Home Telugu Articles మూగజీవులకు అత్యద్భుతమైన సేవ

మూగజీవులకు అత్యద్భుతమైన సేవ

0
SHARE

మూగజీవులకు అత్యద్భుతమైన   సేవ

శ్యామ్ రాథోర్ రాజస్థాన్లోని భిల్వారాలో ఒక IT ఇంజనీర్. అతను తన ఇంటి బయట ఉపయోగించటానికి సిద్ధంగా ఏర్పాటు చేసిన  ‘పరిందా’ (మంచినీటి కుండ ) ద్వారా పక్షులకు నీటిని అందించడాన్ని ఎన్నడూ విస్మరించరు. “కాలిపోతున్న వేసవిలో నా తలుపు తట్టి దాహంగల వ్యక్తికి నీటిని అందించిన తర్వాత నేను పొందిన సంతృప్తి, ‘పరిందా’ లోని  నీటిని పక్షులకు అందించిన తర్వాత అదే భావోద్వేగం నా హృదయంలో ఉత్పన్నమవుతుంది. ఏ పక్షి అయినా  దానిపై కూర్చుని దాని దాహం తీర్చుకుంటునప్పుడు , నేను ఇచ్చిన నీటిని స్వయంగా ఆ దేవుడు స్వీకరిస్తునట్లు నేనుభావిస్తాను, ” అని ఆయన చెప్పారు. అదే నగరంలో రెడీమేడ్  గార్మెంట్ ట్రేడర్ అయినా అమిత్ పోఖర్నా ఈ కారణంగానే 20,000 పరిందాలను పంపిణీ చేశారు.

ఉదయపూరు కు  చెందిన జీవవైవిధ్య నిపుణుడు ఎస్పి మెహ్రా పక్షులకు నీరు అందించడంలో  వచ్చిన తృప్తి  ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ లేదా చలికాలంలో కాలిదోవ మీద నివసిస్తున్న ప్రజలకు దుప్పట్లు విరాళంగా ఇచ్చేటప్పుడు వచ్చే తృప్తి  కన్నా అధిక  తృప్తిని పొందుతాడు. “ఇది మూగజీవులకు చేసే సేవ ,” అని ఆయన చెప్పారు. జైపూర్లో ఒక పాఠశాలను నడుపుతున్న అశోక్ శర్మ కు , నీటికి పక్షులకు అందించడం అనేది  దేవుణ్ణి ప్రత్యక్ష రూపం లో  సేవిస్తునట్లు భావిస్తారు . “నీరు జీవితం. మానవులు ఎలాగైనా నీటిని పొందుతారు , కానీ దాహం వచ్చినప్పుడు పక్షులు ఏమీ చేయలేవు. మేము వాటికి  నీరు అందిస్తే   ,  జీవన రూపంలో దేవుడికి అందించినట్టే  “అని ఆయన చెప్పారు

రాజస్థాన్లో ఎన్నో వేల మంది భాగస్వాములైన “వేసవిలో వడదెబ్బ నుంచి పక్షులను రక్షిద్దాము” అనే ప్రచారంలో  శ్యామ్ రాథోడ్, అమిత్ పోఖర్నా, ఎస్పి మెహ్రా, అశోక్ శర్మ కూడా పాలుపంచుకుంటున్నారు.ఈ ప్రచారం వలన ఎక్కడైతే ప్రజలు ఈ నీటి కుండలను వారి ఇంటి బయట తోటలలో మరియు వారి ప్రాంగాణాలలో పెట్టారో అక్కడ  స్పృహ కోల్పోయి పడిపోతున్న  పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది . ఈ  డ్రైవ్ యొక్క ప్రభావం  మనం ఈ వాస్తవాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాటిని నీరు. “నీరు దొరక్క ఏ పక్షైనా  అపస్మారక . స్థితికి చేరుకుని నేలమీదపడిపోవడం  చూస్తే, నా హృదయ ద్రవిస్తుంది. ‘అన్నా సంస్థాన్’ కు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు తమ ఇళ్ళకి బయట పెరిండాలను స్థాపించాలని ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నారు . “అని భిల్వారా నివాసి  అయిన ఓం కాసార అన్నారు.

ఆహార చక్రం యొక్క ఆవశ్యకత

‘పరిందాస్’ ను ఏర్పాటు చేయడం  అనేది కొత్త సంప్రదాయం కాదు, పురాతన కాలం నుండి అది మన  రోజువారీ సంస్కారాల్లో భాగంగా ఉంది. కానీ ఇప్పుడు, ఈ నూతన తరం, దాని యొక్క మూలాల నుండి ఆధునికత పేరుతో వేరు  చేయబడింది, దానిని అనుసరించడం మానేశారు . రాజస్థాన్ లో అమృతదేవి పరివారన్ నాగారిక్ సంస్థాన్  (అప్నా సంస్థాన్  ) యొక్క ఆధ్వర్యంలో  ఈ సాంప్రదాయాన్ని జనవరి 3, 2016 లో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.  ఈ ఉద్యమం ఎంత ఊపందుకుందంటే ఇప్పుడు  ‘పరిందాస్’ వ్యవస్థాపన  ఒక పెద్ద పబ్లిక్ ప్రోగ్రాంగా నిర్వహించబడుతోంది . వందలాది మంది వ్యక్తులు తమ తమ ‘పరిందాల  ‘తో ఒక స్థలంలో సమావేశమయి ఆ కార్యక్రమం తరువాత ఆ పారిందాలను  తమ  గృహాలకు వెలుపల  లేదా తోటలలో ఏర్పాటు చేస్తారు . ఏర్పాటు చేసిన వారే ఏడాది పొడవునా  ఆ పారిందాలను జాగ్రత్తగా  చూసుకుంటారు. ఈ సంవత్సరం సుమారు 30,000 ‘పరిందాలు’ భిల్వారా, జైపూర్, సికార్, చురు, ఝుంఝును, కోట మరియు ఉదయపూర్లలో ఏర్పాటుచేయబడ్డాయి. తదుపరి సంవత్సరం 50,000 కొత్త కొత్త  పరిందాలను ఇన్స్టాల్ చేయబడతాయి .ఈ  ప్రచారానికి అసలు కారకులు అయినా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు   ప్రజలను పక్షులను కాపాడటానికి  ‘అప్నా సంస్థాన్ ‘  ద్వారా ప్రేరేపిస్తున్నారు  , ఎందుకంటే మనము ఈరోజు జీవవైవిధ్యాన్ని కాపాడలేకపోతే, రాబోయే రోజుల్లో  మొత్తం మన  ఆహార చక్రం  తీవ్రంగా ప్రభావితమవుతుంది.

ఉష్ణోగ్రత ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. సూర్య వేడి మరింత ఎక్కువుగా ఉంటోంది  మరియు చెట్ల సంఖ్య కూడా తగ్గింది. ఈ పరిస్థితిలో పక్షులకు  నీడ  మరియు నీరు దొరకకపోతే, అవి  అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మరణిస్తాయి . దాదాపు రెండు దశాబ్దాల పూర్వం వరకు నదులు మరియు జలపాతాలు ఏడాది పొడవునా సజీవంగా ఉండేవి . కానీ ఇప్పుడు వాటిలో చాలామటుకు అదృశ్యమయ్యయి  కావున పక్షులు   నీటిని పొందలేకపోతున్నాయి . అందువల్ల, ఈ ప్రచారాన్ని ప్రారంభించాము, పాత సంప్రదాయాన్ని అనుసరించి  నీళ్ళను  మట్టికుండలో  పెట్టడం తద్వారా పక్షులు నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నాము . దూర ప్రాంతాల నుండి వచ్చిన పక్షులు కూడా నీటిని పొందవచ్చు. దీనితో పాటుగా రాజస్థాన్లో ఐదు లక్షల చెట్లను పెంచామని, ‘అన్నా సంస్థాన్ ‘ కార్యదర్శి శ్రీ వినోద్ మెయిల్నా చెప్పారు.

మానవులు, జీవులు మరియు స్వభావం మధ్య సరసమైన సంతులనం కొరకు జీవవైవిధ్యం రక్షణ అవసరం. వ్యవసాయంపై కొంత అవగాహన ఉన్నవారికి మన పంటల్లో సుమారు 15 నుండి 18 శాతం ఉత్పత్తి కీటకాలు పరాగ సంపర్కం ద్వారా సంభవిస్తుంది. ఉద్యానవనంలోని ఉత్పత్తిలో దాదాపు సగం పురుగుల ఫలదీకరణం ద్వారా వస్తుంది, అయితే బాదం వంటి మొక్కలలో 100 శాతం ఉంటుంది. తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మొదలైనవి కీటకాలు ఫలదీకరణం లో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని తేనెటీగలు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అందువల్ల, ప్రతి రోజూ మరియు ప్రతి సీజన్లో మాత్రమే ఆ వ్యాసార్థంలో పుప్పొడి అవసరం. ఆ ప్రాంతంలోని విభిన్న చెట్లు మరియు మొక్కలు ఉంటే, అవి పువ్వులు మరియు పండ్లు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది  మరియు అవి పుప్పొడి పొందుటకు కొనసాగుతుంది. అందుకే బయోడైవర్సిటీ మానవ జీవితానికి తప్పనిసరి.

మొక్కలు నాటటంలో వైవిధ్యం

“మన దేశంలో దాదాపు 1250 పక్షుల జాతులు, వాటిలో 175 మంది ప్రమాదంలో ఉన్నాయి . రెండు మూడు కిలో మీటర్లు  కంటే ఎక్కువ ప్రయాణించలేని కొన్ని పక్షులు ఉన్నాయి. కొన్నిసార్లు, మనము మనకి  తెలియకుండానే,  తప్పులు చేస్తాము -మనము  మొక్కలను నాటడం మొదలుపెడితే, మనము వేప  వంటి  చెట్లను 50 కిలోమీటర్ల వరకు అవే వేస్తాము  . వేప చెట్టుకు  పువ్వులు మరియు పండ్లు సంవత్సరానికి 20 రోజులు మాత్రమే వస్తాయి . ఒక పరిమితి కంటే ఎక్కువ ఎగరులేని  పక్షులు, ఆహార, దొరక్క కొన్ని రోజుల్లో మరణిస్తాయి . అందువల్ల పళ్లు తినే పక్షులు ఇప్పుడు 10 శాతం కన్నా తక్కువగానే ఉన్నాయి. ప్రకృతిలో పుష్పించే మొక్కలు సుమారు మూడు లక్షల రకాలు ఉన్నాయి, ఇవి ఆంజియోస్టెర్మ్స్ అని పిలువబడతాయి. అలాగే, 1.5 లక్షల కీటకాలు ఉన్నాయి. ఈ కీటకాలు మరియు పుష్పించే మొక్కలు ఒకదాని పై ఒకటి ఆధారపడ్డాయి. అందువల్ల, మొక్కలను నాటే  సమయంలో, మనము  ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వివిధ రకాల మొక్కలను నాటాలి మరియు  ప్రత్యేకంగా సాంప్రదాయిక మొక్కలు, నాటే సమయంలో ఇంకా శ్రద్ధ తీసుకోవాలి . కొన్ని  నేలమీద గూడు పెట్టెకునే  పక్షులు ఉన్నాయి. ఎత్తు తక్కువగా ఉన్న మొక్కలపై అవి తమ గూళ్ళను తయారు చేసుకుంటాయి . అందువల్ల, అన్ని రకాల మొక్కలను నాటాలి. ” అని పసిఫిక్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ భగవతి ప్రకాష్ శర్మ చెప్పారు.

హానికరమైన కీటకాలు నుండి పంటలను రక్షించే కీటకాలకు ఆశ్రయం కల్పించే కొన్ని చెట్లు మరియు మొక్కలు ఉన్నాయి.వీటిలో 50-60 రకాల కీటకాలు ఉంటాయి.  కీటకాలు  పంటలను ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోడానికి మనం బెండకాయ చెట్టుని చూసి తెలుసుకోవచ్చు . ప్రకృతి బెండకాయ చెట్టు  దాని యొక్క పంటను సుగంధాన్ని సంశ్లేషించే సామర్థ్యాన్ని ఇచ్చింది , ఇది వివిధ రకాల కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ కీటకాలు తమ గుడ్లను మొక్క మీద వదిలివేస్తాయి. గుడ్డు నుండి బయటకు వచ్చిన లార్వా,  పంటకు ప్రధానంగా హానిని కలిగిస్తుంది . కొన్ని పంటలకు  ఇది  సోకినప్పుడు, ఒక రసాయన సువాసనను ఉత్పత్తి చేస్తుంది, ఈ వాసన చీమలు మరియు కొన్ని జీవులను ఆకర్షిస్తుంది.  ఇవి  మొక్కలకి హాని కలిగించే కీటకాలను చంపుతాయి  . ఇది పంటలను రక్షించే సహజ చక్రం. ఇది ప్రకృతిలో జీవవైవిధ్యం ప్రదర్శించడానికి మాత్రమే కాదు,  ఇది ఆహార చక్రం, ఆహార భద్రత మరియు ఆరోగ్యానికి చాలా అవసరం.

ఆహార భద్రత మరియు ఆరోగ్యం

ప్రకృతిలో సమతుల్యతను సంరక్షించలేకపోతే, స్నేహపూర్వక కీటకాలకు ఆశ్రయం కల్పించకపోతే , చెట్లు, మొక్కలు నాశనం చేయటం ఆపకపోతే మట్టి లో జీవిస్తున్న చీమలు మరియు ఇతర జీవులు పురుగుల ఎక్కువగా ఉపయోగించడం వలన చనిపోతాయి. అప్పుడు మనము  రాబోయే కాలంలో  మన  పంటలను కాపాడడానికి అధిక స్థాయిలో పురుగుమందులను ఉపయోగించాలి. ఈ పురుగుమందులు మానవులకు మాత్రమే  హానికరమైనవి కాదు అన్ని  జీవులకు హానికారాలే . పురుగు మందులు నేలను  మాత్రమే కాదు, భూగర్భజలాలను సైతం  కాలుష్యం చేస్తాయి . ఉదాహరణకు, కోకో – కోలాలో పురుగుమందులు కనిపించాయని వార్తలు వచ్చాయి. కోకో -కోలా యొక్క రెసిపీ పురుగులను కలిగి లేదు. భూగర్భ జలంతో కలుషితమైన పంటలలో పుప్పొడి వేసిన పురుగుల నాశకాలు, ఆ నీటిని కోకా-కోలా ప్లాంట్కు ట్యూబ్ బావుల ద్వారా సరఫరా చేయగా, కోకా-కోలా యొక్క హై-టెక్ మెషీన్లు కూడా ఆ క్రిమిసంహారకాలను శుభ్రపరచలేకపోయాయి.

ఏడాది పొడవునా నదులు మరియు జలాశయాలు జీవించి ఉన్నప్పుడు, ఏడాది పొడవునా  పచ్చదనం మరియు ప్రతి జీవికి తగినంత నీరు ఉండేవి. ఇప్పుడు అటవీ నిర్మూలన బాగా పెరిగిపోవడంతో , సంవత్సరానికి  8-9 నెలల పాటు  ప్రవహించే నదులు, ఇప్పుడు ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే ప్రవహిస్తున్నాయి. అందువలన, ‘పరిందాస్’ సంస్థాపన చేయడం కేవలం నగరాలు  మరియు గ్రామాలలోనే  కాకుండా అడవులలో కూడా చాలా అవసరం. కొంతమంది ప్రజలు అడవి జంతువులకు నీటిని అందించటానికి అటవీప్రాంతాల్లో తొట్టెలను త్రవ్వడం మరియు ట్యాంకులను ఏర్పాటు చేయడం ప్రారంభించారు, కానీ అది పెద్ద ఎత్తున జరగాలి . అడవులలో వేసవిలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంటోంది , అందువలన  అడవి జంతువులు నీటి కోసం  మానవులు  నివాస ముండే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి  “అని బిల్లువారలో వర్షపునీటి పరిరక్షణలో అద్భుత కృషి చేసిన “అపనా సంస్థాన్ ” అధ్యక్షుడు శ్రీ లలిత్ శర్మ చెప్పారు.

బయోడైవర్శిటీ కన్జర్వేషన్ను ఒక ఉద్యమం చేయడానికి, ‘అప్నా సంస్థాన్ ‘ సమాజంలోని వివిధ విభాగాలను కలుపుకుంటూ  వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. జూలై 5 న జైపూర్లో జరిగిన ఒక చర్చను నిర్వహించారు. అక్కడ 20,000 జాతుల మొక్కలు అంతర్దాన మయ్యే పరిస్థితి లో ఉన్నాయి అని డాక్టర్ భగవతి ప్రకాష్ శర్మ చెప్పారు.హర్యానా లోని జింద్ అనే ప్రాంతం లో , సేవా భర్తీ సభ్యులు పక్షుల కోసం కనీసం 1000 తాత్కాలిక గూడులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు, తద్వారా అవి ఏ అడ్డంకి లేకుండా ఆశ్రయం పొందుతాయి. గత 30 ఏళ్ళుగా జైపూర్లోని దుడు తెహ్సిల్ జిల్లాలోని లపోరి గ్రామంలో గ్రామస్తులు వందల రకాల కీటకాలు, పక్షులు, మొక్కలను భద్రపరిచారు.

మొక్కల పెంపకం లో వైవిధ్యం జీవవైవిధ్య పరిరక్షణకు మాత్రమే కాదు, మన  ఆహారపు చక్రం, ఆహార భద్రత మరియు ఆరోగ్యానికి కూడా చాలా అవసరం . పక్షులను కాపాడుకోవటానికి, అవి  నివసించే ప్రదేశంలో ఇల్లు, ఆహారం మరియు నీటిని ఏర్పాటు చేయడం చాలా అవసరం . రాజస్థాన్లోని ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు  మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు . వీరు ఆరంభించిన యి కార్యక్రమం  జాతీయ స్థాయిలో మరింత ముందుకు వెళ్లవలిసిన  అవసరం చాలా ఉంది .

  • Organiser – సౌజన్యం తో 
  • అనువాదం అన్నపూర్ణ