శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వయోపరిమితి నిబంధనను అనుసరించడం లింగవివక్షకు సంబంధించిన విషయం కానేకాదు. అది ఆ ఆలయంలో ఉన్న దేవత పూజావిధానానికి చెందిన విషయం మాత్రమే. కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానాలు జరిపే ఎలాంటి పరిశీలన, సమీక్ష అయినా రాజ్యాంగం నిర్దేశించిన మత స్వేచ్ఛకు భంగకరమనే మేము భావిస్తాము. ఇలాంటి విషయాల్లో దేవాలయ నిపుణులు, అధికారుల అభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వాలి.
అయితే పునస్సమీక్ష పిటిషన్ ను ఆమోదించి ఎక్కువమంది సభ్యులు కలిగిన బెంచ్ కు విషయాన్ని అప్పగించాలన్న సర్వోన్నత నాయస్థానపు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము.
– అరుణ్ కుమార్,
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, ఆర్ ఎస్ ఎస్.