Home News అంతర్గత శక్తే మనకు ఆసరా : సాధ్వి ఋతంభర, సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్

అంతర్గత శక్తే మనకు ఆసరా : సాధ్వి ఋతంభర, సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్

0
SHARE

అనంత సకారాత్మకత తొ మనము గెలుస్తాం అంటూ మే 11 నుండి నిర్వహిస్తున్న ‘హమ్ జితేంగే – పాజిటివిటీ అన్‌లిమిటెడ్’  ధారావాహిక ఉపన్యాస మాలిక  నాలుగవ రోజు, సాధ్వి ఋతంభర, సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్ భారతదేశపు ప్రత్యేకత అయిన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరించి అంతఃశక్తిని జాగృతపరచుకోవడమే కరోనా సంక్షోభానికి పరిష్కారమని అన్నారు.  కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో గెలవడానికి ఇది కచ్చితంగా సహాయపడుతుందని, మన చుట్టూ మరింత సానుకూల ఆలోచనలను పంచుకోవాలని వారు చెప్పారు. ఈ ఐదు రోజుల ఉపన్యాస సిరీస్‌ను సమాజంలోని అన్ని వర్గాల  ప్రాతినిధ్యంతో  ‘కోవిడ్ రెస్పాన్స్ టీం’ నిర్వహిస్తున్నది.

నేటి కార్యక్రమం లో….

పరమ శక్తి పీఠం వాత్సల్య గ్రామ్ స్థాపకురాలు సాధ్వి ఋతంభర మాట్లాడుతూ “ధైర్యం, సాహసాలు ఉంటే పెద్ద పర్వతాలను కూడా కదల్చవచ్చును. ఒక మహానది తన ప్రవాహంలో అడ్డువచ్చిన రాళ్ళను కూడా ఇసుకగా మార్చేస్తుంది. కాబట్టి సంక్షోభం ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతఃశక్తిని జాగృతపరచి ఆ సమస్యను ఎదుర్కోవాలి’’ అని అన్నారు.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, దైవంపట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసినప్పుడే ఆ పరిష్కారం కనిపిస్తుందని సాధ్వి అన్నారు. ఈ విశ్వాసంతో మనం ఈ మహమ్మారిని జయించవచ్చునని పిలుపునిచ్చారు. “మరొకరిలో లోపాలు వెతికి, వారిపై ఆరోపణలు చేయకుండా ప్రతిఒక్కరు ఆత్మ సంయమనం, నిష్ట, విశ్వాసాలను పెంచుకోవాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన శక్తిని నకారాత్మక ఆలోచనలకే వ్యర్ధం చేస్తే అప్పుడు సరైన నిర్ణయం తీసుకుని, దానిని అమలు చేసే సామర్ధ్యాన్ని కోల్పోతాం’’ అని సాధ్వి ఋతంభర హితవుపలికారు.

శ్రీ పంచాయతీ అఖాడా – నిర్మల్ కు చెందిన సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్ జీ మాట్లాడుతూ “భయపడవలసినది, ఆందోళనకు గురికావలసినది ఏమీ లేదు. కేవలం భారత్ మాత్రమేకాదు, మొత్తం ప్రపంచమంతా ఈ పరిణామాన్ని ఎదుర్కొంటున్నది. ఈ ప్రపంచంలో మార్పు లేకుండా ఎల్లకాలం నిలిచిపోయేది ఏది లేదు. కష్టం వచ్చిందంటే అది అప్పటికీ మిగిలిపోదు. వచ్చినట్లుగానే పోతుంది. అందుకని ఆందోళన చెందవద్దు’’అని అన్నారు.

“దురదృష్టవశాత్తూ వ్యాధి సోకితే భగద్భావన చేయాలి. భగవద్గీత చదవాలి, గురుబాణి చదవాలి. శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనసును జయిస్తే లోకాన్ని జయించినట్లే. మనసు ఆరోగ్యంగా, స్వస్థతతో ఉంటే ఏ సంక్షోభం, సమస్య మనల్ని ఏమి చేయలేదు’’అని సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్ జీ అన్నారు.

నేడు ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలు, సూచనలు మన భారతీయ జీవన విధానంలో ఎప్పటినుండో అనుసరిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఆ సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని సరిగా అనుసరిస్తే చాలు మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కాబట్టి ఆ సంప్రదాయాలను అనుసరించే, ఆచరించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.

ఈ ఉపన్యాస కార్యక్రమాలు మే 11 నుండి మే 15 వరకు రోజూ సాయంత్రం 4:30 గంటలకు 100 కి పైగా మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్నాయి. మే 15 న ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ దేశప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

– లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ కన్వీనర్, కోవిడ్ రెస్పాన్స్ టీం మొబైల్ నంబర్: 7042 500 558

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE