Home News కర్ణాటక: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రద్దు

కర్ణాటక: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రద్దు

0
SHARE

నిరంకుశుడైన టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘టిప్పు జయంతి’ వేడుకలను ప్రస్తుత యడ్యూరప్ప ప్రభుత్వం రద్దుచేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కన్నడ భాషా,సాంస్కృతిక శాఖ కార్యదర్శి విడుదల చేశారు.

వివిధ ప్రాంతాల నుండి వెలువడిన బలమైన నిరసనలను పరిగణనలోకి తీసుకుని టిప్పు జయంతి వేడుకలను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేడుకలను ఆపుతామని స్వయంగా యడ్యూరప్పతో పాటు, పలువురు బిజెపి నాయకులు గతలో ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు, ప్రతి సంవత్సరం ఈ వేడుకల వల్ల జరుగుతున్న  నిరసనలు, మరణాలు, ఆస్తి నష్టాన్ని ఉదహరిస్తూ, ఈ వేడుకలు కొడగు జిల్లా ప్రజల మధ్య  చీలికను సృష్టిస్తున్నాయని, కొడగు జిల్లా, విరాజ్‌పేటకు చెందిన బిజెపి ఎమ్మెల్యే కె.జి. బొప్పయ్య,  రాష్ట్ర ప్రభుత్వ కన్నడ భాషా,సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలో జూలై 29, సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్రంలో టిప్పు జయంతి వేడుకలను ఆపాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు(జూలై 31) విడుదల చేసిన ఆదేశాలలో కె.జి. బొప్పయ్య  లేఖను ఉటంకిస్తూ, మంత్రివర్గ నిర్ణయాలకు అనుగుణంగా టిప్పు జయంతిని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చరిత్రకారులు, విద్యావేత్తలు, నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. టిప్పు జయంతిని  తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ఒకరైన సీనియర్ చరిత్రకారుడు చిదానందమూర్తి, ఈ వేడుకల రద్దు చర్యను స్వాగతించారు. 

టిప్పు జయంతి – విభజన రాజకీయాలలో  ఒక భాగం    

రాష్ట్ర రాజకీయాలను విభజించే  ఎత్తుగడలో భాగంగా, సిద్దరామయ్య ప్రభుత్వం  2014 నుండి రాష్ట్ర ఖజానా డబ్బులతో  ‘టిప్పు జయంతి’ ని జరపడం ప్రారంభించారు. అనేక మంది ముస్లిం నాయకులు,విద్యావేత్తలతో సహా అన్ని ప్రాంతాల నుండి బలంగా నిరసనలు తెలియచేస్తున్నప్పటికీ, మొండిగా, పట్టుదలగా  సిద్దరామయ్య  ఈ వేడుకలను జరిపారు. 2014 లో టిప్పు జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలలో పలువురు హిందూ నాయకులను మతోన్మాద ఇస్లాంవాదులు హత్య చేశారు. మృతి చెందిన వారిలో మాడికేరికి చెందిన సీనియర్ వీహెచ్‌పీ నాయకుడు కుటప్ప కూడా ఉన్నారు. అయితే  సిద్దరామయ్య ప్రభుత్వం ఆ  హత్యను ప్రమాదవశాత్తు జరిగిన  మరణంగా చిత్రీకరించడానికి  ప్రయత్నించింది.

 తరువాతి సంవత్సరాల్లో కూడా, ఈ వేడుకల సందర్భంగా ముస్లిం మతోన్మాదులు హిందూ కార్యకర్తలపై దాడి చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలను పట్టించుకోకుండా వేడుకలను నిర్వహించింది. ప్రారంభంలో మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ వేడుకలను, 2016 నుండి కన్నడ భాషా, సాంస్కృతిక శాఖకు బదిలీ చేయబడ్డాయి.

ఈ  వేడుకలు,వాటిని నిర్వహించే బిల్లును కన్నడ భాషా, సాంస్కృతిక శాఖకు బదలాయించడం ఒక వెటకారంలాంటిది. టిప్పు తన పాలనలో కన్నడ భాషను తొలగించడానికి అన్నిరకాల పద్ధతులను ప్రయత్నించడమే కాక పర్షియన్ రాజభాషలో మాత్రమే పాలనా సాగాలని  ఆదేశాలు జారీ చేశాడు.