Home News కార్గిల్ యుద్ద పాఠాలను సిలబస్ నుంచి తొలగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

కార్గిల్ యుద్ద పాఠాలను సిలబస్ నుంచి తొలగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

0
SHARE

పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలను తిరిగి పొందడంలో భారత సైన్యం ప్రదర్శించిన వీరోచిత సాహసం, ఎదురులేని ధైర్యానికి 1999 నాటి కార్గిల్ యుద్ధం ఒకజ్ఞాపకం. ఈ మధ్యకాలంలో తరచూ భారత రక్షణ దళాల శౌర్యపరాక్రమాన్ని, సామర్థ్యాన్ని తరచూ అనుమాస్తూ అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే చర్యకు పాల్పడింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎం.వి.ఎం సైన్స్ కాలేజీ పాఠ్యాంశాల్లో మార్పు చేసింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధ పాఠాలను 2019-20 సిలబస్ నుండి తొలగించింది. ఎం.వి.ఎం సైన్స్ కాలేజ్ భోపాల్ లోని పురాతన కళాశాలలోఒకటి. ఈ కళాశాలలో మిలిటరీ స్టడీస్ పై కూడా ఒక కోర్సు ఉంది. 2017-18 విద్యా సంవత్సరానికి గాను కార్గిల్ యుద్ధ పాఠాలను ఈ కళాశాల పాఠ్యాంశాల్లో అప్పటి ప్రభుత్వం చేర్చింది. అయితే 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి వెంటనే రాష్ట్ర కళాశాలల సిలబస్‌ను సమీక్షించడానికి కళాశాల 15 నుంచి 20 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం కోర్సు సిలబస్‌లో మార్పులను సిఫారసు చేసింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్గిల్ యుద్ధ పాఠాలను కళాశాల సిలబస్ నుంచి తొలగించారని మధ్యప్రదేశ్‌  బిజెపి పార్టీ ఆరోపించింది.

కార్గిల్ యుద్ధానికి సంబంధించిన పాఠాలను తొలగించటానికి గల కారణాలను ప్రభుత్వం కానీ, కళాశాల యంత్రంగం కానీ సరియైన వివరణ ఇవ్వలేదు. కార్గిల్ యుద్ధంపై పుస్తకాలు లేవని కొందరు, యుద్ధంపై విశ్వసనీయమైన రచయితలు రాసిన పుస్తకాలు లేవని మరికొందరు చెప్పారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ భారత సైన్యాన్ని, యుద్ధాన్ని రాజకీయం చేసిందని బిజెపి తీవ్రంగా ఆరోపించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి పాలనలో శత్రువులపై విజయం సాధించిన వీరోచితగాథ గురించి కొత్త తరానికి చెప్పడానికి ఇష్టం లేకనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆ  పార్టీ పేర్కొంది.

కార్గిల్ యుద్ధం విషయంలో కాంగ్రెస్ ఉదాసీన వైఖరి:

గతంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు కార్గిల్ యుద్ధాన్ని బిజెపి యుద్ధంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలే కాక యుపిఎ ప్రభుత్వాలు కూడా కార్గిల్ విజయ దినోత్సవాన్ని దశాబ్దం పాటు జరుపుకోవడానికి నిరాకరించాయి.
కార్గిల్ విజయాన్ని జరుపుకోవడానికి ఎటువంటి కారణం లేదని, ఇది కేవలం ఎన్డీఏ సంబరం మాత్రమేనని 2009 లో కాంగ్రెస్ ఎంపి రషీద్ అల్వి ప్రకటించి అపఖ్యాతి పాలయ్యారు.

యుపిఎ హయాంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రకాష్ జైస్వాల్ కు  కార్గిల్ యుద్ధం జరిగిన తేదీలు కూడా తెలియదు. విజయ్ దివస్ గురించి మీడియా ఆయనను అడిగినప్పుడు, ఆ రోజు ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు అని ఎదురు ప్రశ్నించారు. 

ఈ ఉదాసీన వైఖరిని బట్టి చూస్తే, కళాశాల సిలబస్‌లో కార్గిల్ యుద్ధంపై అధ్యాయాలను తొలగించడం ద్వారా భారత సైన్యం చేసిన కార్గిల్ యుద్ధం దేశం కోసం చేసిన యుద్దంగా కాక కేవలం పార్టీ కోసం చేసిన యుద్ధంగా కాంగ్రెస్  భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల రాహుల్ గాంధీతో సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ వైమానిక దాడులను అనుమానించడమే కాక, ప్రభుత్వం వాటిని తన రాజకీయ ప్రాబల్యం కోసం వాడుకుంటున్నదని ఆరోపించిన విషయాలు అందరికీ తెలిసినవే.