Home News జైనూరు ఘటనఫై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్… కేసు నమోదు

జైనూరు ఘటనఫై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్… కేసు నమోదు

0
SHARE

ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లిం వర్గీయుల మూకదాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది. విశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదైంది. హిందువులపై జరిగిన మూకదాడిపై వెంటనే చర్యలు తీసుకొని, తమకు నివేదిక పంపాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గాయపడిన హిందువులకు సరైన వైద్య సదుపాయాలు, ఇతర సహాయక చర్యలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను కూడా మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది. రోడ్డుపై జరిగిన చిన్న సంఘటన నేపథ్యంలో అది కాస్త మతపరమైన ఘటనగా మారిపోయింది. ఈ ఘటన తర్వాత ముస్లిం యువకుడు వారి సంబంధీకులకు తెలుపగా… ఎక్కువ మంది ముస్లింలు హిందువులు వుంటున్న వాడవైపు వచ్చారు. ఆ కాలనీపై రాళ్లు, కర్రలు విసిరారు. ఇదే సమయంలో ఆటోలో వున్న పాములవాడకి చెందిన వనవాసీ యువకుడు లక్ష్మణ్‌పై ముస్లింలు దాడికి దిగారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో ఆయనను ఆదిలాబాద్‌ రిమ్స్‌కి తరలించి, చికిత్స అందిస్తున్నారు.