న్యూడిల్లీ: నూతనంగా ఏర్పాటైన నరేంద్రమోదీ ప్రభుత్వంలో పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిన్న రాత్రి 57 మంది మంత్రులతో కొత్త కేబినెట్ కొలువుదీరింది. వీరిలో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈసారి మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్ ఎనర్జీ, స్పేస్ విభాగాలతో పాటు ఇంకా మంత్రులెవరికీ కేటాయించని ఇతర శాఖలు ప్రధాని మోదీ తన వద్దే ఉంచుకున్నారు.
కేంద్రమంత్రుల శాఖల వివరాలు
కేబినెట్ హోదా
రాజ్‌నాథ్‌సింగ్: రక్షణశాఖ నిర్మలా సీతారామన్: ఆర్థికశాఖ అమిత్ షా: హోం శాఖ సుబ్రమణ్యం జైశంకర్: విదేశాంగశాఖ సదానందగౌడ: రసాయన, ఎరువుల శాఖ రామ్‌విలాస్ పాసవాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు నరేంద్రసింగ్ తోమర్: వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ రవిశంకర్ ప్రసాద్: న్యాయ, సమాచార, ఐటీ శాఖ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: ఆహార శుద్ధి పరిశ్రమ థావర్ చంద్ గహ్లోత్: సామాజిక న్యాయం, సాధికారత రమేశ్ పొఖ్రియాల్: మానవ వనరుల అభివృద్ధిశాఖ | అర్జున్ ముందా: గిరిజన సంక్షేమం స్మృతి ఇరానీ: స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ హర్షవర్ధన్: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ప్రకాశ్ జావడేకర్: పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ పీయూష్ గోయల్: రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ ప్రహ్లాద్ జోషీ: పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ మహేంద్రనాథ్ పాండే: నైపుణ్యాభివృద్ధి శాఖ అరవింద్ గణపత్ సావంత్: భారీ పరిశ్రమలు గిరిరాజ్ సింగ్: పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనార్టీ సంక్షేమశాఖ గజేంద్రసింగ్ షెకావత్: జలశక్తి |
స్వతంత్ర హోదా
సంతోష్ కుమార్ గాంగ్వర్ : శ్రామిక, ఉపాధి కల్పన శాఖ ఇంద్రజీత్ సింగ్: ప్రణాళిక, గణాంక శాఖ శ్రీపాద యశోనాయక్: ఆయుష్, రక్షణశాఖ జితేంద్ర సింగ్: ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి కిరణ్ రిజిజు: క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు | ప్రహ్లాద్ సింగ్ పటేల్: సాంస్కృతిక పర్యాటక శాఖ రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి హర్‌దీప్ సింగ్ పూరి: గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ మన్‌సుఖ్ మాండవీయ: షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు |
సహాయ హోదా
ఫగన్‌సింగ్ కులస్థే: ఉక్కు శాఖ అశ్వనీ కుమార్ చౌబే: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అర్జున్‌రామ్ మేఘవాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు జనరల్ వీకే సింగ్: రహదారులు, రవాణాశాఖ కిషన్ పాల్: సామాజిక న్యాయం, సాధికారత రావు సాహేబ్ ధాన్వే : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ కిషన్ రెడ్డి: హోంశాఖ పురుషోత్తమ్ రూపాలా : వ్యవసాయం, రైతు సంక్షేమం రాందాస్ అథవాలే : సాంఘిక న్యాయం, సాధికారత సాధ్వి నిరంజన్ జ్యోతి : గ్రామీణాభివృద్ధి బాబుల్ సుప్రియో : అటవీ పర్యావరణ శాఖ సంజీవ్ కుమార్ బల్యాన్ : పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్ | సంజయ్ ధోత్రే : మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీశాఖ అనురాగ్ ఠాకూర్ : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు సురేశ్ చిన బసప్ప : రైల్వే శాఖ రతన్ లాల్ కఠారియా : నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత మురళీధరన్ : పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు రేణుకా సింగ్ సరూటా : గిరిజన వ్యవహరాలు సోంప్రకాశ్ : పరిశ్రమలు, వాణిజ్యం రామేశ్వర్ తేలి : ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ప్రతాప్ చంద్ర సారంగి : మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ కైలాష్ చౌదరి : వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ దేబశ్రీ చౌదరి : మహిళా శిశు సంక్షేమ శాఖ నిత్యానంద్ రాయ్: హోంశాఖ |