ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల వల్లనే.. .శంకరులు జన్మించక ముందు దాదాపు 72కు పైగా కొత్త సంప్రదాయాలు దేశంలో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో పాటుగా సర్వత్రా మూఢనమ్మకాలతో దేశం అల్లకల్లోలమైంది. సనాతన ధర్మంపట్ల శ్రద్ధ గౌరవం తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక తేజస్సును తిరిగి దేశంలో పున: ప్రతిష్టించడానకి దేశధర్మాన్ని ఉద్ధరించడానికి, ఆ పరమశివుడే అద్వైతరూపంలో వైశాఖ శుద్ధ పంచమినాడు, ఆరుద్ర నక్షత్రంలో కేరళలోని కాలడిలో… భూమిపై ఆదిశంకర భగవత్పాదులుగా అవతరించాడు.