Home News భీమా-కోరేగావ్ కేసు: న్యాయమూర్తి వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియా

భీమా-కోరేగావ్ కేసు: న్యాయమూర్తి వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియా

0
SHARE

భీమా-కోరేగావ్ కేసు ప్రధాన నిందితుడైన వెర్నాన్ గొంస్లావ్స్ బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా, లభ్యమైన సాక్ష్యాధారాలపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించి ప్రచారం చేసింది. వెర్నాన్ గొంస్లావ్స్ అరెస్ట్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు సాహిత్యంలో బిశ్వజిత్ రాయ్ సంపాదకత్వం వహించిన “వార్ & పీస్ ఇన్ జంగిల్ మహల్: స్టేట్ అండ్ మావోయిస్ట్స్ (War and Peace in Junglemahal: State and Maoists) అనే పుస్తకం లభించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి అటువంటి పుస్తకం ఆ సమయంలో తన దగ్గర ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. 

మీడియాలోని ఒక వర్గం ఈ సంఘటనను ప్రచారం చేస్తూ “వార్ & పీస్ ఇన్ జంగిల్ మహల్ : స్టేట్ అండ్ మావోయిస్ట్స్ (War and Peace in Junglemahal: State and Maoists) బదులుగా ప్రఖ్యాత రచయిత లియో టాల్స్టాయ్ రాసిన “వార్ అండ్ పీస్” (War & Peace) గ్రంథంపై న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంది. 

మీడియా తప్పుగా ప్రచురించిన కధనాన్ని ఈ విషయాన్ని ఇదే కేసులో మరో ముద్దాయి తరఫున వాదిస్తున్న లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ సారంగ్ కొత్వాల్ “లియో టాల్స్టాయ్ రాసిన ‘వార్ అండ్ పీస్’ పుస్తకం గురించి తనకు తెలుసునని, అది సాహిత్యపరంగా ఉన్నతమైనది వ్యాఖ్యానించారు. మీడియా కథనాలపై జస్టిస్ సారంగ్ కొత్వాల్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కధనాలు న్యాయస్థానాలను ఇబ్బందిపాలు చేసేవిధంగా ఉన్నాయని అన్నారు. 

Source: The New Indian Express