Home News బిలీవ‌ర్స్ చ‌ర్చి అధినేత ఆస్తులు, భూముల‌ను జ‌ప్తు చేసిన ఐటీ శాఖ‌

బిలీవ‌ర్స్ చ‌ర్చి అధినేత ఆస్తులు, భూముల‌ను జ‌ప్తు చేసిన ఐటీ శాఖ‌

0
SHARE

బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్‌ను ఐటి శాఖ జ‌ప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి సంస్థలలో జరిగిన ఐటి దాడుల్లో రూ .6వేల కోట్ల నల్లధనం బయటపడింది. అయితే గ‌తంలో నకిలీ పత్రాల సృష్టించి హారిసన్స్ మలయాళం సంస్థ‌ నుండి పొందిన 2వేల ఎక‌రాల భూమిని కూడా ప్ర‌స్తుతం ఐటీ శాఖ జ‌ప్తు చేసింది.

ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తున్న కె.పి. యోహన్నన్ కి ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. దీనికి అతను డిసెంబరులో మాత్రమే భారతదేశానికి తిరిగి రాగలన‌ని ప్రతి స్పందించాడు. కానీ దర్యాప్తున‌కు యోహన్నన్ సహకరించకపోతే త‌గు చర్యలతో ముందుకు సాగాలని ఐటి శాఖ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

Source: ORGANISER