మతోన్మాద బీభత్సపు, మహిషదనుజ రుధిరగళం
పైశాచిక స్వరములతో, పాడుతోంది విషగీతం..
మలిన పడిన ‘వోట్ల సీట్ల’, రాజకీయ రణరంగం
విస్తరింప చేస్తున్నది, వికృతనృత్య విన్యాసం!
అస్సాంలో “దేశ పౌరుల జాతీయ సూచిక” నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ‘ముసాయిదా’ ఆవిష్కృతమైంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయపక్షాలు దేశ వ్యతిరేక వికృత గళాలను వినిపిస్తుండడం విస్మయకరం. ఈ ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్’ ఎన్‌ఆర్‌సీ నివేదిక వెల్లడి అస్సాంలోకి చొరబడి దశాబ్దాల పాటు తిష్టవేసి ఉన్న విదేశీయులను గుర్తించడంలో భాగం. ఈ విదేశీయులు ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ ముస్లిములు. వీరిలో వేల మంది ‘జిహాదీ’ బీభత్సకారులు కూడా ఉండడం దేశ భద్రతకు తీవ్రమైన ప్రమాదం. ఈ జిహాదీ బీభత్సకారులు అనాదిగా అస్సాంలో నివసిస్తున్న స్థానికులపై భౌతిక, ఆర్థిక, లైంగిక, సామాజిక అత్యాచారాలకు పాల్పడుతుండడం బహిరంగ రహస్యం.
భారతీయ జనతా పార్టీ, అస్సాం గణ పరిషత్ వంటి రాజకీయ పక్షాలు ఈ విదేశీయులను పసికట్టి పట్టుకొని దేశం వెలుపలికి తరలించాలని దశాబ్దాల పాటు కోరాయి.. ఉద్యమాలు చేశాయి. కానీ ఇతర రాజకీయ పక్షాలు కొన్ని ఈ చొరబడిన బంగ్లాదేశీయులకు ప్రత్యక్షంగాను, ప్రచ్ఛన్నంగాను వత్తాసు పలికాయి.. పలుకుతున్నాయి. ఫలితంగా లక్షల మంది బంగ్లాదేశీయులు స్థానికులుగా భారతీయ పౌరులుగా చెలామణి అయిపోతున్నారు! ఇలాంటి విదేశీయులను, అక్రమ ప్రవేశకులను గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టడానికి వీలుగా ‘ఎన్‌ఆర్‌సీ’ ముసాయిదా రూపొందింది. ఈ ‘ముసాయిదా’ను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి వారు వ్యతిరేకిస్తుండడం ఈ పార్టీల నాయకుల దేశ వ్యతిరేక ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం..
అస్సాంలో రూపొందిన ‘జాతీయ సూచిక’లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి మొత్తం 3,29,91,384 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల ప్రాతిపదికగా భారతీయ పౌరులెవ్వరో? విదేశీయులెవ్వరో? నిగ్గుతేల్చడానికి ఐదేళ్లు పట్టింది. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగిన ఈ బృహత్ కార్యక్రమానికి పన్నెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చయింది! బంగ్లాదేశీయులను ఇతర విదేశీయులను గుర్తించి వారిని అస్సాం నుంచి దేశం నుంచి తరలించడానికి వీలుగా, 1983లో చట్టాన్ని రూపొందించింది. ఈ ‘న్యాయ మండలుల ద్వారా విదేశీయ అక్రమ ప్రవేశకుల గుర్తింపు’ ఇల్లీగల్ మైగ్రెంట్స్ టర్మినేషన్ బై ట్రిబ్యునల్స్ ఐఎమ్‌డీటీ చట్టం రూపొందిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది.
అస్సాం విద్యార్థి సమాఖ్య ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆసు అఖిల అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ వంటి సంస్థలు ‘విదేశీయుల’కు వ్యతిరేకంగా క్రీస్తు శకం 1970వ దశకం నుంచి నిర్వహించిన పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం లక్ష్యం విదేశీయులను అస్సాం నుంచీ, దేశం నుంచీ వెళ్లగొట్టడం. కానీ ఇప్పుడు ‘ఎన్‌ఆర్‌సీ’ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం నడుం బిగించి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘ఎన్‌ఆర్‌సీ’ని వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 1990వ దశకంలో తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసిన, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ మరింతగా ‘ఎన్‌ఆర్‌సీ’ని వ్యతిరేకిస్తోంది. అభినవ తాటకాసురి వలె, ఆధునిక పూతన వలె మరింతగా దేశ వ్యతిరేక విషాన్ని వెళ్లగక్కుతోంది, విదేశీయ అక్రమ ప్రవేశకుల కొమ్ముకాస్తోంది…
‘ఐఎమ్‌డీటీ’ చట్టం ప్రకారం జరిగిన ‘కార్యక్రమం’ విదేశీయులను గుర్తించడంలో ఘోరంగా విఫలమైంది. ఇరవై మూడేళ్ల తరువాత సర్వోన్నత న్యాయస్థానం ఈ ‘గుదిబండ’ చట్టాన్ని రద్దు చేసింది. 1949 నాటి ‘విదేశీయుల చట్టం’ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం అస్సాంలోని బంగ్లాదేశీయులను గుర్తించి సాగనంపాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. ‘ఐఎమ్‌డీటీ’ చట్టం స్థానంలో మరో చట్టాన్ని రూపొందించాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. కానీ మన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు సుప్రీమ్ ఆదేశాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 1951వ సంవత్సరంలో రూపొందించిన ‘దేశపౌరుల జాతీయ సూచిక’ ఎన్‌ఆర్‌సీ ప్రాతిపదికగా అస్సాంలో కొత్త ‘ఎన్‌ఆర్‌సీ’ని రూపొందించడానికి సర్వోన్నత న్యాయస్థానం శ్రీకారం చుట్టింది.
ఈ ‘ఎన్‌ఆర్‌సీ’ని మొదటి ముసాయిదా గత జనవరి ఒకటవ తేదీన వెలువడింది. దరఖాస్తులు చేసిన వారిలో కోటి తొంబయి లక్షల మందికి ఇందులో చోటు లభించింది. ఇప్పుడు, జూలై 30న వెలువడిన తుది ముసాయిదా జాబితా ప్రకారం అస్సాంలో నివసిస్తున్న వారిలో రెండు కోట్ల తొంబై లక్షల మంది నిజమైన భారతీయ పౌరులని స్పష్టమైంది. దరఖాస్తులు పెట్టుకున్న వారిలో మొత్తం నలభై లక్షల ఏడు వేల ఏడు వందల ఏడు మందికి తుది ముసాయిదా ‘ఎన్‌ఆర్‌సీ’లో చోటు లభించలేదు. అందువల్ల ఈ నలభై లక్షల మంది ‘భారతీయ పౌరులు’ కాదన్నది ప్రాథమిక నిర్ధారణ. కానీ నలభై లక్షల మందిలో నిజమైన భారతీయులు ఉన్నట్టయితే వారు ఆగస్టు సెప్టెంబర్ నెలలలో దరఖాస్తులు పెట్టుకొని సమీక్ష కోరవచ్చు. తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకొని ‘ఎన్‌ఆర్‌సీ’లో నమోదు కావచ్చు.
ఈ తతంగం కూడా పూర్తయిన తరువాత డిసెంబర్ 31వ తేదీన తుది ‘ఎన్‌ఆర్‌సీ’ వెలువడుతుంది. 509వ సంవత్సరంలో జన్మించిన ఆదిశంకరాచార్యుడు భరత ఖండం సరిహద్దుల లోపల మాత్రమే పర్యటించాడు. టిబెట్ ఆ సమయంలో భారతదేశంలో భాగం కనుక ఆ జాతీయ సమైక్యతత్వ ప్రచారకుడు కైలాస పర్వతం వైపు కదిలాడు. భారతీయుల సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు అఖండ భారత్/భారత్ సరిహద్దుల లోపల మాత్రమే ఉన్నాయి. కైలాసం మానసం ఇలాంటి జాతీయ స్ఫూర్తి కేంద్రాలు చైనా వారికి ఇటీవలి కాలం వరకు తెలియవు. టిబెట్ ఒకప్పుడు భారతదేశంలో భాగమన్న చారిత్రక వాస్తవానికి ఇది తిరుగులేని సాక్ష్యం. మానస సరోవరానికి కొంత దూరంలో ‘కాలా తాలాబ్’ అనే రాక్షస తటాకం ఉంది. అక్కడ రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడన్నది టిబెట్ ప్రజల విశ్వాసం.
చాలాకాలం క్రితం నుంచే బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా మారిపోయారు. ఇది మొదటి వైపరీత్యం. వీరిని నిరోధించడంలో 1983 నాటి ‘ఐఎమ్‌డీటీ’ చట్టం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా 1983 నుంచి ఒక దశాబ్దం పాటు బంగ్లాదేశీయుల అక్రమ ప్రవేశం నిర్నిరోధంగా సాగింది. ఈ ‘ఐమ్‌డీటీ’ చట్టం ప్రకారం పోలీసులు కాని, ప్రభుత్వ అధికారులు కాని తమంత తాముగా అక్రమ ప్రవేశాలను గుర్తించరు. తమ ఇరుగుపొరుగు ఇళ్లలో బంగ్లాదేశీయులు నివసిస్తున్నట్టు స్థానిక అస్సామీ ప్రజలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుల ప్రాతిపదికగా మాత్రమే పోలీసులు ప్రభుత్వ అధికారులు ‘న్యాయమండలి’లో అభియోగం నమోదు చేస్తారు. సామాన్య ప్రజలు ఇలా పూనుకొని పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి బంగ్లాదేశీయులపై ఫిర్యాదు చేయడం దాదాపు అసంభవం.
ఎందుకంటే ఇరుగు పొరుగున ఉంటున్న వారి పట్ల స్థానికులకు ఎంతో కొంత స్నేహభావం ఏర్పడి ఉంటుంది. మొహమాటం అడ్డువస్తుంది. అక్రమ ప్రవేశకుల వల్ల దేశ భద్రతకు ఏర్పడే దీర్ఘకాల ప్రమాదం గురించి స్థానిక ప్రజలలో అత్యధికులకు అవగాహన ఉండదు. ఇది మొదటి కారణం. కానీ అవగాహన పెరిగి బంగ్లాదేశీయులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసిన వారిపై వారి ఇళ్లపై వారి బంధువులపై ‘జిహాదీ బీభత్సకారులు’ దాడులు చేయడం ఆరంభమైంది. ఫలితంగా స్థానికులు ఫిర్యాదులు చేయడానికి ధైర్యంగా ముందుకు రాలేదు. ఇది రెండవ కారణం. కొన్ని పట్టణాలలోని బస్తీలలోను, అనేక గ్రామాలలోను బంగ్లాదేశీయులే జనాభాలో బహుళ సంఖ్యాకులయ్యారు, స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరిమివేశారు.
స్థానికులు లేని చోట్ల బంగ్లాదేశీయులకు వ్యతిరేకంగా ఎవరు ఫిర్యాదు చేయాలి? ఇది మూడవ కారణం! ఫలితంగా ‘ఐఎమ్‌డీటీ’ చట్టం బంగ్లాదేశీయులను పసికట్టడానికి కాక బంగ్లాదేశీయులు స్థిరపడి, పాదుకొని, ఓటర్ల జాబితాలకెక్కి భారతీయ పౌరులుగా చెలామణి కావడానికి దోహదం చేసింది. ఇలా ఈ గుదిబండ చట్టం రెండవ వైపరీత్యం! ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసేవరకు దాదాపు నలభై లక్షల మంది బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా నమోదైపోయి అస్సాంలో స్థిరపడినారు! ఇది దేశానికి జరిగిన శాశ్వతమైన అన్యాయం. ఇప్పుడు రూపొందించిన ‘ఎన్‌ఆర్‌సీ’ వల్ల వీరు బయటపడలేదు. బయటపడి ఉంటే కనీసం ఎనభై లక్షల మంది బంగ్లాదేశీయులకు, విదేశీయులకు ‘ఎన్‌ఆర్‌సీ’లో స్థానం లభించి ఉండేది కాదు.
అధికారం అవధి అయిన, ‘బధిరాంధక’ నాయకులు,
పదవులు పరమార్థమైన, అవకాశ దురంధరులు,
మతికి తప్పి ధృతికి తప్పి, దేశహితానికి తప్పి…
విద్రోహపు వీధులెక్కి, పెట్టినారు పెడబొబ్బలు!
-తంగేడుకుంట హెబ్బార్
9908779480
(విజయక్రాంతి సౌజన్యం తో)