గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనలో జాతివ్యతిరేక శక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా ఎర్రకోట ప్రాంగణంలో కొందరు తీవ్రవాద మద్దతుదారులు సిక్కు అనుకూల జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే.
రైతు ఉద్యమంలో ఖలీస్తాన్ తీవ్రవాద సానుభూతిపరులు ప్రత్యక్షంగా పాల్గొని గందరగోళం సృష్టించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో నల్లటి టీషర్టు, తెల్లటి తలపాగా ధరించిన ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. జాగ్రత్తగా గమనిస్తే అతడు రైతు కాదు, పంజాబీ నటుడు దీప్ సిద్ధుగా తేలింది. బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కి ఇతడు గతంలో సన్నిహితుడిగా తెలిసింది. అంతే కాదు భారతదేశాన్ని మరోమారు మతప్రాతిపదికన విభజించి, ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటు చేయాలన్న తీవ్రవాద డిమాండుకు ఇతడు గట్టి మద్దతుదారుడు. ఈ అంశంలో దీప్ సిద్ధూ ఎన్నో తీవ్రవాద అనుకూల వ్యాఖ్యలు కూడా చేశాడు.
https://twitter.com/pksachdev4777/status/1332545108198080515?s=20
అయితే తాజాగా జరిగిన రైతుల ఉద్యమంలో వికీ థామస్ పాల్గొనడం పాల్గొనడం ఆందోళన కలిగించే అంశం. గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి దిగిన తన ఫోటోలను 2016 మార్చిలో తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
Source: OPINIDA & NIJAM TODAY