మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవంగా భారతదేశంలో ప్రసిద్ధిపొందిన రోజు. ప్రపంచంలోని అనేక కార్మిక సంఘాలు అసంబద్ధం అంటూ తెల్చిపారేసి జరుపుకోవడం మానివేసినా మేడేను పనిగట్టుకుని మరీ జరిపేది మన దేశంలోని కమ్యూనిస్ట్ అనుబంధ కార్మిక సంఘాలే.
కార్మికుల పని సమయాన్ని 8 గంటలకు తగ్గించాలని కోరుతూ 1886 మే 1న చికాగోలో నిర్వహించిన ఉద్యమానికి జ్ఞాపకమే మేడే. సరైన ప్రణాళిక, నాయకత్వ లేమి కారణంగా పక్కదారి పట్టిన ఆ ఉద్యమం.. చివరికి పాలీసులతో ఘర్షణకు దారితీసి కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక విఫల అధ్యాయంగా మిగిలిపోయింది.
పని గంటలు 8కి తగ్గించేందుకు ఉద్యమం చేపట్టినట్టు కొందరు చరిత్రకారులు చెప్తున్నప్పటికీ నిజానికి అంతకు పూర్వం అంటే 1868వ సంవత్సరంలోనే అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి అమెరికన్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అదే సంవత్సరం ప్రభుత్వం ఆమోదించింది. కాబట్టి 1886లో జరిగిన ‘ఉద్యమం’ యొక్క అసలు లక్ష్యం ఏమిటి అనేది అంతుచిక్కని ప్రశ్న.
ఇకపోతే 1886 మే 1నాడు మొదలైన ఉద్యమం ఆరోజు ప్రశాంతంగానే ముగిసింది. కానీ మే 3, 4 తేదీల్లో మెక్ కార్మిక హార్వెస్టింగ్ కర్మాగారంలో కార్మికులతో అరాచకవాద నాయకత్వం నిర్వహించిన ఆందోళన హింసకు దారితీసింది. ఆరోజు పోలీసు కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించారు. మరుసటి రోజు చికాగో హేమార్కెట్ చౌరాస్తాలో తలపెట్టిన నిరసన ప్రదర్శన కాస్తా భారీ వర్షం కారణంగా వెలవెలబోయింది. ఐతే అప్పటికీ ఆ ప్రదేశం ఖాళీ చేయకుండా అక్కడే భీష్మించుకుని ఉన్న కొందరు పోలీసులపై బాంబు దాడికి పాల్పడ్డారు. పర్యవసానంగా పోలీసులు కాల్పులు జరిపారు. ఘర్షణల్లో నలుగురు కార్మికులు, ఏడుగురు పోలీసులు మరణించారు. అనంతరం అనేక మంది కార్మిక నాయకులూ జైలుపాలయ్యారు. వారిలో నలుగురికి అక్కడి కోర్టులు ఉరిశిక్ష విధించాయి.
ఈ పరిస్థితుల కారణంగా అమెరికాలో బలపడుతున్న వాణిజ్య సంఘాల ఉద్యమం ఒక్కసారిగా బలహీనపడి, నిష్ప్రయోజనకరంగా మారింది.
అమెరికన్ కార్మిక సంఘాలు చికాగో విఫల ఉద్యమ తాలూకు జ్ఞాపకాలను చెరిపివేయాలనుకున్నాయి. దీంతో అక్కడి వాణిజ్య సంఘాలు ప్రతి ఏటా సెప్టెంబర్ మొదటి సోమవారాన్ని ‘కార్మిక దినోత్సవం’గా జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి. అనంతర కాలంలో మే 1న అమెరికా బాలల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. నిజానికి మేడే కన్నా స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాసం కారణంగానే చికాగో నగరం ప్రాధాన్యత సంపాదించుకుంది. మేడేగా మనం గుర్తు చేసుకుంటున్న చికాగో హేమార్కెట్ చౌరస్తాలో ఘటన మన దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షను రగిలించిన చౌరీచౌరా ఘటనకు ఏమాత్రం సమానం కాదు.
ఇదిలా ఉంటే.. అసలు మేడే పట్ల ప్రపంచ కమ్యూనిస్ట్ దేశాలు, నాయకుల వైఖరి ఒకసారి గమనిద్దాం. 1889లో ప్రపంచ కమ్యూనిస్ట్ సంఘాల సమావేశం పారిస్ నగరంలో జరిగింది. మేడే (మే 1వ తేదీని) కార్మిక దినోత్సవంగా పరిగణించాలని సమావేశం తీర్మానించింది. కానీ ప్రపంచ కమ్యూనిస్ట్ దేశాల మధ్య కూడా మేడే వివాదాస్పదంగా మారి సమస్య తెచ్చిపెట్టింది. ఫలితంగా 1904 సంవత్సరంలో మేడే కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఏవో కొన్ని రాజకీయ కారణాల చేత రష్యాలో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా పాటించాలని లెనిన్ తన ప్రజలను కోరాడు.
అనంతర కాలంలో హిట్లర్ రాజకీయ నియంతృత్వ వైఖరికి చిహ్నంగా ప్రపంచ కమ్యూనిస్ట్ దేశాలు మేడేను ‘ఫాసిస్ట్ వ్యతిరేక దినోత్సవం’గా జరుపుకోవడం ప్రారంభించాయి. 1929 నుండి 1940 దాకా ఇది ఇలాగే కొనసాగింది. అనంతరం హిట్లర్ తో పొత్తు కారణంగా రష్యా నాయకుడు స్టాలిన్ ఇకపై మేడేను ‘ఫాసిస్ట్ వ్యతిరేక దినోత్సవం’గా జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నాడు. ఈవిధంగా ప్రపంచ కమ్యూనిస్టుల నిర్ణయాన్ని కమ్యూనిస్ట్ నాయకుడే విస్మరించాడు, మార్చేశాడు. తిరిగి మేడేను ‘కార్మిక దినోత్సవం’గా జరుపుకోవడం ప్రారంభమైంది.
ఈ విధంగా ఇప్పుడు జరుపుకుంటున్న మేడే తిరిగి ఉనికిలోకి వచ్చింది. కేవలం కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘాలే కాకుండా ఐ.ఎన్.టి.యు.సి వంటి కాంగ్రెస్ ఇతర పార్టీల అనుబంధ సంఘాలు కూడా మేడే చరిత్ర, ప్రాధాన్యత తెలియకుండానే జరుపుకోవడం మొదలుపెట్టాయి.
ఇక్కడ మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. విదేశాల్లో మాత్రం మేడే జరుపుకోవడం అనేక సంఘాలు పూర్తిగా మానేశాయి. పైగా ‘కమ్యూనిస్టుల నమకద్రోహం’ కారణంగానే మేడే నిర్వహణ జరుపుకోవడం లేదని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
కారణాలు ఏమైనప్పటికీ.. కార్మిక దినోత్సవంగా భావిస్తున్న మేడేకు ఒక స్ఫష్టత లేదా సందర్భం లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.
పని ఒక యజ్ఞం
విశ్వకర్మ అనేది ప్రాచీన భారతదేశం గరిష్ట గౌరవం ఇచ్చిన కార్మిక గౌరవానికి ప్రతీక. భారతదేశం యొక్క గొప్ప వ్యక్తుల చరిత్ర విశ్వాన్ని సృష్టించినట్లు విశ్వసించే విశ్వకర్మ త్యాగం నుండి ప్రారంభమవుతుంది. విశ్వాన్ని సృష్టించేందుకు నిర్వహించిన యజ్ఞంలో అతడే హవిస్‌గా ఎంచుకున్నాడు (ఋగ్వేదం 10.81.6). అలా దేవా స్థాయికి ఎదిగాడు. ఋగ్వేదం (10.121) అతను భూమి, నీరు, సజీవ సృష్టి మొదలైనవాటిని సృష్టించాడని చెబుతుంది. అతను దేవతల గొప్ప వాస్తుశిల్పిగా పిలువబడ్డాడు. అతను కేవలం ఒక వ్యక్తి కాదని కూడా నమ్ముతారు. తమ నైపుణ్యంతో సమాజానికి సేవ చేసిన ప్రతి ఒక్కరినీ ‘విశ్వకర్మ’ అని పిలుస్తారు. మన ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావించబడిన అనేక అంశాల ఆవిష్కరణ ఆయనకు ఆపాదించబడింది. విష్ణువు సుదర్శన చక్రం, శివుని త్రిశూలం, కుమారుని బల్లెం, ఇంద్రుని రథం, పాండవులకు హస్తినపురి, శ్రీకృష్ణుని ద్వారక, ఇంద్రలోకం, బృందావనం, లంక, పుష్పకవిమానం మొదలైనవన్నీ విశ్వకర్మ మేధావి సృష్టించినవే. వాస్తు ఆర్కిటెక్చర్ మరియు అన్ని కళలు అతని ఆవిష్కరణలు. అతను ప్రపంచంలోనే మొదటి కార్మికుడు మరియు కార్మిక ఆచార్యుడు. వివిధ కులాల కార్మిక విభాగాలకు చెందిన చాలా మంది వ్యక్తులు విశ్వకర్మ వారసులమని భావిస్తారు. కార్మికులందరికీ ఆయన ఆదర్శం.
అతని కుమారుడు వృత్రుడు అత్యాశ మరియు రాక్షస స్వభావం మరియు హిరణ్యకశిపుని సైన్యాధిపతి. తన కుమారుడిని చంపడానికి విశ్వకర్మ స్వయంగా ప్రత్యేక ఆయుధాన్ని సృష్టించాడు. విశ్వకర్మ మరియు దధీచి ఇద్దరి గొప్ప త్యాగం వల్ల వృత్రుడు చంపబడ్డాడు. మరొక కుమారుడు నల శ్రీరాముని భక్తుడు అయ్యాడు మరియు అతను లంకకు వెళ్ళడానికి సేతు వంతెనను నిర్మించాడు.
విశ్వకర్మ ప్రస్తుత ఆలోచనా విధానంలో ఉన్న నమూనా మార్పుకు ప్రతీక. పని ఒక యజ్ఞంగా పరిగణించబడుతుంది. భారతీయ పారిశ్రామిక సంబంధాలు సాంప్రదాయకంగా కుటుంబం వంటి సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. BMS పారిశ్రామిక సంబంధాలకు కుటుంబాన్ని ఒక నమూనాగా అంగీకరించింది మరియు ‘పారిశ్రామిక కుటుంబం’ అనే గొప్ప భావనను ముందుకు తెచ్చింది. ఇది పశ్చిమ దేశాల యజమాని-సేవకుల సంబంధానికి లేదా కమ్యూనిస్టుల వర్గ శత్రు భావనకు విరుద్ధంగా ఉంది. “త్యాగ్-తపస్య-బలిదాన్”, “పనియే ఆరాధన” “కార్మిక జాతీయం” మొదలైన నినాదాలను విశ్వకర్మ వంటి మహానుభావుల జీవితం నుండి మనం గ్రహించాము. ఏకరూపతను తీసుకురావడానికి, విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న జరుపుకుంటారు, ఎందుకంటే చాలా ప్రదేశాలలో దీనిని భాద్రపద శుక్ల పంచమి మరియు మాఘ శుక్ల త్రయోదశి నాడు జరుపుకుంటారు. పశ్చిమం నుండి దిగుమతి చేసుకున్న మే డే, విశ్వకర్మ జయంతి నాటికి కార్మికులను సానుకూలంగా ప్రేరేపించడంలో విఫలమైంది.
Source: Organiser
This article was first published in 2020