Home News విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) బహుముఖ సేవా కార్యక్రమాలు

విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) బహుముఖ సేవా కార్యక్రమాలు

0
SHARE

హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసి సేవ చేయడానికి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి 55 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఒక సంస్థను ఈ రోజు ప్రజలు పూర్తిగా తీవ్రమైన, ముస్లిం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక హింసకు పాల్పడిన వాటిలో ఒకటిగా గుర్తుంచుకోవడం బాధాకరం. దేశంలోని ఎవరూ ప్రవేశించలేని మారుమూల గిరిజన కొండ ప్రాంతాలలో  వేలాది సేవా కార్యకలాపాలను నిర్వహిస్తున్నదనే వాస్తవం దాని లౌకిక విరోధులు, వారి మీడియా సహచరులు  చేస్తున్న ఈ ప్రతికూల ప్రచారం కారణంగా మరుగున పడింది.

55 సంవత్సరాల క్రితం 1964 ఆగస్టు 29 న అప్పటి ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’  సర్ సంఘచాలక్ శ్రీ మాధవరావు సదాశివ గోళ్వాల్కర్ ప్రోత్సాహంతో  ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ శుభ దినోత్సవం రోజున ‘విశ్వ హిందూ పరిషత్’ (విహెచ్‌పి) స్థాపించబడింది. వి.హెచ్‌.పి వ్యవస్థాపక దినోత్సవం ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ వేడుకల మాదిరి ‘దహి హండి’ లేదా ‘గోవింద’ అనే ప్రత్యేకమైన ఆటలాగా వేలాది అభిమానుల మధ్య కోలాహలంగా జరుపుకుంటారు.

భారతీయ విద్యా భవన్ వ్యవస్థాపకుడు కె. ఎం. మున్షి, గుజరాతీ పండితుడు కేశవరం కాశీరామ్ శాస్త్రి, సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్, నామ్‌ధారీ సిక్కు నాయకుడు సత్గురు జగ్జిత్ సింగ్, సి పి రామస్వామి అయ్యర్, శ్రీ గురుకాష్ అల్ శివారేబ్  వంటి గొప్ప వ్యవస్థాపక సభ్యులతో విశ్వ హిందూ పరిషత్ ప్రయాణం మొదలైంది.

మొదటి సమావేశంలో స్వామి చిన్మయానందను వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎంపిక చేయగా, ఆప్టేగారికి వి.హెచ్‌.పి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. వి.హెచ్‌.పి రాజకీయేతర సంస్థ అని, రాజకీయ పార్టీలకు చెందిన ఏ ఆఫీసు బేరర్ ఏకకాలంలో వి.హెచ్‌.పి లో ఆఫీసు-బేరర్‌గా ఉండరాదని నిర్ణయించారు.

వి.హెచ్‌.పి లక్ష్యం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం – హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం. భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గ్రామాలలో, వి.హెచ్‌.పి కి బలమైన ప్రభావవంతమైన, శాశ్వతమైన ఉనికి పెరుగుతున్నది.

రామజన్మభూమి, అమర్‌నాథ్ యాత్ర, రామ్ సేతు, గంగా రక్ష, గో రక్ష, హిందూ మఠం-మందిర్, క్రైస్తవ చర్చిల  హిందువుల మత మార్పిడులు, ఇస్లామిక్ టెర్రరిజం, బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటు మొదలైన సమస్యలకు స్పందించడం ద్వారా వి.హెచ్‌.పి తన శక్తిని నిరూపిస్తోంది. వి.హెచ్‌.పి హిందూ సమాజంలోని విలువల, నమ్మకాల, పవిత్ర సంప్రదాయాల రక్షణ కోసం పనిచేస్తున్నందున సంఘంలో ఒక అజేయమైన శక్తిగా మారింది..

మొట్టమొదటి హిందూ ప్రపంచ సదస్సు వి.హెచ్‌.పి చొరవతో 1966 లో కుంభమేళా సందర్భంగా ప్రయాగ రాజ్‌లో జరిగింది. అన్ని వర్ణాల, వర్గాల, తెగల  హిందూ మత నాయకులను ఒకే వేదికపైకి తెచ్చిన మొదటి విజయవంతమైన ప్రయత్నం అది. సామాజిక కళంకమైన అంటరానితనంకు వి.హెచ్‌.పి వ్యతిరేకంగా, అవిశ్రాంతంగా పనిచేయడమే కాక దాని సమావేశాలలో ఆ అమానవీయ ఆచారాన్ని ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించి హిందువుల ఉన్నతమైన ఐక్యతను చాటి చెప్పింది.

వి.హెచ్‌.పి అంతర్జాతీయ ఉనికి:

వి.హెచ్‌.పి బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బాలితో లాంటి ఇతర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో చురుకుగా ఉంది. విదేశాలలో దీని కార్యకలాపాలు సాధారణంగా హిందూ సమాజం కోసం కార్యక్రమాలను నిర్వహించడం. అమెరికా లోని వి.హెచ్‌.పి.ఎ లేదా వి.హెచ్‌.పి  ప్రపంచవ్యాప్తంగా హిందువుల మానవ హక్కుల కోసం వాదించింది. 2012 లో ఫిజీ వరద బాధితుల కోసం తుఫాను బాధితులకు స్వచ్ఛంద సంస్థలతో కలసి డబ్బును సేకరించడం వంటి తో పాటు మన ఆచారాలు నిర్వహించడానికి పండితులకు శిక్షణ కూడా ఇస్తున్నది.

వి.హెచ్‌.పి బ్రిటన్- బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో హిందువులపై జరుగుతున్నమానవ హక్కుల ఉల్లంఘనను ప్రశ్నిచింది. జర్మనీ రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్ లో భగవద్గీత, రామాయణ తరగతులను అందిస్తున్నది..

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వేద విద్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో సంస్కృత తరగతులు, వారాంత పాఠశాలలు, సాంస్కృతిక కార్యశాలలు, పండుగలు జరుపుతున్నది.

వి.హెచ్‌.పి మార్చి 2014 లో, తన మొదటి జాతీయ హిందూ మండలిని ఫిజి, న్యూజిలాండ్‌లో జరిపింది. సిడ్నీలో ఒక వేద పాఠశాలను స్థాపించింది, దేవాలయాలు కట్టించింది, మూడు జాతీయ హిందూ సమావేశాలను నిర్వహించింది.

ఒక సాధారణ హిందువుకు  వి.హెచ్‌.పి అంటే ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక సంస్థ. హిందూయేతర వర్గాలపై ద్వేషాన్ని బోధించే సంస్థ. లౌకిక పరిభాషలో ‘బాబ్రీ మసీదు’ గా ప్రసిద్ది చెందిన అయోధ్య వద్ద వివాదాస్పద నిర్మాణం నాశనం కావడంతో అప్పుడపుడు  దీని గురించి మాట్లాడుకుంటున్నారు. విహెచ్‌పి, బజరంగ్ దళ్, దాని యువజన విభాగం  దేశంలో  పెరుగుతున్న అసహనం, మతపరమైన దురాక్రమణ, మతం పేరిట హింసకు కూడా కారణమవుతున్నాయనే అపవాదును మోస్తున్నాయి.

సేవా కార్యకలాపాలు:

వి.హెచ్‌.పి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చాలా మంది  సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ కార్యక్రమాల పరిధిలోని రంగాలు సామాజిక అభ్యున్నతి నుండి ఆరోగ్య సంరక్షణ, విద్య, స్వావలంబన, మహిళా సాధికారత వరకు ఉంటాయి. ఈ అద్భుతమైన సంస్థ  దయగల హృదయాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలను చూస్తే సరిపోతుంది.

ఆరోగ్య సంరక్షణ:

వి.హెచ్‌.పి – 38 ఆసుపత్రులు, 77  డిస్పెన్సరీలు, 653 మొబైల్ డిస్పెన్సరీలు, 24 అంబులెన్స్ సేవలు, 2000 రోగ నిర్ధారణ కేంద్రాలు, 2600  ఆరోగ్య శిబిరాలు, 775  ఇతర ఆరోగ్య ప్రాజెక్టులతో సహా 6167 ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను నడుపుతున్నది.

ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ప్రకృతివైద్యం, పంచగవ్య చికిత్సలు ఉన్నాయి.  ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, తర్వాత సేవలను అందించడానికి శిక్షణ పొందిన ఆరోగ్య సేవకులు, సేవికలను గ్రామాలలోనే కాక, మారుమూల ప్రాంతాలలో నియమిస్తారు. అంతేకాకుండా, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యాయామశాలలు లేదా జిమ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు

వృత్తి విద్యా కార్యక్రమాలు:

మొత్తం వి.హెచ్‌.పి 1518 వృత్తి విద్యా కార్యక్రమాలలో 637  మహిళా స్వయం సహాయక బృందాలు, 62 కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, 181 టైలరింగ్ శిక్షణా కేంద్రాలు, 371 కుటీర పరిశ్రమ శిక్షణా కేంద్రాలు, 232 జంతు పెంపకం ప్రాజెక్టులతో పాటు 35 ఇతర స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.

విద్యా కార్యక్రమాలు:

వి.హెచ్‌.పి విద్య అందించడం లాంటి కార్యకమాలలో, దాని ముద్ర వేయడంలో విజయవంతమైంది. ఈ సంస్థ 634 బల్వాడిలు, 639 బాల సంస్కార  కేంద్రాలు, 490 ప్రాథమిక పాఠశాలలు, 62 మధ్య పాఠశాలలు, 31 ఉన్నత మధ్య పాఠశాలలు, 52954  గ్రామ శిక్షా మందిరాలు, 158 వసతి గృహాలు, 188ఇతర విద్యా ప్రాజెక్టులు,  57 కోచింగ్ కేంద్రాలు, 88 గ్రంథాలయాలు, 12 సంస్కృత  వేద విద్యాలయాలతో సహా 55313 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

సామాజిక కార్యక్రమాలు:

వి.హెచ్‌.పి నిర్వహిస్తున్న 52045 సామాజిక కార్యకమాలలో  45 మత్రిచ్చాయ పేరుతొ అనాథశరణాలయాలు, 22 మహిళా భద్రతా కేంద్రాలు, 804 ఇతర సామాజిక కార్యక్రమాలు, 12 సహాయ కేంద్రాలు, 51139 సంస్కర్ పాఠశాలలు  ఉన్నాయి.

ఈ వైవిధ్యమైన ప్రాజెక్టులను నడపడం వెనక ప్రధాన లక్ష్యం నాగరిక, వ్యవస్థీకృత, బలమైన సమాజం అభివృద్ధికి విలువ ఆధారిత విద్యను అందించడం; అన్ని తరగతులు,కులాల పట్ల తాదాత్మ్యతా భావాన్ని  పెంపొందించడం, సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన, అణగారిన వర్గాలకు అధికారం ఇవ్వడం, నిరుపేదలకు నివారణ ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం.

శిశు సంక్షేమం, బాల సంస్కార పాఠశాలలు, అనాథాశ్రమాలు, మహిళా సాధికారత, జీవనోపాధి కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, అత్యవసర వైద్య సహాయం, సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాల ఉపశమనం, ధర్మ ప్రచార,సమాజిక సమరసత  కార్యక్రమాల ద్వారా పైన పేర్కొన్న లక్ష్యాలను అందుకోవడం.

కానీ ఈ కార్యక్రమాలు ఎక్కడా గుర్తించబడవు, ప్రస్తావించబడవు. ‘ఏకల్ విద్యాలయ’ లేదా సింగిల్ టీచర్ స్కూల్స్ ను దేశంలోని మారుమూల, ఎవరూ చేరలేని ప్రాంతాల్లో నడిపించడంలో చాలా ప్రశంసనీయమైన పని చేస్తున్నదని చాలా కొద్ది మందికి తెలుసు. డిస్పెన్సరీలు, వైద్యులు, ఆసుపత్రులు లేని ప్రజలకు వైద్య, ఆరోగ్య కార్యకలాపాల ద్వారా వి.హెచ్‌.పి మెరుగైన చికిత్స అందించడం గురించి చాలామందికి తెలియదు.

సామాజిక సేవా రంగంలో వి.హెచ్‌.పి  కార్యక్రమాలు చాలా రెట్లు ఆకట్టుకునేవి. వారు వైద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో వృత్తి విద్యా శిక్షణ, విద్య, సాంఘిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మతపరమైన తీర్థయాత్రలు, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో  అత్యవసర సహాయం అందిస్తారు.

(గణాంకాలు, ఇతర సమాచారం వి.హెచ్‌.పి వెబ్‌సైట్ ఆధారంగా)