– రాహుల్ శాస్త్రి, సంవిత్ కేంద్ర
రావణాసురుడు దళితుడు, ద్రవిడ జాతికి చెందినవాడు. అతడిని ఆర్యుడు, `అగ్రకుల’ అహంకారి అయిన రాముడు అన్యాయంగా వధించాడు. రావణుడు తన చెల్లెలు శూర్ఫణఖకు రామలక్ష్మణులు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు తప్ప అతడు పండితుడు, మహాభక్తుడు – ఇటువంటి వాదనలు, చర్చలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామకథను వక్రీకరించి, తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అందువల్ల అసలు రావణాసురుడు ఎవరో తెలుసుకోవలసిన, గుర్తుచేసుకోవలసిన అవసరం ఏర్పడింది.
రావణుడు ఎవరు?
రావణుడి పుట్టుకతో పెట్టిన పేరు దశానన, దశగ్రీవుడు. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వావసు బ్రహ్మకి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మించాడు. అతను హర్యానాలోని బిస్రాక్ గ్రామానికి చెందినవాడని నమ్ముతారు. అతని తల్లి రాక్షస రాజు సుమాలి కుమార్తె కైకేసి. రావణుని భార్య మయుని కూతురు మందోదరి.
అందువలన, వామపక్షాలు ఊదరకొట్టి, మనల్ని నమ్మించేందుకు ప్రయత్నించినట్లుగా రావణుడు ద్రావిడుడు లేదా శూద్రుడు లేదా `అణచివేయబడినవాడు’ కాదు. అతను ఉత్తర భారత బ్రాహ్మణుడు, రాజకుటుంబీకుడు.
రావణుడు ఏమి చేశాడు?
రావణుడు తపస్సు చేసి ఎవరివల్ల తనకు మరణం రాకూడదని బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు. అడిగినప్పుడు నరులు, వానరుల సంగతి మరచిపోయాడు. అందువల్ల మనుషులు తప్ప ఎవరూ అతడిని చంపలేరు. ఈ వరం నుండి వల్ల వచ్చిన అహంకారం వల్ల అతడు తన బంధువు కుబేరుడి నుండి లంకను, పుష్పక విమానాలను బలవంతంగా తీసుకున్నాడు. తన కుటుంబ సహాయంతో అనేక ప్రాంతాలను ఆక్రమించాడు, దేవతలను కూడా వశపరచుకున్నాడు.
ఉత్తర దిశగా కైలాసానికి చేరుకున్నాడు. శివునితో సహ కైలాసాన్నివిసిరివేస్తానని నందిని బెదిరించాడు. ఈ బెదిరింపు అమలు చేయడానికి అతను తన చేతులను పర్వతం క్రింద ఉంచాడు, కాని శివుడు కైలాస పర్వతాన్ని తన బొటనవేలితో నొక్కాడు, దీనివల్ల రావణుడి చేతులు ఇరుక్కుపోయినవి. అతని వేళ్లు ఆ కైలాస పర్వతం క్రింద నలిగిపోయాయి. అప్పుడు దశాననుడు శివుడిని స్తుతించాడు, శివుడు అతనికి రావణ పేరుపెట్టి (అంటే ఏడుపు లేదా గర్జించడం) చంద్రహాస ఖడ్గాన్ని ప్రసాదించాడు.
విజయం, దివ్య శక్తులు, వరాల వల్ల రావణుడు అహంకారం, గర్వం పెరిగి అతడు ఆడవారిని అపహరించడం, వేధించడం, దేవతలు, ఋషులను బాధించడం మొదలు పెట్టాడు. అతని అఘాయిత్యాలు వల్లన పద్దెనిమిది శాపాలను పొందాడు. ఆవిధంగా అవలక్షణాలు, దుర్లక్షణాలు, దుర్మార్గాలకు ప్రతీకగా నిలిచాడు రావణుడు .
మాధవుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్న వేదవతిని రావణుడు వేధించినప్పుడు, ఆమె నారాయణుడే అతడిని, అతని కుటుంబాన్ని నాశనం చేస్తాడని శపించింది. బ్రహ్మదేవుడి వరంవల్ల అతను దేవతలకు కూడా భయపడడు. అప్పుడే మారుత్త వనానికి చెందిన తపస్వి రుతువర్మన్ భార్య మదనమంజరిపై రావణుడు అత్యాచారం చేయటం వల్ల ఒక మానవుడి చేతిలో మరణం సంభావిస్తుందని రుతవర్మన్ శపించాడు.
చివరగా, అతను తన మేనల్లుడు, కుబేరుని కుమరుడైన నలకుబేరుని భార్య కావలసిన రంభపై అత్యాచారం చేశాడు. దీనితో కోపించిన నలకుబరుడు “కామంతో గుడ్డివాడవైన నువ్వు, ఏ స్త్రీని ఆమెకు ఇష్టంలేకుండా తాకకూడదు. అలా చేస్తే నీ తల ఏడు ముక్కలవుతుంది ” అని శపించాడు.
ఈ శాపం వల్లనే సీతాదేవి, అనేక ఇతర స్త్రీలను రావణుడు తాకడానికి భయపడ్డాడు. అయినా వాళ్ళు అతడి వేధింపులు, అవమానాలకు గురయ్యారు.
అత్యాచారం – రాక్షసులు, మానవ నాగరికత
అత్యాచారం అనేది రాక్షస సంస్కృతిలో ఒక భాగం. అందుకనే అత్యాచారం ద్వారా వివాహం అనే పద్దతిని ‘రాక్షస వివాహం‘ అంటారు. సంస్కృతి లో అత్యాచారానికి స్థానం ఉండదని, దైవిక శక్తుల వల్ల అత్యాచారం సంస్కృతి నాశనమవుతుందనడానికి రావణుడి వినాశనమే గుర్తు.
రావణుని వేధింపులు
ఇష్టపడని స్త్రీలను తాకితే తనపది తలలూ విరిగిపోతాయని నలకూబర శాపాన్ని గుర్తుచేసిన బ్రహ్మ కుమార్తె పుంజీకాదేవిని రావణుడు అవమానించడానికి ప్రయత్నించాడు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రావణుడు వారి నిస్సహాయ బంధువుల సమక్షంలో మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతను అగ్ని సమక్షంలో స్వాహాదేవిని అవమానించాడు, అగ్నిదేవుడు అతడిని శపించాడు. ద్వైపాయన సమక్షంలో ద్వైపాయన సోదరిని అత్యాచారం చేసినప్పుడు, కోతులచేత అవమానానికి గురవుతానని ద్వైపాయనుడు రావణుడిని శపించాడు. అత్రి సమక్షంలో అత్రి భార్యను వేధించినప్పుడు, సముద్రంలో స్నానం చేస్తున్న బ్రాహ్మణ బాలికలతో వారి తల్లుల సమక్షంలో దురుసుగా ప్రవర్తించి అవమానించినప్పుడు కూడా ఇలాంటి శాపమే పొందాడు.
ఒకసారి రావణుడు దేవలోకాన్ని జయించిన తర్వాత బృహస్పతి కుమార్తె సులేఖాదేవిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు రావణుడు రామ బాణాల వల్ల చనిపోతాడని బృహస్పతి శపించాడు.
రావణుడి మరికొన్ని దారుణాలు
రావణుడు లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. వాటివల్ల అనేక శాపాలు పొందాడు. అష్టావక్రుడిని, అతని వైకల్యాలను అవమానించాడు. దానితో అష్టావక్రుడు కోతులు మీ రాక్షస జాతిని నాశనం చేస్తాయి అంటూ శపించాడు.
రావణుడి నీచ బుద్ధి తెలుసుకున్న వసిష్ఠుడు అతడికి వేదం నేర్పడానికి నిరాకరించాడు. ఈ కారణంగా వశిష్టుడుని కారాగారం లో ఉంచాడు. సూర్యవంశానికి చెందిన కువలయాశ్వ వశిష్టుడిని రక్షించాడు. సూర్యవంశంలో జన్మించిన వారి ద్వారా రావణుడు, అతని కుటుంబం నాశనమవుతాయని వశిష్ట చెప్పాడు.
నారదుడు ‘ఓం‘కారపు అర్థాన్ని వివరించడానికి నిరాకరించినప్పుడు రావణుడి అతని నాలుకను నరికేస్తానని బెదిరించాడు. దానితో కోపించిన నారదుడు రావణుని పది తలలన్నింటినీ ఒకే వ్యక్తి నరికేస్తాడని శపించాడు.
మౌద్గళ్య మహర్షి ఒకసారి యోగదండపై స్వస్తిక్ ఆసనం చేస్తున్నాడు. అతడిని చూసి రావణుడు యోగదండాన్ని చంద్రహాస ఖడ్గంతో రెండుగా నరికాడు. మహర్షి పడిపోయాడు. అతని వెన్నెముక విరిగింది. దానితో చంద్రహాస (శివుడు ఇచ్చినది) పనికిరాదని ఆ మహర్షి శపించాడు.
ఒకసారి రావణుడు తనకు శివుడు ఇచ్చిన త్రిపురసుందరి విగ్రహాన్ని ప్రతిష్టించమని వేద బ్రాహ్మణులను ఆహ్వానించాడు. ఆలస్యం చేసినందుకు, బ్రాహ్మణుడికి ఏడు రోజులు జైలు శిక్ష విధించాడు. అందుకు ప్రతిగా ఆ బ్రాహ్మణుడు రావణుడికి కూడా ఏడు నెలలు జైలుశిక్ష అనుభవించవలసివస్తుందని శపించాడు.
మహర్షి దత్తాత్రేయ తన గురువును అభిషేకించటానికి పవిత్రమైన నీటిని సేకరించాడు. రావణుడు ఈ నీటిని తన తలపై పోసుకున్నాడు. కోతుల పాదాల వల్ల అతని తల కలుషితం అవుతుందని దత్తాత్రేయుడు అతడిని శపించాడు.
ముగింపు
రావణుడి వరాలు, వంశం, రాజబలం గొప్పవైనప్పటికీ, అతడు ప్రపంచాలను జయించినప్పటికీ, అతని వ్యక్తిత్వం సరైనది కాదు. అతను ఆడవారిపై అత్యాచారాలు చేసి, బలహీనులను హింసించేవాడు. అలాంటి నీచ వ్యక్తిత్వం కలిగిన రావణుడిని గొప్పగా చిత్రించడం ద్వారా వామపక్షవాదులు, నాస్తికులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. వారి నిజమైన లక్ష్యం ప్రజల మధ్య విభేదాలను పెంపొందించడం, విలువలను దిగజార్చడం , సంస్కృతిని నాశనం చేయడం.
వామపక్షాలు ఇలా వ్యవహరించడానికి కారణం లేకపోలేదు. వారి సిద్ధాంతం ప్రకారం, ఘర్షణ ద్వారా మాత్రమే పురోగతి వస్తుందితప్ప ఐక్యత ద్వారా కాదు. ఘర్షణను ప్రోత్సహించడానికే ఇలా సంస్కృతి, విలువలపై దాడి చేస్తున్నారు.
భారతదేశ ప్రజల ఐక్యత, సంస్కృతీ విలువలు నుండి వస్తుంది వామపక్షాలకు తెలుసు. కష్ట సమయాల్లో సహనం, బాధితుల పట్ల కరుణ, పెద్దలు, సంప్రదాయాల పట్ల గౌరవం, మాతృభూమి పట్ల ప్రేమను మన సంస్కృతి మనకు నేర్పిస్తుంది. ఈ విలువలే మనల్ని సహస్రాబ్దాలుగా నిలబెట్టాయి, ఈ రోజుకీ నిలబెడుతున్నాయి. వాటిని నాశనం చేయడానికి, మనలో అసంతృప్తి, అసమ్మతి, విభేదాల జ్వాలలను ఎగతోయటానికి వామపక్షాలు మన సంస్కృతిపై దాడి చేస్తున్నాయి.
రావణుడి గురించి వారు చేసే ప్రశంసలు మోసపూరిత కుట్రలో భాగం. కనుక రావణుని నిజస్వరూపాన్ని అర్ధం చేసుకుని, వారి ఆటలు కట్టించాలి. జాతీయ ఐక్యత, మాతృభూమిని బలోపేతం చేయాలి.