Home News రామజన్మభూమి కేసు విచారణ వాయిదాపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

రామజన్మభూమి కేసు విచారణ వాయిదాపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

0
SHARE

రామజన్మభూమి విచారణ మరోసారి వాయిదా పడింది. అవసరం లేని, అర్ధంలేని విషయాలను లేవనెత్తి ప్రతివాదులు విచారణను మరోసారి వాయిదా పడేట్లు ప్రయత్నిస్తారన్న మా భయం నిజమయింది.

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటుకు జుడిషియల్ ఆర్డర్ అవసరమనే వాదన అర్ధం లేనిది. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ ను నిర్ణయిస్తారు. ఏ బెంచ్ లో ఎంతమంది ఉండాలన్నది ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

అలాగే బెంచ్ లో యు యు లలిత్ ను నియమించడం పట్ల అభ్యతరాలు కూడా విచారించదగినవి. ఇప్పటి వరకు లలిత్ రామజన్మభూమి విషయాల్లో విచారణ జరపలేదు. 1997లో ఆయన కళ్యాణ్ సింగ్ తరఫున వాదించారన్న సంగతి ప్రస్తుత విచారణకు ముడిపెట్టడం కేవలం విచారణను మరింత ఆలస్యం చేయడానికేనని అర్ధమవుతోంది.

ఇక జనవరి 29 వరకు విచారణ వాయిదా వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సుదీర్ఘ కాలపు వాయిదా అనే చెప్పాలి. సహనానికి, శాంతియుత వ్యవహారానికి హిందువులు పెట్టింది పేరు. అలాగే అనవసరమైన ఆలస్యం చేయకుండా విచారణను పూర్తిచేయడం న్యాయవ్యవస్థ బాధ్యత. విచారణ బెంచ్ లో సభ్యుడు కూడా అయిన ప్రధాన న్యాయమూర్తి విచారణను ఆలస్యం చేయాలని ప్రతివాదులు చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వకూడదు.

బెంచ్ లో ముస్లిం సభ్యుడిని నియమించనందుకుగాను ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలు చాలా విపరీతంగా ఉన్నాయి. మతం ఆధారంగా న్యాయమూర్తులను నియమించాలని కోరడం చాల విచారించదగిన పరిణామం. బెంచ్ ఏర్పాటుకు ఒక పద్దతి ఉంటుంది. న్యాయమూర్తులను ఎంపిక చేసుకుంటామనే ధోరణి ఖండించదగినది.

అలోక్ కుమార్,
అడ్వకేట్
కార్యనిర్వహణ అధ్యక్షులు, విశ్వహిందూ పరిషత్