సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించాలని ఉవ్విళ్లూరిన బ్రిటిష్ వాళ్ళు హడావిడిగా ఇక్కడ నుండి తప్పుకోవడానికి కచ్చితమైన కారణం నేతాజీయేనన్నది నిర్వివాదం. ఆజాద్ హింద్ ఫౌజ్ దెబ్బకు బ్రిటిష్ సామ్రాజ్యంఅస్తమించింది. ఆయన జీవితం మొత్తం పోరాటమే. ప్రపంచ స్థాయి నాయకుల సరసన ఎన్న తగ్గ నాయకుడు. ఎటువంటి అధికార లాంచనాలు లేకున్నా, ఏ విదేశం వెళ్లినా, దేశాధిపతి స్థాయిలో గౌరవం అందుకున్న ఏకైక నాయకుడు. “నేతాజీ వల్లనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం వల్లనే, వారి విజయాలవల్లనే బ్రిటిష్ వారి వెన్ను వణికి, స్వాతంత్ర్య ప్రకటన చేశారు“ అని డాక్టర్ అంబేద్కర్ అన్నారు.