Home News రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది… రెండ‌వ భాగం

రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది… రెండ‌వ భాగం

0
SHARE

యూసీసీపై 22వ లా కమిషన్‌ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్‌ ‌నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి: 

ప్ర‌శ్న: ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే చెప్పండి!

జ‌వాబు: యూసీసీ ద్వారా దక్కుతుందనుకుంటున్నది చట్టబద్ధత. ఈ చట్టబద్ధత అన్నది రాజ్యాంగం నిర్దేశించింది. సుప్రీంకోర్టు దశాబ్దాలుగా ఉమ్మడి పౌరస్మృతి రావాలి రావాలి అని అంటూ వచ్చింది. తప్పకుండా చేయాల్సిందే. తరువాత చేద్దామన్న వీలుకాకుండా పోతుంది. ఇప్పటికే వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది జనానికి. మెట్రోపాలిటన్‌ ‌సిటీలో చూడండి విడాకుల తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నది. అలాగే మాట్రిమోనీ డిస్ప్యూట్స్ ‌కూడా. వీటి నుంచి బయటపడాలంటే యూసీసీ ఉపకరిస్తుంది.

ప్ర‌: చాలామంది ముస్లిం మత గురువులు, ముస్లిం వర్గ మేధావులు చెబుతున్నట్టే ఇవాళ షరియాను ఎక్కడైనా యథాతథంగా అమలు చేయగలరా?

జ‌: టీవీ చర్చలలో చాలామంది అంటుంటారు. ముస్లిం మేధావులు, ఆ మత బోధకులు షరియా పాటిస్తాం అంటారు. అలా అయితే మొత్తం షరియానే అమలు చేద్దాం. దొంగతనం చేస్తే చేతులు నరకేద్దామా అంటే మాట్లాడరు. ఒప్పుకోరు. ఇపుడు ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చామే అనుకొండి. దాన్ని న్యాయబద్ధం చేయడానికి కోర్టులు ఉన్నాయి. మత స్వేచ్ఛ నిరపేక్షం కాదు. సబ్జెక్‌, ‌మొరాలిటి, హెల్త్- ఈ ‌మూడు కోణాలు ఉండాలి. మా మతం ప్రకారం కత్తి పట్టుకొని తిరుగుతామంటే అది పబ్లిక్‌ ఆర్డర్‌కి వ్యతిరేకం. కావాలంటే ఇంట్లో తిప్పుకోమని చెబుతుంది చట్టం. అట్లాగే మొరాలిటి, నైతికత, ఆరోగ్యం. ఆరోగ్యం విషయం ఎప్పుడొచ్చిందంటే సుప్రీంకోర్టు – జావేద్‌ అం‌డ్‌ అదర్స్ ‌వర్సెస్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ‌హరియాణ, 2003 కేసులో వచ్చింది. ఇది జనాభాకి సంబంధించిన వ్యాజ్యం. ఒక స్త్రీ ఉన్నది. అదే పనిగా పిల్లల్ని కనడంవల్ల ఆ స్త్రీ ఆరోగ్యం ఏమి కావాలి? ఆ పుట్టిన పిల్లల మధ్య ఎడమ లేకుండా ఉంటే వారి పరిస్థితి ఏమిటి? ఇంతమంది పిల్లల్ని కనాలని మీ మతం ఎక్కడా చెప్పలేదు. రెండోది ఆ స్త్రీ ఆరోగ్యం, పుట్టిన పిల్లల ఆరోగ్యం చూడాలి. దానికి లోబడే నీ మత స్వేచ్ఛ. అపుత్రస్య గతర్నాస్తి అన్నారు. అక్కడ శతపుత్ర అనలేదు.

ప్ర‌:  ఇపుడు దీనిని జనాభా అసమతౌల్య కారక సమస్యగా చూడవచ్చా?

జ‌: దీంట్లో జనాభా వ్యవస్థ, వివాహవ్యవస్థ ఉన్నాయి. ఆంగ్లేయులు ఉండగానే హిందూ బైగమెస్‌ ‌చట్టం తీసుకువచ్చారు. దీని ప్రకారం హిందువులు రెండో పెళ్లి చేసుకోకూడదు. 1952లో బాంబే స్టేట్‌గా ఉన్నప్పుడే ఆ హైకోర్టులో ఈ చట్టాన్ని సవాలు చేశారు. చట్టం ఉంది కాబట్టి రెండో పెళ్లి చేసుకునే వీలులేదని కోర్టు నిర్దాక్షిణ్యంగా చెప్పింది. హిందూ మతం ఎట్లానో ఇస్లాం కూడా అంతే. క్రిస్టియన్‌, ‌పార్సీ కూడా అంతే. వివాహ వ్యవస్థకు సంబంధించి నదే జనాభా వ్యవస్థ. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే ఎన్నికలలో పోటీ చేసే హక్కు లేదు. దానికి న్యాయబద్ధత వచ్చిందంటే దాని ఫలితం వేరే ఉంటుంది. జనాభా అనేది దేశ ప్రజాస్వామ్యంమీద ఆధారపడి ఉంటుంది. జపాన్‌, ‌జర్మనీ దేశాలు న్నాయి. పాపులేషన్‌ ‌నెగెటివ్‌ ‌గ్రోత్‌గా ఉంది. అక్కడ అమ్మాయి, అబ్బాయినని కంటే కారును బహుమానంగా ఇస్తారు.

ప్ర‌: కానీ ఇటీవలి పరిణామాలన్నీ ఈ జనాభా పెరుగుదల అనేది కుట్రపూరితంగా జరుగుతున్నదని అర్థమవుతుంది. ఫ్రాన్స్‌లో ప్రతి ముగ్గురు స్కూల్‌ ‌విద్యార్థులలో ఒక మహమ్మద్‌ ఉన్నాడు. ఇది ఒక రకమైన కుట్ర. ఇది కొనసాగితే హిందూ దేశంలో పరిస్థితి ఏమిటి?

జ‌: జనాభా పెరుగుదలలో మార్పు రెండు రకాలు. ఒకటి పిల్లల ద్వారా. రెండోది అక్కడెక్కడో నలుగురిని కొట్లాట పెట్టుకోమనడం. రెండు మూడు బాంబులు వేయడం. ఒక పడవలో ఐదువేల మందిని నింపడం, కాందిశీకుల పేరుతో ఇక్కడ వదిలిపెట్టడం. అట్లా జరుగుతున్నది. జర్మనీలో ఇది ముందు మానవ హక్కుల విషయం. కొందరు అడ్డగోలుగా వచ్చి ఆ దేశంలో ఉండిపోతున్నారు. దీనితో తరువాత తలలు పట్టుకుంటున్నారు.

ప్ర‌: స్వీడన్‌ ‌వంటి దేశాల్లో ముస్లింలు రావడం మీద నిబంధనలు పెట్టారు. మరి ఇవన్నీ చూసిన తరువాత భారతీయ సమాజం ఏ రకంగా స్పందించాలి?

జ‌: అది రాజకీయమైన సమస్య. ఏరకంగా చేయాలనేది సాంఘిక, రాజకీయ కోణం నుంచి చూడవలసిందే. పౌరస్మృతి వస్తే ఎంతవరకు న్యాయం దక్కుతుంది అన్నంత వరకే చూడాలి. నా నమ్మకం ఏమిటంటే పౌరస్మృతి వస్తే స్త్రీలకు న్యాయం జరుగుతుంది.

ప్ర‌: ఉత్తరాఖండ్‌లో తాజాగా తలెత్తిన సంక్షోభాన్ని చూసినపుడు భారతదేశంలో మెజార్టీ ప్రజలైన హిందూ జీవనంలోకి వారు కుట్రపూరితంగా వస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ వాతావరణం నుంచి ఉమ్మడి పౌరస్మృతి హిందూ సమాజాన్ని రక్షించ గలదా?

జ‌: యూసీసీని ఏ రూపంలో తీసుకొస్తున్నారో ఇంకా చెప్పలేం. ఉమ్మడి అనుకున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యం కావాలి. పార్సీ మతం ఉన్నది. దాని మౌలిక లక్షణాలు చూడాలి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఇస్లాం, క్రిష్టియానిటి, హిందూ అందరికీ కామన్‌గా చేయాలి. అలా అని ఉమ్మడి అన్నంత మాత్రాన అందరి అభిప్రాయాలకు పూర్తిగా సమాధానం చెప్పలేం. అలాగే తిరస్కరించలేం కూడా. లా కమిషన్‌ అభిప్రాయాలను ఆహ్వానించడం మంచి పక్రియే. ఒక ఇంట్లో యజమాని ఆదాయం 10వేల రూపాయలు. అందర్నీ సంతృప్తిపరిచే బాధ్యత ఆ యజమానిది. ఉమ్మడి పౌరస్మృతి అంటే మొత్తం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ మేరకు వ్యవస్థను తయారుచేయడం. మత విశ్వాసా లను దెబ్బతీయకుండా దానిని ఎట్లా తీసుకు రావచ్చునో, వ్యక్తి వికాసానికి ఏ రకంగా దోహదం చేయవచ్చో వంటి అన్ని అంశాలను కలిపితేనే చట్టబద్ధత. న్యాయపక్రియను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సామాజిక పక్రియను, మత సంబంధ విషయాలన్నింటిని కలిపి తీసుకుంటేనే మంచి చట్టంగా తయారవుతుంది.

వాస్తవానికి అందులో చేరవలసిన ఇలాంటి చాలా విషయాలను ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ధారించింది. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌మొన్నటి దాకా ఉంది. ఇపుడు లేదు. అలాగే బహు భార్యత్వం. దీనికి ఇవాళ ఏ మతం ఆమోదం తెలుపదు. ఇవన్నీ పరిశీలించి ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చూసుకొని, మతపెద్దల అభిప్రా యాలు తీసుకుంటే దీనితో సమర్థవంతమైన జాతిని తయారుచేయవచ్చు. దురదృష్టం ఏమంటే మనలో చాలామందికి మాది భారతజాతి అన్న భావన రావడం లేదు. దానితో నష్టం జరుగుతున్నది.

మొద‌టి భాగం: రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది..