భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది.
దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ, ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన అమెరికా ప్రభుత్వరంగ సంస్థ (United States Commission on International Religious Freedom – USCIRF)కు తప్పుడు నివేదికలు పంపిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది
దేశంలో క్రైస్తవ పాఠశాలలు, క్రైస్తవ అనాథ శరణలయాలపై హిందూ మతోన్మాదులు మతపరమైన హింసకు పాల్పడుతున్నారని, క్రైస్తవ అనాథ శరణలయాల నిర్వహకులపై, పాస్టర్లపై పోలీసులు అక్రమ పొక్సో కేసులు నమోదు చేస్తున్నారంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొనడం, వాటిని USCIRF తమ నివేదికలో ప్రస్తావించడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (Legal Rights Protection Forum -LRPF) జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించి కమిషన్, రాష్ట్రంలో ఎక్కడైనా అటువంటి ఘటన చోటుచేసుకుంటే రెండు వారాల్లో తమకు నివేదిక పంపాలని గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగలేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. తప్పుడు నివేదికలు పంపిస్తూ అంతర్జాతీయంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ అధినేత శిబు థామస్ మీద ఐపీసీ సెక్షను 499, 500 కింద FIR రిజిష్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జెనెరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు LRPF తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.
BREAKING:@NCPCR_ directed @digpolicebhopal to register FIR against Mr. Shibu Thomas of Persecution Relief u/s 499, 500 of IPC for defamatory & false reports sent to various foreign agencies citing 'Child Homes & Orphanages run by Christians are being persecuted in India' (1/2)
— Legal Rights Protection Forum (@lawinforce) January 10, 2021