
రామ… ఈ నామానికి అత్యంత శక్తి ఉంది.. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలూ దూరమవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే రాముడికంటే కూడా రామనామమే చాలా గొప్పదని మనకు ఎన్నో కథలు చెబుతూ ఉంటాయి. ఆ నాడు మారుతి తన గుండెల్లో రాముడిని కొలువుదీర్చుకుంటే ఈ నాడు భవ్యమైన రామనామాన్నే ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నారు ఆ వనవాసీ ప్రజలు…అంతేకాదు వారు ఎవరు కనిపించినా జై శ్రీరాం అనే అభివాదాన్నే చేస్తారు. అందుకే వారు రామనామీలు గా పిలువబడుతున్నారు.