Home News అక్రమ గుర్తింపు కార్డులు కలిగిన రోహింగ్యా ముస్లిం రిమాండ్

అక్రమ గుర్తింపు కార్డులు కలిగిన రోహింగ్యా ముస్లిం రిమాండ్

0
SHARE

పహాడీ షరీఫ్: అక్రమంగా గుర్తింపు కార్డులను తీసుకున్న ఓ వ్యక్తిని రిమాండ్ కు తరలించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్.ఐ డి. మధు తెలిపిన వివరాల ప్రకారం… మహమ్మద్ షకీల్(22) అనే వ్యక్తి బర్మా నుంచి 2015లో ఇండియాకు వచ్చి బాలాపూర్ మండల పరిధిలోని రాయల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అక్రమంగా ఇండియన్ గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు కలిగి ఉన్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు షకీల్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకొని పోలీసులు  రిమాండ్ కు తరలించారు.

Source: Namaste Telangana