
600 నుంచి 700 సంవత్సరాల పాటు ఇస్లామీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా మన దేశం పోరాడింది. ఆ సంఘర్షణ పెద్ద ఎత్తున జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే 11 శతాబ్దం నుంచి 1947 వరకు సుదీర్ఘ సంఘర్షణ సాగింది. స్థూలంగా ఇది కేవలం 190 సంవత్సరాల సంఘర్షణ. అదే సమయంలో ప్లాసీ ఘటన సంభవించింది. ఆ ప్లాసీ యుద్ధం నుంచి 1947 వరకు 190 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన సంఘర్షణ. కానీ ప్లాసీ ఘటనకు ముందు 1757కు ముందు గజినీ, ఘోరీల కాలం నుంచి సాగినది అతి పెద్ద సంఘర్షణ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ మొత్తం సంఘర్షణను మరచిపోకూడదు.