Home News జిహాదీల కొత్త ఎత్తుగడ: కొరియర్ ద్వారా హిందువులకు ఖురాన్

జిహాదీల కొత్త ఎత్తుగడ: కొరియర్ ద్వారా హిందువులకు ఖురాన్

0
SHARE

మత ప్రచారం కోసం జిహాదీలు సరికొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. ఎలాంటి ఆర్డర్ లేకుండానే హిందువుల ఇండ్లకు హిందీలోకి అనువదించిన ఖురాన్ పుస్తకాన్ని కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే ఈ కుట్ర వెనుక కొరియర్ కంపెనీల భాగస్వామ్యం కూడా ఉందా? అనే అనుమానాలు అంతటా వినిపిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జిహాదీ సంఘటన విభాగం యాప్ ద్వారా హిందువులను కనిపెట్టి వారి ఇండ్లకు ఖురాన్ పంపుతున్నది. తప్పుడు ఫోన్ నంబరు, తప్పుడు చిరునామాతో హిందువుల ఇండ్లకు కొరియర్ ద్వారా ఖురాన్ చేరవేస్తున్నారు. ఎలాంటి ఆర్డర్ లేకుండా ఇండ్లకు వస్తున్న పార్సిల్‌ను తెరిస్తే తప్ప అందులో ఒక మతానికి చెందిన పుస్తకం ఉన్న విషయం తెలియడంలేదు. తిరిగి ఇద్దామంటే పార్సిల్ ఇచ్చినవారు వెనక్కి తీసుకోరు.

ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఇలా మతపరమైన పుస్తకాన్ని పంపిస్తున్న వారికి హిందువుల మొబైల్ నెంబర్లు, ఇండ్ల చిరునామాలను ఎవరు ఇస్తున్నారు? మనం ఏదైనా యాప్‌ను డౌన్ లోడ్‌ చేసుకున్నప్పుడు మన పూర్తి వివరాలు ఆ యాప్ కంపెనీకి తెలిసిపోతాయి. కనుక అలా వినియోగదారుల వివరాలు తెలుసుకున్న యాప్ ద్వారా జిహాదీలకు హిందువుల మొబైల్ నెంబర్లు, ఇంటి చిరునామాలు తెలిసిపోతున్నాయా? అలా తెలుసుకున్న హిందువుల మొబైల్ నంబర్లు, ఇంటి చిరునామాల్లో కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఖురాన్‌ను పంపిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి పనుల వెనుక ఎవరున్నదీ కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

కొద్ది రోజుల క్రితం డెహ్రడూన్, హరిద్వార్, మీరట్ నగరాల్లో కొందరు హిందువుల ఇండ్లకు ఇలాంటి పార్శిళ్ళు వచ్చాయని సమాచారం. ఇదే తరహా మత ప్రచారాన్ని క్రైస్తవ మిషనరీలు గత ఏడాది నుంచి చేపట్టాయి. డెహ్రాడూన్‌కు చేరుకున్న ఇలాంటి ఒక పార్శిల్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లో కూడా జిహాదీలు వారి ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని తెలిపాయి. లవ్ జిహాద్, నానాటికి పెరిగిపోతున్న ముస్లిముల జనాభా, ముస్లిము విశ్వవిద్యాలయం లాంటి అంశాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ సర్వసాధారణమైపోయింది.