కేరళ: మలప్పురంలో భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మలప్పురం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అదే కళాశాలకు చెందిన బీకామ్ విద్యార్థులు రిన్షద్ రీరా, ముహమ్మద్ ఫరీస్ ‘కాశ్మీర్ కు విముక్తి కావాలి’ అని రాసివున్న పోస్టర్లను పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 124ఎ కింద దేశద్రోహం కేసు నమోదు చేసారు.
అరెస్ట్ అయిన విద్యార్థులిద్దరూ అతివాద ఇస్లామిక్ విద్యార్థి సంస్థ రాడికల్ స్టూడెంట్ ఫోరమ్ (RSF) సభ్యులుగా గుర్తించారు.
అయితే ఇదే సమయంలో కేరళలోని ఇతర ఇస్లామిక్ అతివాద సంస్థలు కూడా అరెస్ట్ ఐన విద్యార్థులకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టాయి.
విద్యార్థుల అరెస్ట్ అనంతరం కళాశాలలో తనికీలు నిర్వహించిన పోలీసులు మరికొన్ని దేశవ్యతిరేక నినాదాలు రాసివున్న పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కాశ్మీర్ తో పాటుగా మణిపూర్, పాలస్తీనాకు కూడా స్వాతంత్య్రం కావాలని రాసివుండటం గమనార్హం.
అరెస్ట్ ఐన విద్యార్థులు రాడికల్ స్టూడెంట్ ఫోరమ్ సంస్థకు ముందు కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం ఐన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) సభ్యులుగా ఉండేవారని సహచర విద్యార్థులు తెలియజేసారు.