Home News భాగ్యనగరంలో ‘రాష్ట్ర సేవికాసమితి’ ప‌థ‌సంచ‌ల‌న్‌

భాగ్యనగరంలో ‘రాష్ట్ర సేవికాసమితి’ ప‌థ‌సంచ‌ల‌న్‌

0
SHARE

రాష్ట్రీయ సేవికాసమితి భాగ్యనగర్ సంభాగ్ ఆధ్వర్యంలో ఆదివారం (29.10.2023) ఇబ్రహీంపట్నం (వీరపట్నం) లోని పురవీధులగుండా సేవికల విజయదశమి విజయోత్సవయాత్ర, పథ‌సంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 195 మంది గణవేషధారీ సేవికలు, 214 మంగళవేషధారీ సేవికలు పాల్గొన్నారు. గణవేషధారీ సేవికలు భగవధ్వజాన్ని చేతపూని ఘోష్ వాదనతో పురవీధులలో శోభాయమానంగా పథ‌సంచలన్ నిర్వహించారు. సేవికల పథ‌సంచలన్ జరుగుతుండగా ప్రజలు పుష్పార్చనతో, మంగళ హరతులతో స్వాగతించారు.

ఈ విజయదశమి ఉత్సవానికి ముఖ్య అతిధిగా డా. స్మితారామరాజు గారు, వక్తగా ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ గారు, విభాగ్ కార్యవాహిక ప్రసన్న లక్ష్మి గారు దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా డా.స్మితా రామరాజు గారు మాట్లాడుతూ చదువుకున్న మహిళ వల్ల ఆ ఇళ్లంతా విద్యావంతులుగా తయారవుతార‌ని అన్నారు. మ‌హిళ‌లు అన్ని రంగాలలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు.

అనంత‌రం ప్రధాన వక్త మాననీయ శ్రీపాద రాధ గారు మాట్లాడుతూ విజయదశమి ఉత్సవం మనకు ఎలల్లు లేని భక్తియే సనాతనమని నేర్పుతుందని అన్నారు. ఇది కలియుగం.. అంటే కాళీ యుగం అని చెప్తూ విజయం కావాలంటే మాతృశక్తి సంకల్పం జరగాల‌న్నారు. మన దేశంలో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్, గగనయాన్ లలో కూడా మహిళల పాత్రవున్నద‌ని. చంద్రయాన్ చేరుకున్న ఆ స్థలానికి కూడా అమ్మ పేరుతో శక్తిగా దానిని పేర్కొన్నార‌ని తెలిపారు.

అమ్మ వారు మొదటగా బంఢాశుర వధ ద్వార మనలోని బద్దకాన్ని వధించాలనే సూచన అని చెప్పారు. రక్తబీజుని వధ ద్వారా అరిషడ్వవర్గాలను అణచడమనే విజయాన్ని, సనాతన ధర్మాన్ని అణచివేస్తాననే దున్నపోతుని మహిష వధ ద్వారా అమ్మవారు మనకు మార్గాన్ని నిర్దేశించారని, ఇవి చేయగల భక్తులు హిందూధర్మ విజయంతో అమ్మ భరతాంబికను ఈ విశ్వానికి నిత్య సింహాసనేశ్వరిగా చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత, విభాగ్ కార్యకారిణీ పాల్గొన్నారు.