Home News 2022-23లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం

2022-23లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం

0
SHARE

– డా. ఎస్. లింగమూర్తి,
స్వదేశీ జాగరణ్ మంచ్, దక్షిణ భారత సమన్వయ కర్త

2023లో ప్రపంచ ఆర్థిక మందగమన వృద్ధి 3 శాతం కంటే తక్కువగా ఉండడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడే దేశాలు 2.5 శాతానికి దిగువన వృద్ధి చెందుతాయని అంచనా వేసిన నేపథ్యంలో, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల ఆధారంగా 6.8 శాతంగా ఉందని అంచనా వేయబడింది. దేశ ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సర్వేలో చెప్పిన ఆర్థిక సూచికలు ఇవి. కోవిడ్ సమయంలోనూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోను భారతదేశం ప్రపంచదేశాలన్నింటికీ వారి శ్రేయస్సును కోరే ఆశాకిరణంగా మారింది.

ఆర్థిక సర్వే – 2022-23 ప్రకారం భారతదేశం చాలా బలమైన ఆర్థిక మూలాధారాలను కలిగి ఉండటం ద్వారా 6.8 శాతం వృద్ధి రేటుతో ఆర్థికంగా ఎదుగుతుందని ఈ సర్వే చెబుతుంది. మన విదేశీ మారక నిల్వలు ఆశాజనకమైన పరిస్థితిలో ఉన్నాయి, బాహ్య వాణిజ్యం కూడా ఆశాజనకంగా ఉంది, వినియోగదారు ధర సూచిక 6 శాతం కంటే తక్కువగా మరియు టోకు ధర సూచిక 5 శాతం కంటే తక్కువగా ఉంది. భారతదేశ మూలధన వ్యయం (CAPEX) పెరుగుతూనే ఉంది అంతేకాకుండా ఇది సమీప భవిష్యత్తులో రెట్టింపు భావాన్ని చూపుతుంది. మన వ్యవసాయ రంగం ఆహార భద్రత అనే దశను దాటి పోషకాహార భద్రతకు చేరుకుంది. ప్రొడక్షన్ ఇంటెన్సివ్ లింక్డ్ స్కీమ్ కారణంగా MSME రంగం ప్రశంసనీయమైన పరిస్థితిలో పని చేస్తోంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) అదుపులో ఉండాలనేది ఆర్థిక సర్వే నివేదిక. ఇది మాత్రమే ఆందోళన కలిగించే విషయం. అయినప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ యొక్క ఈ బలమైన మూలాధారాల ఆధారంగా రేపటి బడ్జెట్ పటిష్టమైన మౌలిక సదుపాయాలను సృష్టించడంతో పాటూ, పరిశ్రమ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా వివిధరకాల కల్పనలు కూడా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.