“మన భారతీయ సంస్కృతి, చరిత్ర అతి పురాతనమైనవి, అత్యంత విలువైనవి. కాలగమనంలో వచ్చే మార్పులను ఎదుర్కొంటూ, మహోజ్వలమైన వారసత్వ సంపదను, జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ భావితరాలవారికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది” అని శ్రీ కృష్ణదేవరాయ అన్నారు.
ఆదివారం నాడు సంవిత్ కేంద్ర రిసర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ రత్నాకర్ సదస్యుల రచించిన
“సిటీ ఆఫ్ విక్టరీ, విజయనగర సామ్రాజ్య చరిత్ర” పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న గౌరవ అతిధిగా పాల్గొన్న శ్రీ కృష్ణదేవరాయ తన వంశజుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య విశిష్టత పై పరిశోధన చేసిన రచయితను అభినందించారు. భారతీయత అంటే ఒకే సంస్కృతి, ఒక కుటుంబం అనే భావన కలిగి గౌరవం, సంపూర్ణ అవగాహనతో సమాజాన్ని జాగృతం చేయాలని కోరారు.
కార్యక్రమానికి ముఖ్య అథిదిగా పాల్గొన్న శ్రీ నాగరాజ్, మితిక్ సొసైటీ గౌరవ కార్యదర్శి మాట్లాడుతూ, దక్షిణ భారత దేశంలో ముస్లిముల దురాక్రమణను ఎదిరించి హైందవ సంస్కృతిని కాపాడుతూనే, ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. దక్షిణ భారత దేశంలో హైందవం ప్రబలంగా ఉండడానికి విజయనగర సామ్రాజ్యం కీలక పాత్ర పోషించిందన్నారు.
ఇలాంటి రచనల ద్వారా విషయాలను సామాన్య ప్రజలకు అందించడానికి సంవిత్ కేంద్ర చేస్తున్న ప్రయత్నాన్ని శ్రీ నాగరాజు అభినందించారు.
పుస్తక రచయిత శ్రీ రత్నాకర్ సదస్యుల మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయల విజయగాథలు, తెలుగు సాహిత్యం పట్ల వారు చేసిన సేవ, నిర్మించబడిన అత్యత్బుతమైన గుళ్ళు, గోపురాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని, దాని వల్లనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు.
సంవిత్ కేంద్ర కార్యదర్శి శ్రీ ఆయుష్ మాట్లాడుతూ జాతీయత, చరిత్రపైన పరిశోధనాత్మక రచనలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని, మన చరిత్రను లిఖితపూర్వకంగా భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు.