ్రీ త్రిగుణ సేన్ ప్రతిపాదించిన ఫార్మాలా ఉత్తమమైనది మరియు సహేతుకమైనదని మీరు భావిస్తున్నారా?
జ: అవును. అది చేయాల్సిన సరైన చర్య. చాలా కాలం క్రితమే ఆ పని చేసి ఉండాల్సింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి మరొక విశ్వవిద్యాలయానికి విద్యార్థుల తరలింపు సమస్య విషయానికి వస్తే వారి సంఖ్య ఎంత ఉంటుందని?

ప్ర: ఉన్నత విద్యలో మాధ్యమంగా స్వంత భాషను ఒక రాష్ట్రం అభివృద్ధి చేసుకోలేని పక్షంలో ఏమి జరుగుతుంది? ఉదాహరణకు, కాశ్మీర్‌లో కశ్మీరీ కడకు ప్రాథమిక విద్యలో సైతం బోధనా మాధ్యమం కాదు.
జ: అలాంటి సందర్భాల్లో, హిందీ లేదా మరే ఇతర భారతీయ భాష మాధ్యమంగా వ్యవహరించే అంశాన్ని రాష్ట్రం నిర్ణయించుకోవాలి. ఉన్నత విద్యా బోధనకు ఒక మాధ్యమంగా అన్ని నాలుగు దక్షిణాది భాషలు అభివృద్ధి చెందాయని నేను నిస్సందేహంగా చెప్పగలను.

ప్ర: తమిళ భాషను ఒక ”అనాగరికమైన వనవాసీ భాష” అని ద్రవిడ కళగానికి చెందిన ఇ.వి.రామస్వామి నాయకర్ ఎందుకని అన్నారు?
జ: కేవలం EVR మాత్రమే చెప్పగలరు.

ప్ర: అనుసంధాన భాషగా సంస్కృతం ఉండాలని కొందరు అంటున్నారు. అది ఒక స్వాగతించదగిన సలహా కాదా?
జ: హిందీని వ్యతిరేకించే వారందరూ సంస్కృతాన్ని ఆమోదించిన పక్షంలో అత్యధికంగా సంతోషిస్తాను. కానీ సమస్య ఏమిటంటే ఎవరైతే సంస్కృతం యొక్క సద్గుణాలను ఉన్నపళంగా గుర్తించారో వారంతా సంస్కృతానికి కట్టుబడినవారు కారు. కేవలం జాప్యం చేసే ఒక ఎత్తుగడగా వారు ఆ వాదనను వినియోగిస్తున్నారని నేను భీతిల్లుతున్నాను.

ప్ర: పెరిగి పెద్దయిన తర్వాత ఎక్కువ మందికి హిందీని వినియోగించే సందర్భం రాదు కనుక హిందీ ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉండరాదని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ అన్నాదురై ఇటీవల అన్నారు.
జ: అది వాస్తవమే కానీ ఈ అంశానికి మరొక పార్శ్వం ఉన్నది. భారతీయులందరిలో కొద్ది మొత్తంలో హిందీ భాషా పరిజ్ఞానం సమరసత మరియు సౌభ్రాతృత్వ భావన పెంపుదలకు ఉపకరిస్తుంది.

ప్ర: వేర్వేరు భాషల్లో ఉమ్మడి పాఠ్య పుస్తకాలు బహుశా సమరసతకు సాయపడవచ్చు.
జ: కానీ అంత కన్నా మరింత ముఖ్యమైనది ఆ పుస్తకాల్లో పొందుపరిచిన విషయము. ఈ విషయంలో మన చరిత్ర పుస్తకాలు లోపభూయిష్టమైనవి. అవి కేవలం పాటలీపుత్రం చుట్టూ తిరుగుతుంటాయి. ఆ తర్వాత ఢిల్లీకి అంటిపెట్టుకొని ఉంటాయి. మిగిలిన దేశం వాటికి పట్టదు. మన పట్టభద్రుల్లో ఎంతమందికి చోళులు, పాండ్యులు మరియు పులకేశీ గొప్పతనం తెలుసు? విజయనగరం మినహాయించి దక్షిణాది చరిత్ర గురించి బోధించింది చాలా తక్కువ. తూర్పు భారత్‌ను మరోసారి తీసుకుందాం. ఖరవేలా ఉత్కలకు చెందిన గొప్ప రాజు. ఆయన తన కీర్తి పతాకాన్ని సముద్రాల పర్యంతం ఇండోనేషియా వరకు తీసుకొని వెళ్ళాడు. కానీ భారతీయ స్కాలర్లలో ఎంత మంది కనీసం ఆయన పేరైనా విని ఉంటారు? దక్షిణాదికి వెళ్ళి అక్కడి అత్యున్నతమైన దేవస్థానాలను చూసినప్పుడు వాటి వెనుక ఘనమైన సంస్కృతిని మీరు తెలుసుకుంటారు. కానీ వాటి గురించి ఎంత మందికి తెలుసు?

ప్ర: హిందీ భాష హిందీ భాషాయేతరులను ప్రతికూల పరిస్థితుల్లోకి నెడుతుందని, హిందీ ప్రజలను అందలమెక్కుస్తుందనే ఒక అభ్యంతరం ఉంది.
జ: స్థూలంగా చూసినప్పుడు ఇది ఒక అసహజమైన అభ్యంతరం. వాస్తవానికి, ‘హిందీ’ ఆమోదం పొందవలసిన ఖరీ బోలీ కేవలం ఢిల్లీ-మీరట్ ప్రాంతంలో కొన్ని లక్షల మందికి మాత్రమే మాతృభాషగా ఉన్నది. హిందీ ప్రజలుగా చెప్పుకునే వారిలో అత్యధికులు వారి ఇండ్లలో ఖరీ బోలీలో మాట్లాడుకోరు. వారు పహారీ నుంచి రాజస్థానీ మరియు అవధి నుంచి మగధి, బ్రజ్ మరియు మైథిలీ వరకు రకరకాల భాషల్లో వారు మాట్లాడుతారు. ఎవరైనా బెంగాలీ, మహరాష్ట్రీయుడు లేదా ఆంధ్రుడు లేదా మలయాళీ ఏ స్థాయిలో అయితే హిందీ నేర్చుకోవాలో అంతే స్థాయిలో వారు అందరూ నేర్చుకోవాలి.

ప్ర: ప్రతిపాదిక అధికార భాష బిల్లు గురించి మీరు ఏమి అనుకుంటున్నారు? అది ప్రతి రాష్ట్రానికి ఆంగ్లము నుంచి హిందీలో మారే వీటోను ఇస్తున్నది.
జ: అలా చూసినప్పుడు, ప్రతి పౌరుడికి ఒక వీటో ఎందుకు ఇవ్వరాదు? ఇది కొద్ది మందికి పైగా అత్యధిక వ్యక్తులు చేసే నిరంకుశత్వం. భారతీయ వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడిచే ఆంగ్ల పత్రికలు భారతీయ భాషల పట్ల అత్యంత ప్రతికూలతను ప్రదర్శించడం నన్ను ఆశ్చర్యపరుస్తున్నది.

ప్ర: విదేశీయులతో వారి వాణిజ్య భాగస్వామ్యానికి ఇది ఒక కొనసాగింపుగా భావించవచ్చునా?
: అందుకు నేను ఆశ్చర్యపోను.

ప్ర: హిందీ భాషను మన దేశానికి జాతీయ భాషగా చేయాల్సిన అవసరం ఉన్నదా?
జ: ఎందుకు? హిందీ మాత్రమే మనం దేశంలో ఏకైక జాతీయ భాష కాదు. మన సంస్కృతి పట్ల ఒకే రకమైన గొప్ప ఆలోచనలను వ్యక్తీకరించే ఈ దేశ భాషలు అన్నీ కూడా నూటికి నూటికి నూరు శాతం జాతీయ భాషలే. ఇంతటి సువిశాలమైన మన దేశంలో ఒక వ్యావహారిక భాష, ఒక అనుసంధాన భాష నిస్సందేహంగా విదేశీ భాష అయిన ఆంగ్ల భాష స్థానాన్ని భర్తీ చేసే ఒక భాష మనకు కావాలి.

‘ఆర్గనైజర్’ సౌజన్యంతో..