Home News చైనా సరిహద్దు ప్రాంతంలోని కీలక ప్రదేశాలు తిరిగి స్వాధీనం చేసుకున్న భారత్ 

చైనా సరిహద్దు ప్రాంతంలోని కీలక ప్రదేశాలు తిరిగి స్వాధీనం చేసుకున్న భారత్ 

0
SHARE
భారత్-చైనా రక్షణ రేఖ వెంబడి ఇంతకాలం చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతాలను భారత్ కు చెందిన ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఏ.ఎన్.ఐ వార్తాసంస్థను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ఈ విధంగా ఉంది.
రక్షణ రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న కీలక ప్రాంతమైన ఫుర్చుఖ్ లోకి చొచ్చుకుపోయిన భారత్ దళాలు అక్కడి స్థావరాలను ఆధీనంలోకి తీసుకున్నాయి. యుద్ధపరంగా ఇది ఇరు దేశాలకు ఎంతో కీలకమైన ప్రాంతం. భారత్ కు చెందిన ఈ ప్రాంతం అనేక ఏళ్లుగా చైనా ఆక్రమణలో ఉంది. తాజాగా ఈ మధ్య కాలంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెల్లకొన్న సమయంలోనే ఈ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో సైనిక్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై నిఘా ఉంచాయి.
ఫుర్చుఖ్ ప్రాంతంతో పాటు తూర్పు లడఖ్ లోని పాంగంగ్ సరస్సు తీర ప్రాంతమైన ఛుషుల్ సెక్టారులోని కొన్ని కీలక ప్రాంతాలను కూడా భారత్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.
ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ శాఖకు చెందిన అత్యున్నత అధికారి ఎస్.ఎస్ దేశ్వాల్ గతవారం భారత్-చైనా రక్షణ రేఖ వెంబడి ఉన్న సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో భాగంగా పోలీస్ దళాలను ఉద్దేశిస్తూ మాట్లాడిన దేశ్వాల్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. సరిహద్దు వెంబడి రవాణా మార్గం నిర్మించడంపై దృష్టి నిలిపామని తెలిపారు. అంతేకాకుండా సైన్యం కదలికలు సులభంగా సాగేందుకు మరిన్ని అదనపు వాహనాలు సమకూరుస్తామని అన్నారు.