మార్గరెట్ నోబుల్ గా భారత్ దేశంలో అడుగు పెట్టి వివేకానందుని దివ్య దిశా నిర్దేశనంలో మానసిక, భావాత్మక, పరివర్తనలు, ఆధ్యాత్మిక భావనలతో సోదరి నివేదితాగా పరివర్తన చెందడం ఒక స్ఫూర్తి దాయకం, ఆచరణీయం అని రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కార్యవాహిక శ్రీమతి శ్రీపాద రాధ గారు తెలిపారు.
“సోదరి నివేదిత” సార్థ శత జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా లోని రామచంద్రాపురం, బి హెచ్ ఈ ఎల్ లోని హెచ్ ఐ జీ కాలనీలో, 3 ఏప్రిల్ మంగళవారం నాడు “అన్ని తరాలకు ఆదర్శం – సోదరినివేదిత సమర్పిత జీవితం” అనే అంశం పై జరిగిన మహిళా సదస్సు లో శ్రీపాద రాధ ముఖ్య వక్త గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా మహిళ ఆధ్వర్యం లో నిర్వహించడం విశేషం.
సోదరి నివేదిత గురుంచి మాట్లాడుతూ , భారత్ దేశం జాగృతం అయితే ప్రపంచం శాంతి కి మార్గం సుగమం అవుతుంది అని తన రచనలు, సామజిక కార్యక్రమాల ద్వార స్వామి వివేకానందుని ప్రేరణతో తన జీవితాన్ని భారత్ దేశ పునర్వైభవ స్థితికి త్యాగం చేసిన మహానీయురాలు. ప్రస్తుతం మనం అంతా మార్గరెట్ లమే మనం మనలను నివేదితాలుగా రూపాంతకరణం పొందాలి అని అన్నారు.
ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీమతి మాదంశెట్టి భవాని, సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి గారు, మాట్లాడూతూ సోదరినివేదిత జీవితం అన్ని తరాలవారికి స్ఫూర్తి, భారత దేశ గొప్ప తనాన్ని గుర్తించి గౌరవించి ఇక్కడి సాంస్కృతిక జీవనంలో మమేకం కావడం విశేషం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో సుమారు 200లకు పైగా మహిళలు పాల్గొన్నారు.