Home News పోరాట పటిమ – ఉద్ధాంసింగ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

పోరాట పటిమ – ఉద్ధాంసింగ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

0
SHARE

జూలై 31 – ఉద్ధాంసింగ్ బ‌లిదాన్ దివ‌స్‌

ఈ వ్యాసం లో ఉద్దంసింగ్ కధను చెప్పటం లేదు ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని చర్చించటం లేదు. ఏ వెబ్ సర్చ్ ఇంజిన్ లో చూసినా ఈ విషయాలు తెలుస్తాయి. భరత మాత ముద్దు బిడ్డ ఉద్ధాంసింగ్ జలియన్‌వాలా బాగ్ దారుణానికి ప్రతీకారం ఎలా తీర్చాడు అని. మైకేల్ ఫ్రాన్సిస్ ఓ డైయర్ అనే వ్యక్తి  (పంజాబ్ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్న వ్యక్తి ) జనరల్ డయ్యర్ పైశాచిక ప్రవర్తనను మూర్ఖం గా సమర్థించినందుకు. ఇంగ్లాండ్ లోనే ఆయనను శిక్షించాడు అని ప్రముఖంగా కనపడుతుంది. అయితే ఈ వ్యాసం  ‘ భారతీయుల ‘ అసామాన్య పోరాట తత్వాన్ని గురించి చర్చ. ఎందుకు ఈ నేటి ‘ భారతీయులు ‘ ఈ ఆవశ్యకమైన ‘క్షాత్రాన్ని’  వదిలి వేశారు ? అన్నది ఇందు లోని ముఖ్య అంశం .

ఉద్ధాంసింగ్ చేసిన ప్రతీకారచర్య ఎన్నదగినది . ప్రపంచ చరిత్ర లోనే అతిహేయమైన, అమానవీయమైన జలియన్ వాలాబాగ్ ఉదంతం యావత్ భారత జాతిని ఉద్వేగపరిచింది, యువరక్తం మరిగిపోయేటట్లు ఉరికించింది. భారతవీరుల పోరాటపటిమ, ప్రతీకారేచ్చ ఇదిగో ఈ ఉద్ధాంసింగ్ చర్యతో తేటతెల్లం అవుతుంది. ఉద్దంసింగ్ ప్రతీకార ఉదంతం భారతీయ చరిత్రలో పేర్కొనదగ్గ అంశం, ఆయన కు నచ్చిన పద్దతి లో ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు నిజమే, కానీ ప్రతీకారం తీర్చారన్నది ముఖ్యం. చరిత్ర పుస్తకాలలో నమోదైన (నమోదు కానీవి అనేకం) అతి కొన్ని అంశాలలో ఈ చర్య ఒకటి. గురుతేజ్ బహదూర్ సింగ్ వంటి అద్వితీయ ధైర్యవంతులు చూపిన బాట ఇది. భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, రాజగురు వంటి ధైర్యశాలురు నడిచిన బాట అది. శత్రువు ఇంటికి వెళ్ళి రొమ్ము చూపిన ఉగ్రసింహాల తీరు అది. నిజమే ప్రతీకార దాడి లో ఆత్మ బలిదానం కంటే విజయులై రావటం గొప్పే కానీ ఈ కుటిల రాజకీయ యుద్ద క్రీడల్లో ప్రతీకారేచ్చ పోగొట్టుకోవడం కంటే ఆత్మబలిదానం అత్యుత్తమం .

భారతదేశ చరిత్ర పుస్తకాలలో అహింస, క్షమ అతి గొప్ప లక్షణాలు ఈ సమాజం లక్షణాలు గా కీర్తించ బడినాయి. పృథ్వీ రాజ్ చౌహాన్ , ఇస్లామిక్ తీవ్రవాది హంతకుడు అయిన విదేశీ ఆక్రమణ దారుడిని  ‘ఎనిమిది’ సార్లు ఓడించి క్షమించి వదిలివేశాడు అని చదువుకున్నాం (ప్రభంద కోశం లో ఇరవై సార్లు అని , ప్రభంద చింతామణి లో ఇరవై ఒక్క సార్లు అని నమోదు చేయబడ్డది) చివరికి ఏమైంది , ఆ దుర్మార్గుడి చేతిలో ఓడించబడి చంపబడ్డారు. సరే అది ఎప్పటిదో చరిత్ర అనుకుంటే ఈ మధ్యకాలంలో 1971 లో పాకిస్థాన్ తో యుద్దం లో దాదాపు లక్షమంది యుద్దఖైదీలను చేతిలో ఉంచుకుని , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను విడిపించుకునే అవకాశం ఉండి కూడా అనాలోచితం గా క్షమించి వదిలి వేయడం ఒక పెద్ద చారిత్రక తప్పిదం. మన పిల్లలకి అహింస అహింస అంటూ ఉగ్గుపాలతో నేర్పిస్తున్నాం. బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇవ్వటానికి సుభాష్ చంద్ర బోస్  ఆజాద్ హింద్ ఫౌజ్ విజయాలే అని తేటతెల్లమయినా ఇంకా మన చరిత్ర పుస్తకాలలో ‘గాంధీ‘ గారి అహింసాయుత పద్దతులే కారణమంటూ చెప్పుకుంటున్నాం. కుటిల శత్రువుతో కూడా ఇంకా ధర్మం, సత్యం అంటూ పన్నాలు వల్లిస్తున్నాం ఎందుకు ??.

చారిత్రకంగా గత వెయ్యేళ్ళ లో మన దేశం ఎవ్వరి మీద దాడి చేయలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నాం. హిందూ సమాజం  పరమతాల మీద దాడి చేయదు అని గొప్పగా చెప్పుకుంటున్నాం . ఇప్పుడు మన సనాతన ధర్మం మీద ముప్పేట దాడులు జరుగుతున్న ఈ సందర్భాలలో ఈ సూత్రాలు ఇంకా అవసరమా ?? అత్యంత ప్రాచీన ధర్మం కలిగిన హిందూ సమాజం ప్రపంచంలో మూడో అతిపెద్ద సమాజం. దాదాపు ప్రపంచంలోని 94 %హిందువులు నివసిస్తున్న సమాజం. నిజానికి అసలు ‘ హిందూ దేశం ‘ అనే పేరుతో ఒక దేశమే లేని సమాజం. హిందువులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నా ఈ దేశాన్ని హిందూ దేశం అని పిలవలేని దుస్థితి. ఈ సమాజంలో జరిగిన ఒక దురాగతాన్ని సరిదిద్దటానికి దాదాపు 500 సంవత్సరాలు పట్టింది. మనమందరం కొలుచుకునే రామచంద్ర ప్రభువు జన్మ స్థానాన్ని విడిపించగలిగాము, అది కూడా ఒక సుధీర్ఘమైన న్యాయపోరాటం తరువాత. మరి అయోధ్య ఒక్కచోటే ఆలయాలను ద్వంసం చేశారా మిగిలిన వేలాది సనాతన ఆలయాల మాట ఏమిటి ?? ఆ ఆలయాలను ద్వంసం చేసి కట్టిన ఇతర మత కట్టడాల మాటేమిటి ??. ఈ సంపదను కాపాడటానికి మనం ఏమి చేశాము ?? ‘The Places of Worship (Special Provisions) Act’ అనే చట్టం ద్వారా మన సమాజం పై జరిగిన దాడిని నిస్సిగ్గుగా పరిరక్షిస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోందని సమీక్ష చేసుకుంటే పూర్తిగా మన అనైక్యతే కారణమని స్పష్టమవుతుంది. కుల, ప్రాంత, భాషాదురభిమానం ఇలా అనేక అంశాలు. అసలు భిన్నత్వంలో ఏకత్వం అనే విషయమే చర్చించాల్సిన అంశం. మన అనైక్యత ఇక్కడతో ఆగలేదు. ఇప్పటికీ మన సనాతన సంప్రదాయాన్ని తుడిచి పెట్టాలి అని ప్రయత్నం చేసిన అనేక మంది దురాత్ములు , దుర్మార్గులు . మతమౌఢ్యుల పేర్లను ఇంకా మనం మన నగరాలకు , మన రోడ్లకు ఉంచుకుని రోజూ స్మరిస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తైతే అసలు భారత జాతీ అన్న పదమే పెద్ద తమాషా అని ప్రకటించే రాజకీయ పార్టీ లకు  వోట్లు కూడా వేస్తున్నాం.

ఉద్దంసింగ్ ఆత్మ బలిదాన దినమైన ఈ రోజైనా మనం మరొక్కసారి ఈ అంశాలను మళ్ళా చర్చించాలి. మన జాతి దిశను, ఆలోచనా విధానాన్ని సవరించుకోవాలి, సరిచేసుకోవాలి . నిజమే గెలిచిన వాడే చరిత్రను వ్రాస్తాడు. మరి మనం నిజంగా ఓడిపోయిన జాతేనా. మనకు విజయాలే లేవా ?? విజయాలు ఉంటే మనం ఆ విజయాలను ఎందుకు చరిత్రలో ప్రకటించలేదు ??  పైగా గెలిచిన వాడు నిజంగా తన పరాక్రమంతో గెలిచాడా  లేక మన క్షమ , జాలి గుణాలను వాడుకొని కుటిల నీతితో గెలిచాడా?? ఈ అంశాలు ఇప్పుడు కూడా చర్చించకపోతే మన భావితరాలు కూడా ఈ భ్రమల్లోనే ఉండిపోతారు. ‘అహింసా పరమోధర్మః‘ అనుకుంటూ ఉండిపోతారు. నిజానికి వారు చదవాల్సిన పూర్తి పాఠం ‘ అహింసా పరమోధర్మః  ధర్మ హింస తదైవచ‘ (అహింస ఎలాంటి పరమ ధర్మమో, ధర్మహింస కూడా అటువంటిదే)

ఉద్ధాం సింగ్ ఈ స్ఫూర్తిదాయక చర్య మన భారతీయ సమాజాన్ని మరింత ధర్మ పరిరక్షణ దిశగా నడిపించి, మన ధర్మంపట్ల, క్షాత్రం పట్ల సరైన అవగాహన కలిగించే దిశగా నడిపించాలని కోరుతూ భారత్ మాతాకీ జై , జైహింద్

ఆంగ్ల మూలం: అనంత్ సేథ్  

స్వేచ్ఛానువాదం : చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

This article was first published in 2021