
న్యూ ఢిల్లీ, నవంబర్ 17, 2019: శ్రీ రామ జన్మభూమి ఆలయానికి మేము ఎటువంటి నిధులు సేకరించడం లేదని విశ్వ హిందూ పరిషత్ స్పష్టం చేసింది. వి.హెచ్.పి అంతర్జాతీయ సెక్రటరీ జనరల్ శ్రీ మిళింద్ పరండే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో 1989 నుండి వి.హెచ్.పి లేదా శ్రీ రామజన్మభూమిన్యాస్ భగవాన్ శ్రీ రామ జన్మస్థలంలో ఆలయానికి నిధులు సేకరించడానికి ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ప్రస్తుతం కూడా వి.హెచ్.పి లేదా శ్రీ రామ జన్మభూమి న్యాస్ అలాంటి విజ్ఞప్తి చేయలేదు అని అయన తెలిపారు.