Home News రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం”

రాయ‌గూడెంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వ‌ర్యంలో “కార్తీక దీపోత్సవం”

0
SHARE

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 21 సోమవారం ఘనంగా జరిగింది. సుమారు చుట్టు ప్రక్కల 10 గ్రామాల నుండి 3000 పైగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలా నంద భారతి స్వామీజీ ఆశీ:ప్రసంగం చేస్తూ, కులభేదాలు లేకుండానే 5 వేల సంవత్సరాల క్రితం అందరూ గాయత్రి మంత్రం చదివే వారని గుర్తు చేశారు. ప్రపంచానికి సమరసతను చాటి చెప్పిన ఈ దేశంలో అంటరానితనం, కుల వివక్షత తో పాటు కక్ష పూరిత రాజకీయాలు నేడు సమాజ ఐక్యత కు భంగం కలిగిస్తున్నాయన్నారు. మత మార్పిడుల ముఠాలు, లవ్ జిహాదీలు హిందువుల బలహీనతలను ఆసరా చేసుకుని పెచ్చుమీరి పోవటం నేడు చూస్తున్నామన్నారు. దేవాలయంలో, స్మశానంలో అందరికీ ప్రవేశం ఉండాలని, ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా జీవించాలని సూచించారు.

వేదం, రామాయణ, భారత, పురాణాల ద్వారా మహర్షులు సందేశాలు ఇచ్చారు, వీర బ్రహ్మేంద్ర స్వామి కుల భేదాలు పాటించకుండా ప్రజలందరిలో భక్తిని నిర్మించారని, 250 సంవత్సరాల నుండి ఈ రాయగూడెం గ్రామంలో బ్రహ్మేంద్ర మఠం సమరసతను వ్యాప్తి చేయటం ఎందరికో ఆదర్శమని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు నరేంద్ర దత్తు, వెంకటేశ్వర్రావు, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి మోహన్ కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.