Home News ఆదర్శవంతమైన వ్యక్తిత్వం.. నిరాడంబర జీవితం.. మనోహర్ పారికర్ మృతికి దేశవ్యాప్త సంతాపం 

ఆదర్శవంతమైన వ్యక్తిత్వం.. నిరాడంబర జీవితం.. మనోహర్ పారికర్ మృతికి దేశవ్యాప్త సంతాపం 

0
SHARE
భారత మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారికర్ స్వర్గస్థులయ్యారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోహర్ పారికర్ మర్చి 17, 2019 సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
డిసెంబర్ 13, 1935న గోవాలోని మపుసాలో జన్మించిన మనోహర్ పారికర్ లయోలా ఉన్నత పాఠశాల నుండి హైస్కూల్ విద్య పూర్తిచేసుకుని 1978లో ఐఐటీ-ముంబై నుండి మెటల్లర్జిజకల్ ఇంజనీరింగులో పట్టా సంపాదించారు. పారికర్ భార్య పేరు మేధా పారికర్, వారికి ఇద్దరు కుమారులు. 2000 సంవత్సరంలో మేధా పారికర్ క్యాన్సర్ కారణంగా మృతిచెందారు.
మనోహర్ పారికర్ యుక్త వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకునిగా మారారు. విద్యార్థి దశలో శాఖలోని ముఖ్య శిక్షక్ గా బాధ్యతలు కలిగివుండేవారు.
ఐఐటీలో ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసుకున్నాక పారికర్ స్వస్థలమైన మపుసాలోనే ఒక వ్యాపారం నిర్వహించుకుంటూ సంఘ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అనంతరం 26 ఏళ్ళ వయసులో తమ నగర సంఘ చాలాక్ బాధ్యతలు స్వీకరించారు.
ఉత్తర గోవా రాష్ట్రంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మనోహర్ పారికర్ కీలక పాత్ర పోషించారు.
మనోహర్ పారికర్ మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమపూజనీయ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ మాననీయ సురేష్ జోషి తమ సంతాపం వ్యక్తం చేస్తూ.. “దేశం ఒక గొప్ప దార్శనికుడిని, మేధస్సు కలిగిన నాయకుడిని, అంకితభావం కలిగిన స్వయంసేవక్ ని కోల్పోయిందని” అన్నారు. మనోహర్ పారికర్ ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్ధించారు.
మనోహర్ పారికర్ మృతి పట్ల రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.
Source: Organiser