
జమ్ము కాశ్మీర్ పుల్వామా లో సి ఆర్ పి ఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన తీవ్రవాద దాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇది చాలా ఘోరమైన, ఖండించవలసిన సంఘటన. దేశ సేవలో ఉన్న, ఈ దాడి మూలంగా ప్రాణాలు కోల్పోయిన సైనికులకు రాష్ట్ర సేవికా సమితి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. సైనికుల కుటుంబాలకు ఈ విపత్తును తట్టుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాలి. దేశ ప్రజానీకమంతా మీతో ఉన్నాం. సైనికుల బలిదానం వ్యర్ధం కాకుండా ఈ దాడికి జవాబుగా ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్య చేపట్టాలి.
– సీతాగాయత్రి అన్నదానం , ప్రముఖ కార్యవాహిక, రాష్ట్ర సేవికా సమితి