Home News దేశ‌వ్యాప్తంగా 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎం కేర్ నిధులు

దేశ‌వ్యాప్తంగా 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎం కేర్ నిధులు

0
SHARE

కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేప‌థ్యంలో ఆక్సిజన్ కొర‌త స‌మ‌స్య‌ను పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎమ్-కేర్ నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.‌డి.ఓ) తన పరిశ్రమల ద్వారా ఐదు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను మే మొదటి వారంలో ఢిల్లీ పరిసరాల్లో ఏర్పాటు చేయ‌నుంది. ఎయిమ్స్ ట్రామా సెంటర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్‌ఎంఎల్), సఫ్దర్‌జంగ్ ఆస్ప‌త్రి,  లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, హర్యానాలోని జ్జార్‌లోని ఎయిమ్స్‌లో వీటిని ఏర్పాటు చేయ‌నున్నారు.

ఇందులో భాగంగా రెండు ప్లాంట్లు మే 4న ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్ ఆస్ప‌త్రుల‌కు చేరుకున్నాయి. డి.ఆర్‌.డి.వో కి సాంకేతిక భాగ‌స్వామి అయిన కోయంబత్తూర్ లోని ట్రైడెంట్ న్యూమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఆక్సిజ‌న ప్లాంట్ల‌ను సరఫరా చేసింది. ఈ సంస్థ‌కు 48 ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఆర్డ‌ర్ ఇవ్వ‌బ‌డ్డాయి. మ‌రోక 332 ఆక్సిజ‌న్‌ ప్లాంట్లను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు ఆర్డ‌ర్ ఇచ్చారు. ఇవి మే మూడో వారంలో అందుబాటులోకి రానున్నాయి.  సమయానికి డెలివరీ పూర్తి చేయ‌డానికి స‌రైన ప్ర‌ణాళిల‌క‌ను అమ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ఆస్ప‌త్రిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నిమిషానికి 1,000 లీటర్ల ప్రవాహం (ఎల్‌.పి.ఎం) ఉండేలా రూపొందించబడ్డాయి. ఈ వ్యవస్థ 190 మంది రోగులకు 5 ఎల్‌పిఎం ప్రవాహం రేటుతో ఆక్సిజ‌న్‌ను అందిచ‌గ‌ల‌దు. రోజుకు 195 సిలిండర్లను ఇది నింపుతుంది. ఈ  మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ (ఎంఓపి) టెక్నాలజీని ఎల్‌సిఎ, తేజస్ కోసం ఆన్ – బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ ఆధారంగా డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. ఈ  ఆక్సిజన్ ప్లాంట్లు ప్ర‌స్తుత క‌రోనా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సహాయపడతాయి. సిఎస్‌ఐఆర్ కూడా తన పరిశ్రమల ద్వారా 120 ఎంఓపి ప్లాంట్లను కూడా ఆర్డర్ చేసింది.

Source : VSK BHARATH

DONATE: మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ లింక్ ద్వారా మీ విరాళాలను  అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది.