Home News ఐదేళ్ళ బాలికపై అత్యాచారం కేసు: అజ్మత్ ఖాన్ కు 20యేళ్ల జైలు

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం కేసు: అజ్మత్ ఖాన్ కు 20యేళ్ల జైలు

0
SHARE

తెలంగాణ: అభం శుభం తెలియని ఐదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అజ్మత్ ఖాన్ అనే వ్యక్తికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్ (26) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లుమూసుకు పోయిన యితడు 2018 జూలై 29వ తేదీన ఐదేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.

 విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద అజ్మత్ ఖాన్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కేసును విచారించిన నాంపల్లి మెట్రోపాలిటిన్ కోర్టు, అజ్మత్ ఖాన్ నేరానికి పాల్పడినట్టు ఋజువు కావడంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా కట్టని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా శిక్ష విధించాలని నాంపల్లి మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి కె.సునీత ఆదేశించారు.