Home News కేరళ విమానాశ్రయంలో పద్మనాభస్వామి ఊరేగింపు

కేరళ విమానాశ్రయంలో పద్మనాభస్వామి ఊరేగింపు

0
SHARE

ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ ఉత్సవ ఊరేగింపును రన్‌వే గుండా తీసుకెళ్లెందుకు అనుమతించడానికి తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి తన రన్‌వేని మూసివేసింది. మంగళవారం 5 గంటల పాటు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. అల్పాసి పండుగ ముగింపును సూచించే ఆలయ “ఆరట్టు” ఊరేగింపు కార్య‌క్ర‌మం చేయ‌డం అక్క‌డి ఆచారం. ఈ ఊరేగింపు కోసం సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు 5గంటల పాటు విమాన సేవలను విమానాశ్రయ అధికారులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు.

ఈ స‌మ‌యంలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రీషెడ్యూల్ చేశారు. ఇప్పటికి కనీసం 10 విమానాలు ఊరేగింపు కోసం రీషెడ్యూల్ చేసిన‌ట్టుగా విమానాశ్రయ సిబ్బంది తెలిపింది. “శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో శతాబ్దాల నాటి ఆచారాన్ని సజావుగా కొనసాగించేందుకు వీలుగా, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే ద్వారా అల్పస్సీ ఆరట్టు ఊరేగింపు కోసం, 2022 నవంబర్ 1న 4గంటల నుంచి 9 గంటల వరకు విమాన సర్వీసులు నిలిపివేయ‌నున్న‌ట్టు విమానాశ్రయ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఊరేగింపు సమయంలో ఆచారంలో భాగంగా ఆలయ విగ్రహాలను కొంతకాలం ఉంచే రన్‌వే సమీపంలో ఆరాటు మండపం ఉంది. దానిని సకల పవిత్రతతో పాటిస్తున్నామ‌ని, సంప్రదాయ ఊరేగింపును సులభతరం చేస్తున్నామ‌ని, ఆచారాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ విమాన కంపెనీలు కూడా అన్ని రకాల సహకారాన్ని అందజేస్తున్నాయ‌ని అని ఆల‌య సిబ్బంది తెలిపింది.

ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ ఉత్సవ ఊరేగింపును సజావుగా నిర్వహించేందుకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. ఇది 1932లో విమానాశ్రయం స్థాపించక ముందు నుంచే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆచారం. వాస్తవానికి, గతేడాది ఎయిర్‌పోర్టు నిర్వహణను అదానీ గ్రూప్‌ చేపట్టగా, ఆచారబద్ధంగా ఊరేగింపు కోసం దాన్ని మూసివేసే పద్ధతి కొనసాగింది.

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో జరిగే ఆరాట్టు ఉత్సవం తిరువనంతపురం ప్రజలకు ఒక ప్రత్యేక ఆచారం. ఇందులో భాగంగా సముద్రంలో పవిత్ర స్నానం (ఆరట్టు) చేసి ఆలయం నుండి శంఖుముఖం బీచ్ వరకు సంవత్సరానికి రెండుసార్లు (అల్పసి, పంగుని పండుగలు) ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపుకు ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నాయకత్వం వహిస్తుంది. ఆచార వ్యవహారాలను అనుసరించి ఆలయ మైదానంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సాంప్రదాయ పద్ధతి ప్రకారం, ఆలయ దేవతల ఊరేగింపు విగ్రహాలను ఒక ఉత్సవ ఊరేగింపులో సంవత్సరానికి రెండుసార్లు పవిత్ర స్నానం కోసం విమానాశ్రయం వెనుక ఉన్న సముద్రం వరకు తీసుకువెళతారు.

అక్టోబరు-నవంబర్‌లో జరిగే ద్వై-వార్షిక అల్పాసి ఉత్సవం, మార్చి-ఏప్రిల్‌లో జరిగే పంగుని పండుగ కోసం రన్‌వే మూసివేయడానికి ముందు విమానాశ్రయం సంవత్సరానికి రెండుసార్లు నోటీసు విడుదల చేస్తుంది.