-Ayesha
భారత్ వివిధ సాంస్కృతిక పద్ధతులను అనసంధానం చేస్తూ ముందుకు సాగుతుందని ఎల్.కె. మురుగన్
అన్నారు. భోపాల్ లో జరిగిన చిత్రభారతి ఫిల్మ్ ఉత్సవ ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందో అదే విధంగా నాగరికత, సాంస్కృతిక పద్ధతుల వైపు అడుగులు వేస్తోందని అన్నారు. ప్రతి ఒక్క పౌరుడు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునే అవసరం ఉందన్నారు. వివిధ సంస్కృతిక పద్ధతులను కథలుగా చెప్పే అవసరం ఉందని అన్నారు. అటువంటి సినిమాను చూసినప్పుడు చాలా ఆనందంగా పడ్డానని, అది కూడా మన చిత్రభారతి ద్వారా చేయడం చాలా గర్వకారణ అని పేర్కొన్నారు. మన భారతదేశంలో సంస్కృతిక పద్ధతులను మన నాగరికతను వర్ణించే విధంగా చాలా కథలు, పుస్తకాలు ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా వీటికి సంబంధించి సినిమాలు తీయలేదని, ప్రస్తుత సమాజంలో సినిమాలు అనేవి ప్రజలు, ప్రపంచం మధ్య ప్రత్యేక మాద్యమంగా ఉంటున్నాయన్నారు.
ఇటువంటి గొప్ప చిత్రభారతి ఫిల్మ్ వేడుకను నిర్వహిస్తున్న భారతీయ చిత్ర సాధనకు అభినందనలు తెలిపారు. మన దేశంలో ఉన్న వివిధ చిత్రనిర్మాతలు ఇందులో చాలా ఆతురతగా పాల్గొన్నారు. అని L. మురుగన్ తెలిపారు. ముంబాయి, బెంగుళూరు, ఢిల్లీ, కోలెకత్తా, భోపాల్ తర్వాత చిత్రభారతి ఫిల్మ్ వేదిక ఘనంగా ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించింది అని సభ ఆఖరిలో నిర్వహణ సంఘం చైర్మెన్ దిలీప్ సూర్యవాన్షి పేర్కొన్నారు.
సభా మండపంలో ఉన్న వాళ్ళందరూ నిజనిలబడి “కాశ్మీర్ ఫైల్స్ చిత్ర నిర్మాత దర్శకులను గౌరవంగా సత్కరించారు.
చిత్రభారతిలో ఉన్నటువంటి కళాకారులు పల్లవి జోషి వివేక్ అగ్నిహోత్రి రాబోయే సినిమాలో అవకాశం పొందనున్నారు. చిత్రభారతి సలహా మేరకు ఇద్దరు నటులను ఒక్కో లక్ష్య చొప్పున ఇచ్చి రాబోయే సినిమాలో అవకాశం పొందుతారు అని దకాశ్మీర్ ఫైల్స్ నటి పల్లవి జోషీ’ చెప్పారు. ఇదే సందర్భంగా ప్రముఖ నటుడు ముఖేష్ తివారి “మీ యొక్క అందమైన కళలపై విశ్వాశం అని తెలిపారు. అలాగే దర్శకుడు అభినవ్ కాష్యాప్ – ఈ తరంలో యువకులకు అండగా ఉంటూ నాయకత్వ లక్షణాలను పెంచడం తమ పని అని చెప్పారు.
న్యాయ సంఘం సభ్యులు యోగేష్ సోకున్- చిత్రభారతి ఫిల్మ్ వేడుకలో ఉన్నటువంటి సినిమాలు తమ శైలిలో అనువాదిస్తుంది అని పేర్కొన్నారు. అతుల్ గాంగ్వార్ ప్రధాన కార్యదర్శ ఇండియన్ చిత్రసాధన, చిత్రభారతి ఫిల్మ్ వేడుకను గురించి మాట్లాడారు. ఈ ఉత్సవంలో పాల్కొన్న ముఖ్య అతిథులకు సన్మానం జరిగింది. ప్రత్యేకంగా సినిమా దర్శకుడు, నిర్మాతలు సునిల్ పురానిక్, సంజయ్ రాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. ఈ కార్యక్రమం మహాభారత్ నటుడు Dr. హరిష్ భీమాని ఆవిష్కరించారు.
-Research Scholar, HCU.