Home News చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తూ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌‌ అకాడమీ నిర్ణయం

చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తూ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌‌ అకాడమీ నిర్ణయం

0
SHARE

భారత్-చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల బలగాల ఘర్షణ ఘటన జరిగిన అనంతరం ఆ దేశ వస్తువులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా  బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీ ప్రవేశద్వారం వద్ద ‘ఈ కాలేజీలో చైనా యాప్‌లు, ఉత్పత్తులు నిషేదించారు’ అనే బ్యానర్‌ కూడా ఏర్పాటు చేయడం విశేషం. చైనా దేశానికి చెందిన వస్తువులు, మొబైల్‌ అప్లికేషన్లను బహిష్కరించింది. తమ కాలేజీలో శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీసులకు ఈ సూచనలు చేసింది. గల్వాన్‌ ఘటన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాడమీ ప్రిన్సిపల్ జి. చంద్రమోహన్ మీడియాకు వెల్లడించారు. శిక్షణలో ఉన్న ట్రైనీ కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు చైనా ఉత్పత్తులు, యాప్ లను బహిష్కరించారని తెలిపారు.

చైనా ఉత్పత్తుల బహిష్కరణకు సంబంధించి తమకు అధికారిక ఉత్తర్వులేమీ లేవని, ఇది తాము స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం అని ఆయన వెల్లడించారు. అకాడమీలో శిక్షణలో 880 మంది ట్రైనీలతో పాటు 150 మంది సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. జూన్‌ 15 రాత్రి గాల్వన్ ప్రాంతంలో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబుతో సహా 21 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.