Home News కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు

కేరళ : మదర్సాలలో మైన‌ర్ బాల‌బాలిక‌లపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న‌ పోక్సో కేసులు

0
SHARE

గత కొన్ని రోజులుగా కేర‌ళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వ‌డంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు.

మలప్పురం జిల్లా వెంగరలోని ఓ పాఠశాలకు చెందిన అద్బుల్ కరీం అనే ఉపాధ్యాయుడు పోక్సో నేరం కింద మరోసారి అరెస్టయ్యాడు. 7వ తరగతి చ‌దువుతున్న‌ 13ఏళ్ల విద్యార్థి ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వ‌డంతో పోలీసులకు అత‌న్ని అరెస్టు చేశారు. అదే పాఠశాలకు చెందిన 15మందికి పైగా 6, 7 త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ విద్యార్థులు కూడా క‌రీంపై ఫిర్యాదు చేశారు. తరగతి సమయంలో అనేక మంది మైనర్ విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. అద్బుల్ కరీం నిషేదిత ఉగ్ర‌వాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) స్థానిక‌ జిల్లా అధ్యక్షుడు కూడా.

కొల్లాం జిల్లా స్కూల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ జరుగుతుండగా విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన మరో ఉపాధ్యాయుడిపై గత శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. నిందితుడు కడక్కల్‌కు చెందిన యూసుఫ్ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బస్సులో తినుబండారానికి వెళ్లే సమయంలో నిందితులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థిని ఇత‌ర ఉపాధ్యాయులకు సమాచారం అందంచ‌డంతో వెంట‌నే యూసుఫ్ పై కేసు న‌మోదు చేశారు. నిందితుడిని ప‌ట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పై సంఘ‌ట‌న జ‌రిగిన మరుసటి రోజు, మదర్సా ఉస్తాద్ ఇబ్రహీం (50) పోక్సో ఆరోపణలపై అరెస్టయ్యాడు. కోడూరు ముండక్కాడ్ మసీదులో ఉపాధ్యాయుడైన ఇబ్రహీం పై చైల్డ్‌లైన్‌లో ఫిర్యాదు చేయ‌డంతో మలప్పురం మహిళా పోలీసులు అత‌న్ని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

కోజికోడ్‌లోని కుట్టికటూర్‌లో ‘బాల్య వివాహ కేసు’ నమోదైంది. నవంబర్ 18న జరిగిన వివాహంలో నిందితులు వ‌రుడు, అమ్మాయి తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. వివాహాన్ని జరిపించిన మత‌పెద్ద‌ల‌పై కూడా అభియోగాలు మోపారు. బాలికకు వైద్య పరీక్షల అనంతరం పోక్సో కేసు నమోదవుతుంది. 17 ఏళ్ల బాలికను అక్క‌డి ముస్లిం మ‌త‌పెద్ద‌లే వివాహం చేసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకుంటామని జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రకటించింది. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కోజికోడ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు వివరణాత్మక నివేదిక ఇచ్చారు.

ముస్లిం బాల్య వివాహాలపై భారత న్యాయస్థానాలు విరుద్ధమైన తీర్పునిచ్చాయి. ముస్లిం బాలికలు యుక్తవయస్సు వచ్చిన వెంటనే లేదా 15 ఏళ్లు నిండిన వెంటనే వివాహం చేసుకోవడానికి అనుమతించే షరియా నియమానికి కూడా వారు మొగ్గు చూపారు. 18 ఏళ్లలోపు సెక్స్ చట్టవిరుద్ధమైన POCSO చట్టం ముస్లిం షరియా చట్టానికి అతీతం అని కూడా తీర్పు ఇచ్చారు.

పై సంఘ‌ట‌న‌ల్ని గ‌మ‌నిస్తే CMP పాల‌న‌లో ఉన్న కేర‌ళ రాష్ట్రంలోని పిల్లల భద్రత, శాంతియుత జీవితాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న‌ట్టు తెలుస్తోంది. మైన‌రీటిల‌కు మితిమీరిన మతపరమైన ప్రాధాన్య‌త‌నివ్వ‌డం, రాష్ట్రంలో పార్టీ రాజకీయాలకు అనవసరమైన ప్రాముఖ్యత లభించడం ఈ సంఘ‌ట‌ల‌కు ముఖ్య కారణాల‌ని స్ప‌ష్టం అవుతోంది.

Source : ORGANISER