Home News ఇస్లాంలోకి మారాల‌ని ఒత్తిడి చేసిన సద్దాం హుస్సేన్… IAF అధికారి ఆత్మహత్య

ఇస్లాంలోకి మారాల‌ని ఒత్తిడి చేసిన సద్దాం హుస్సేన్… IAF అధికారి ఆత్మహత్య

0
SHARE

ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ఒక హిందూ IAF అధికారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దారుణ ఘ‌ట‌న రాజస్థాన్‌లోని మక్రానాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ స‌భ్యుల క‌థ‌నం ప్ర‌కారం గుజ‌రాత్, మ‌క్రానాలోని మిడియాన్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సుఖరామ్ భించర్ హైదరాబాద్‌లోని వైమానిక దళంలో ఉద్యోగం చేస్తున్నాడు. సుఖారామ్, సద్దాం హుస్సేన్ అనే వ్య‌క్తి ఇద్ద‌రు స్నేహితులు. ఇద్దరూ కూచమన్‌లో కలిసి చదువుకున్నారు. 2017లో ఎయిర్‌ఫోర్స్‌లో ఎంపికైన సుఖరామ్.. 2020 నుంచి సెలవులపై తన గ్రామానికి వచ్చే సుఖరామ్ నుంచి సద్దాం డబ్బులు వసూలు చేసేవాడు. ఇదే క్ర‌మంలో మక్రానా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న స‌ద్దాం తండ్రి మహ్మద్ సయీద్ సుఖారామ్ ని ఇస్లాంలోకి మారాలని లేక‌పోతే తప్పుడు అత్యాచారం ఫిర్యాదు చేసి, జైలు శిక్ష అనుభ‌వించేలా చేస్తానని బెదిరిస్తూ చాలా కాలంగా అతనిపై ఒత్తిడి తెచ్చారు. మతం మారకూడదని నిర్ణయించుకున్న సుఖారామ్ , ఓ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి నిరసన చేశారు. దీనిపై విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.