-బూదారపు పృథ్వి రాజ్
రామాయణ మహాభారతాలు పూర్వకాలంలో భారతదేశంలోని మనుషుల ప్రవర్తన, అలవాట్లు, ఆచారాలు, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, నాగరికత ఎలా ఉన్నావో వివరిస్తాయి. ఇటువంటి పురాణాలలో అతి పురాతనమైనది రామాయణం ( అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం ) రామాయణమే అసలైన మొదటి సంస్కృత పద్య కావ్యం అని చాలామంది అంగీకరిస్తారు. ఈ గ్రంథానికి ముందు సంస్కృతంలో కొన్ని పద్య కావ్యాలు ఉన్నాయి. వాటిని ఒక రకమైన ఛందస్సులో వ్రాశారు (వాటిని అసలైన పద్య కావ్యాలుగా వర్గీకరించరు) రామాయణానికి పూర్వపు రచనలన్నీ వేద వాజ్మయం లోనివే.
రామాయణాన్ని రాసిన కవి పేరు వాల్మీకి. కాలం గడిచే కొద్దీ చాలామంది కవుల కథలన్నీ అతడికే ఆపాదించ బడ్డాయి. వాల్మీకి తర్వాత కాలంలో రామాయణంలో చాలా శ్లోకాలను చేర్చి అవన్నీ కూడా వాల్మీకి వ్రాసినదే అనడం సాధారణమైపోయింది అయితే ఈ చేర్పులు అన్నీ ఎలా ఉన్నా మొత్తం మీద ఆ గ్రంథం ఒక అందమైన కూర్పు గా తయారైంది. ప్రపంచ సాహిత్యంలో దానికి సాటి మరొకటి లేదు.
పూర్వం రత్నాకరుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు తన కుటుంబాన్ని పోషించడానికి ఏ మార్గము దొరకక చివరకు దారులు కొట్టేవాడి గా తయారయ్యాడు. అడవిలో వెళ్లే వారిని దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపి ఆ ధనం తో తల్లిదండ్రులను భార్య పిల్లలను పోషిస్తున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి చివరకు ఒకరోజు నారద మహర్షి ఆ త్రోవలో వచ్చాడు యథాప్రకారం ఈ రత్నాకరుడు అతన్ని అటకాయించాడు.
ఆ మహర్షి రత్నాకరుడు తో “నన్ను ఎందుకు దోచుకోవాలి అనుకుంటున్నావు?” ఇలా మనుషుల్ని దోచుకోవడం చంపడం మహా పాపాలు అని నీకు తెలియదా ? దీనివల్ల ఎంత పాపాన్ని మూట గట్టుకుంటున్నావో తెలుసా? అని అడిగాడు. అవన్నీ నాకు తెలియదు నేను ఈ డబ్బుతో నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఈ పని చేస్తున్నాను అన్నాడు రత్నాకరుడు. ఇది విని నారదమహర్షి నీకు తెలియదు అంటున్నావు కాబట్టి చెబుతున్నాను విను నువ్వు ఇలా అనేక మందిని బాధించి చంపి బోలెడు పాపాన్ని మూట గట్టుకుంటున్నావు. మరి ఈ నీ ధనం లో వాటా పంచుకుంటున్న మీ కుటుంబంలోని వాళ్లు నీ పాపాల లో కూడా వాటా పంచుకుంటారా? అని అడిగాడు రత్నాకరుడు కొంచెం కూడా తడబడకుండా తప్పకుండా పంచుకుంటారు అని సమాధానం చెప్పాడు చాలా మంచిది నాయనా! వారిని ఆ విషయం అడిగి తెలుసుకుంటే మేలేమో కదా ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి నన్ను ఇక్కడే చెట్టుకు కట్టివేసి, నీ ఇంటికి వెళ్లి నీవు సంపాదించే డబ్బు లో వాటా తీసుకుంటున్నట్టు గానే నీ పాపం లో కూడా వాళ్లు వాటా తీసుకుంటారేమో కనుక్కొని రా !”అని రత్నాకరుడికి చెప్పాడు. రత్నాకరుడు అలాగే చేసి ఇ తన తండ్రి దగ్గరకు వెళ్లి “తండ్రి! నేను కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన డబ్బులు ఎలా సంపాదిస్తున్నానో మీకు తెలుసా?” అని ప్రశ్నించారు. తండ్రి,”నాకు తెలియదు!” అని జవాబిచ్చాడు. “దారులు కొట్టి ప్రాణాలు తీసి ఈ డబ్బులు సంపాదిస్తున్నాను!” అని చెప్పాడు. ఇది వినగానే అతడి తండ్రి “ఓరి దరిద్రుడా! నువ్వు చేసే పని ఇదా! పో అవతలికి! అని శాపనార్థాలు పెట్టాడు. రత్నాకరుడు తన తల్లి దగ్గరకు వెళ్లి “అమ్మ! నేను మిమ్మల్ని ఎలా పోషిస్తున్నా నో నీకు తెలుసా?” అని అడిగాడు. ఆమె కూడా తనకు తెలియదని చెప్పింది. తాను దోపిడీల ద్వారా డబ్బు సంపాదించే హంతకుణ్ని అని అని అతడు తల్లితో చెప్పగానే ఆమె ఎంత ఘోరం అని వాపోయింది. రత్నాకరుడు ఆమెతో అమ్మ మరి నువ్వు నా పాపం లో వాటా పంచుకుంటావా? అని అడిగాడు ఆమె ఏడుస్తూ నేను ఎందుకు తీసుకోవాలి ? నేను ఏ పాపము చేయలేదే ! అన్నది. ఇక రత్నాకరుడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు ఆమె కూడా తాను తను ఎలా పోషిస్తున్నాను తెలుసా అని అడిగితే తెలియదు అని చెప్పింది. నేనొక బందిపోటు దొంగను. చాలా ఏళ్లుగా నేను బాటసారులను దోచుకుంటూ మిమ్మల్ని పోషిస్తున్నాను. ఇప్పుడు నేను నిన్ను అడిగేది ఏమిటంటే నా పాపం లో వాటా తీసుకుంటావా ? అని ప్రశ్నించాడు. అతడి భార్య మరుక్షణమే ఎట్టి పరిస్థితులలోనూ నీ పాపాల లో నేను వాటా తీసుకోను. నీవు నా భర్తవు కావా నన్ను పోషించాల్సిన బాధ్యత మీకు లేదా? అని ఎదురు ప్రశ్నించారు.
ఈ సమాధానాలతో రత్నాకరుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది కాబోలు ఎవరి కోసమైతే నేను ఈ దొంగతనాలు అన్నీ చేస్తున్నానో, అటువంటి నాకు అతి సన్నిహితులైన బంధువులు కూడా నా పాపం లో పాలు పంచుకోవడానికి ఇష్టపడడం లేదు అనుకొని త్వరత్వరగా నారద మహర్షిని పడవేసిన చోటికి వచ్చి ఆయన కట్లు విప్పి ఆయన పాదాల మీద పడ్డాడు జరిగినదంతా ఆయనతో చెప్పాడు. గొప్ప వ్యాకులతతో నన్ను రక్షించండి తెలియక ఇంతకాలంగా తప్పు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అని అడిగాడు. నారద మహర్షి ఇ నీవు సాగిస్తున్న జీవితాన్ని ఇక విడిచిపెట్టు మీ మీ కుటుంబంలో ఎవరూ నిన్ను నిజంగా ప్రేమించడం లేదని ఇప్పుడు తేటతెల్లమైంది కదా కాబట్టి ఈ భ్రమలు అన్నింటినీ వదిలిపెట్టు వాళ్లు నీ సంపద లో పాలుపంచుకుంటారు కానీ నీ దగ్గర ఏమీ లేని మరు క్షణం నిన్ను వదిలిపెట్టి పోతారు. మీ పుణ్యాన్ని పంచుకోవడానికి అందరూ తయారవుతారు కానీ నీ పాపాన్ని పంచుకోవడానికి ఎవరు ముందుకు రారు ఎవరైతే మనం మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా మనల్ని విడిచి పెట్టడో అతన్ని ఆరాధించడం ప్రారంభించు ఆయన ఇప్పటికీ మన చేయి విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని నిజంగా ప్రేమించే వాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ దిగజార్చదు. దానిలో ఎటువంటి స్వార్ధము ఉండదు. నీకు ఇది ఇస్తే నాకేమీ ఇస్తావ్ అంటూ నిజమైన ప్రేమ లెక్కలు వేయదు. అని సమాధానం ఇచ్చాడు.
నారదమహర్షి అతడికి ‘ అనే మంత్రాన్ని బోధించి ఎలా జపం చేయాలో నేర్పాడు. రత్నాకరుడు అన్నీ వదిలిపెట్టి అడవిలోకి వెళ్లి తపస్సు చేయసాగాడు. అతడు ధ్యానంలో ఎంతగా తాదాత్మ్యం చెందాడు అంటే అతడి చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి. కానీ అతడికి అదేమీ తెలియదు అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఓ మహర్షి!ఇక పైకి లే! అని ఒక కంఠస్వరం వినిపించింది. “నేను మహర్షి నా? నేనొక దారులు కొట్టే వాడినండి!” అని రత్నాకరుడు పలికాడు. ఆ కంఠస్వరం, ఇక నీవు దొంగవు కావు నీలోని పాపం అంతా పోయి నీవు ఇప్పుడు ఒక పవిత్రమైన మనిషిగా తయారయ్యావు నీ పాత పేరు ఇక లేదు నీ చుట్టూ వల్మీకాలు (అంటే చీమల పుట్టలు) పెరుగుతున్న తెలియనంత అగాధమైన తపస్సులో మునిగి పోయావు కాబట్టి ఇక నుంచి నీవు ‘వాల్మీకి’ పిలువబడతావు. అని పలికింది. (వాల్మీకి అంటే వల్మీకంలో పుట్టిన వాడు అని అర్థం) ఆ విధంగా ఒక బందిపోటు మహర్షి అయ్యాడు.
హంతకుడు అయిన రత్నాకరుడు మారగలడు అని నారదుడు ఎలా ఊహించాడు తెలుసుకోవాలంటే, అతడు ఏ పని చేస్తున్నాడు అన్నదానికన్నా ఎలా పని చేస్తున్నాడో గమనించాలి. అతడు భార్యాబిడ్డల ని పోషించడానికి తాను చేసే పనిని పట్టుదలతో చేస్తున్నాడు. అతడికి దానిలో నీ తప్పు అర్థం కాకపోయినా అతడిలోని ఉత్సాహం చాలా గొప్పదని నారదుడు గ్రహించాడు. అటువంటి ఉత్సాహం, బలం కలవాడే ఏమైనా సాధించగలడు. వివేకానందస్వామి ఒక సందర్భంలో మాట్లాడుతూ తూ దుర్మార్గుడైన మనిషి బలవంతుడు అయితే అతడు తనను తాను మార్చుకోగలవు తాడు. కాబట్టి శారీరకంగా బలహీనుడిగా ఉన్న వాడి కంటే బలవంతుడే మెరుగు. ఎందుకంటే అతడు ఏదో ఒక నాటికీ బాగుపడతాడు అని మనం ఆశ పడవచ్చు అని బోధించారు. కాబట్టి వాల్మీకి లాంటి పట్టుదల, బలం మనకు కావాలి. చుట్టూ చీమలు పుట్టలు పెట్టిన తెలియనంత ఏకాగ్రతతో తపస్సుచేయడానికి దృఢనిశ్చయం ఉన్న మనసుతో పాటు అతి దృఢమైన శరీరము కూడా కావాలి కదా! మహర్షిగా వాల్మీకి ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతమైన జీవనాన్ని గడుప సాగాడు. ఒకరోజు అతడు స్నానానికి గంగానదికి వెళుతున్నాడు దారిలో ఒక క్రౌంచ పక్షుల జంట ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ముద్దాకుంటూ కనిపించాయి. వాల్మీకి ముని ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న క్షణంలోనే ఎక్కడ నుంచి ఒక భాణం రివ్వున వచ్చి వాటిలోని మగ పక్షిని నేలకు పడగొట్టింది. ఆడ పక్షి చనిపోయిన మగ పక్షి చుట్టూ బాధతో తిరగసాగింది. వాల్మీకి వెనక్కి తిరిగి చూస్తే ఆ వేటగాడు కనిపించాడు. ఓరి నీచుడా నీకు అణువంత అయినా జాలి లేదా అవి ప్రేమించుకుంటున్నాయని చూసి కూడా నీ కసాయి చెయ్యి వెనక్కి తగ్గలేదా! అనే దుఃఖంతో అన్నాడు. కానీ ఆ క్షణంలో తాను పలికిన పలుకులు వాల్మీకే ఆశ్చర్యం కలిగించాయి ఇదేమిటి నేను పలికింది చాలా విచిత్రంగా ఉంది ఇంతకుముందు ఎన్నడూ నేను ఈ విధంగా ఏదీ పలక లేదు అని తనకు తానే ఆశ్చర్యపోయాడు అదే సంస్కృతంలో రచించబడిన మొదటి శ్లోకం అప్పుడు ఎక్కడ ఉందో ఒక కంఠస్వరం భయపడకు నేను నోటినుంచి పలుకుతున్నది కవిత్వం. శ్రీరాముడి జీవితాన్ని ఈ పద్య కావ్య భాషలో రచించు వాల్మీకి హృదయంలో పెల్లుబికిన శోకం ప్రేరేపించగా ఆ మొట్టమొదటి శ్లోకం అతడి నోట పలికింది. అదే పద్ధతిలో ఆయన మనోహరమైన రామాయణాన్ని రచించాడు.