Home Telugu Articles నేటి వలస కార్మికుల సమస్యకు మూలాలు ఏమిటి?

నేటి వలస కార్మికుల సమస్యకు మూలాలు ఏమిటి?

0
SHARE

కె. శ్యామ్ ప్రసాద్

లాక్ డౌన్ సందర్భంగా దేశంలో వివిధ చోట్ల జాతీయ రహదారులగుండా వలస కార్మికులు కుటుంబాలతో నడిచివెళుతున్న హృదయ విదారక చిత్రాలు దేశంలో చర్చను లేవదీశాయి. ప్రేమ పుట్టుకొచ్చింది. మోడీ పై యశ్వంత సిన్హా వంటి మోదీ వ్యతిరేకులకు వలస కార్మికుల వట్ల అకస్మాత్తుగా దాడికి ఒక ఆయుధం లభించింది. అస్త్రశస్త్రాలు సంధించటం ప్రారంభించారు. ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమాధి వద్ద దీక్ష కూర్చుంటానని ప్రకటించారు కూడా. నిజానికిది సమస్యను పరిష్కరించడానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన సమయం, ఈ సమస్యకు కారణం ఎవరు? అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే సమయం కాదిది. అయినప్పటికి వలస కార్మికుల సమస్యకు మూలకారణాలను ప్రజల ముందు ఉంచటం ఈ వ్యాసం ఉద్దేశం.

నేడు మన ముందున్న వలస కార్మికుల సమస్యలు మూలాలు ఈనాటివి కావు. అనేక దశాబ్దాలుగా దారితప్పిన మన ఆర్థిక విధానాల దుష్పరిణామం నేను చూస్తున్నాం.

1. వ్యవసాయం, చేనేత పట్ల నిర్లక్ష్యం:

భారతదేశం అనాదిగా, ప్రధానంగా గ్రామాలతో కూడిన దేశం, వ్యవసాయ ప్రధాన దేశం. దేశంలోని ఆరు లక్షల గ్రామాలలో 70 శాతం మంది ప్రజలు గ్రామాలలోనే స్వాతంత్ర్యం లభించిన నాటికి నివసిస్తుండేవాడు. గాంధీజీ, దీనదయాల్ ఉపాధ్యాయ వంటి ప్రముఖులు ఎక్కువమందికి పనికల్పించే లఘు, కుటీర, మధ్యతరహా పరిశ్రమలకు పెద్దపీట వేయాలని గట్టిగా సూచించారు. ఒకమేరకు కొన్ని రంగాలలో భారీ పరిశ్రమలు అవసరం గాంధీజీ’ ఆలోచనలకు భిన్నంగా ప్రధాని నెహ్రూ గ్రామాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ భారీ పరిశ్రమలకు పెద్దపీట వేసే విధంగా విధానాలను రూపొందించారు. ప్రధాని నెహ్రూకు ప్రేరణ కమ్యూనిష్టు సోవియట్, రష్యా నమూనా. ఉదాహరణకు దేశంలో ఎక్కువమంది ఆధారపడిన వృత్తి చేనేత హత్యానంతరం చేనేతపై విధానం రూపొందించబడింది. పెద్ద పెద్ద నూలుమిల్లుల లాబీకి లొంగి కేంద్రపాలకులు చాలా సంవత్సరాలుగా చేనేత వృత్తి వారికి రక్షణ యివ్వలేదు. ఫలితం తరతరాలుగా చేనేత వృత్తినే నమ్ముకున్న ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర కల్పించటంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

ఫలితం.. వ్యవసాయాన్ని వీడి ఇతర వృత్తులు, గ్రామాలనుండి పట్టణాలకు వలస వెళ్ళే ప్రజల సంఖ్య పెరిగింది.

2. పెరిగిన పట్టణీకరణ:

వట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే అమెరికాలాంటి అభివృద్ధిచెందిన దేశాలలో గ్రామాల స్థితి ఏమిటి? అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. గ్రామం అంటే కేవలం తక్కువ జనాభా కలిగింది మాత్రమే. మరి మనదేశంలో 1998లో శ్రీ వాజ్ పేయి ప్రధానమంత్రి అయ్యారు. ఆనాటికి దేశంలోని అనేక గ్రామాలు ప్రధాన జాతీయ రహదారి నుండి రోడ్డేలేదు. బస్సు సౌకర్యంలేని, విద్యుత్ లేని గ్రామాలు అనేకం. శ్రీ వాజ్ పేయి ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’ పేరున దేశంలోని అత్యధిక గ్రామాలు విజయవంతంగా రోడ్లు వేసింది. మోడీ ప్రభుత్వం అన్ని గ్రామాలకు విద్యుత్, స్వచ్ఛభారత్ పేరుతో గ్రామాలలోని ఇండ్లలో పెద్దఎత్తున శౌచాలయాల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. గ్రామాలలో తాగడానికి నీరు, వ్యవసాయానికి నీరు, విద్యార్థులకు విద్యా సౌకర్యాలు, గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు, ఆరోగ్యవనతులు, ఇలాంటివి ఇంకా అనేక గ్రామాలలో చేయవలసి ఉంది. గ్రామాలలోని పేద ప్రజలకు ఉపాధి కల్పన కార్యక్రమాలను ఇంకా చేయవలసి ఉంది. గ్రామాలలోని సౌకర్యాలపట్ల నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ఉన్న ధనిక వర్గాలు, పేదవర్గాలు పెద్దఎత్తున పట్టణాలకు చేరుకుంటున్నాయి. దేశంలో గ్రామంలో నివసించే ప్రజల సంఖ్య వేగంగా తగ్గుతోంది. పట్టణీకరణ జరుగుతోంది. పట్టణాలలోని మురికివాడలలో నివశించే ప్రజలు పెరుగుతున్నారు. ఈ మితిమీరిన పట్టణీకరణకు మరొక రూపమే అత్యధికంగా పెరిగిన వలస కూలీల సమస్య

3. చిన్న పరిశ్రమల పట్ల చిన్న చూపు:
30 – 40 ఏళ్ల క్రితం ప్రతి జిల్లా కేంద్రానికి ప్రేవేటీకరణ, వైశ్వకర్మణ విధానాలవల్ల అనేక చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. వివిధ వస్తువులు తయారీకి సంబంధించిన టెక్నాలజీలో పెద్దమార్పులు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ ముందు పాతకాలపు టెక్నాలజీతో కూడిన చిన్న పరిశ్రమలు నిలబడలేక పోతున్నాయి. వైశ్వీకరణ కారణంగా, ప్రైవేటీకరణ కారణంగా అనేకమంది కార్మికులు చిన్ని పారిశ్రామికవేత్తలు రోడ్డున పడ్డారు. అన్ని రంగాలలో దేశ రక్షణ నుండి వార్తాపత్రికలవరకు విదేశీ పెట్టుబడులకు మన పాలకులు తలుపులు బార్లా తీశారు. ఆర్ధిక స్వావలంబన కోసం వరిమితంగా విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవచ్చును. అప్పుచేసి పప్పుకూడు విధానంగా ఎప్పుడూ, అంతకంతకూ విదేశీ పెట్టుబడుల ఆధారంగా దేశాన్ని నడిపించే విధానం ప్రమాదకరం.

4. మితిమీరిన వామపక్ష కార్మిక ఉద్యమ ధోరణి:
కార్మికులు, శ్రామికులు వీరందరి హక్కులు కాపాడబడాలి. దీనికై కార్మిక సంఘాలు అవసరం. దేశంలో వామపక్ష కార్మిక ఉద్యమం ప్రారంభించకముందే అనేక కార్మిక ఉద్యమాలు జరిగాయి. మహాత్మా జ్యోతిబా పులే మొదటి తరపు కార్మిక నాయకుడు. జవహర్ లాల్ నెహ్రూ, సుబాష్ చంద్రబోస్, డా|| అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ వీరందరూ ఒకతరపు గొప్ప కార్మిక నాయకులు. వీరి ప్రయత్నాలవల్ల కార్మికులకు హక్కులు లభించాయి. దానితో పాటు దేశంలోని పరిశ్రమలు చక్కగా నడిచాయి. ఇలా అనేకమంది జాతీయ భావంతో కార్మిక నాయకులుగా వనిచేశారు. వామపక్ష కార్మిక ఉద్యమ లక్ష్యం కార్మికుల హక్కుల ముసుగులో దేశంలో వామపక్ష విప్లవ ఉద్యమం తీసుకురావడం, తద్వారా వామపక్ష ప్రభుత్వ నిర్మాణం. వీరికి కార్మికుల బాధ్యతలతో పనిలేదు. కార్మికుల మితి మీరిన వామపక్ష కార్మిక ఉద్యమాలవల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని పెద్ద కర్మాగారాలు ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు రంగానికి తరలిపోయాయి. ఉదా: ఒకప్పుడు విజయవాడ గుంటూరు మధ్య అనేక చిన్న పరిశ్రమలు ఉండేవి. పరిశ్రమలకు అవసరమైన కృష్ణ నీరు పరిశ్రమలను నిర్వహించాలన్న ఉత్సాహం కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వాతావరణం కృష్ణా, గుంటూరు జిల్లాలోని ఆర్థిక ఉన్నత వర్గాలకు ఉంది. అయినప్పటికి రోజు రోజుకు విజయవాడ, గుంటూరు మధ్యగల చిన్న పరిశ్రమలను అదృశ్యమయ్యాయి.

ఒకప్పుడు కలకత్తా, పశ్చిమబెంగాల్ రాష్ట్రము అనేక కర్మాగారాలకు కేంద్ర. గత సి.వి.ఎమ్. ప్రభుత్వము, నేటి మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలవల్ల కలకత్తా నగరంలో బెంగాల్ రాష్ట్రంలో అనేక కర్మాగారాలు మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం మితిమీరిన వామపక్ష కార్మిక ఉద్యమాలు కారణం. అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు పెరగడానికి ఇదికూడా ఒక కారణం.

5. శ్రమ పట్ల చిన్నచూపు:

మన దేశంలో శ్రమకు విలువ తగ్గింది. ఒక యువకుడు ఏ అమెరికాకో వెడతాడు. విదేశాలలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ గౌరవం పొందుతాడు. అమెరికాలో అతడు చేసేది పెట్రోల్ బంకులో ఉద్యోగం. అదే వ్యక్తి మెరుగైన జీతం వచ్చినా ఈ దేశంలో పెట్రోల్ బంకులో వనిచేయడానికి ససేమిరా అంగీకరించడు. ఇదే మనస్తత్వాన్ని అతని బంధువర్గం కలిగి ఉంటుంది. శ్రమించే మనస్తత్వం తగ్గింది. అప్పుడు ఉపాధ్యాయునికి తక్కువ జీతాలుండేవి. బతకలేక బడి వంతులు అనేవారు. కాని ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చక్కగా చదువు చెప్పేవారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువమంది చదువుకొనేవారు. నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలు అనేక రెట్లు పెరిగాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యా రంగంలో సేవాభావంతో అనేక పాఠశాలలు నడుస్తుండడం మనకు కొత్తేమి కాదు. అయితే తాజాగా విద్యా వ్యాపారం ప్రారంభమైంది. డబ్బిచ్చి కొనుక్కునే కాన్వెంటుల సంఖ్య, వాటిపై ప్రజల మోజు, రోజు రోజుకు పెరుగుతోంది. ప్రైవేటు కాన్వెంటులను పెద్ద పెద్ద విద్యా, వ్యాపార సంస్థలు నేడు మింగేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మంచి ప్రమాణాలతో సమర్ధవంతంగా నిర్వహించుకోవాలన్న కోరిక కలిగినవాళ్ళే కరువయ్యారు. దేశంలో పేద పిల్లలకు అవసరమైన ప్రాథమిక విద్య, వైద్యం రెండూ పేదవారికి అందుబాటులో లేకుండా పోయాయి. * ఫలితం పేదవాడిపై మరింతగా అన్నివిధాలా భారంమోపబడింది. పేదల సంఖ్య పెరుగుతోంది. పేదరిక నిర్మూలన కంటి పేదలకు పెన్ వల్ల పేరుతో ఓట్లను ఆకర్షించుకునే పథకాల విధానం నేటి తాజా రాజకీయ విధానం ఊపందుకుంది. వృద్ధులకు పెన్షన్ అవసరం. గ్రామీణ రైతు కూలీలకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పధకం చాలా అవసరం. ఈ పధకాన్ని ఆ గ్రామ వ్యవసాయానికి ఎందుకు జోడించకూడదు? శ్రమించే మనస్తత్వాన్ని విదేశాలనుండి ప్రధానంగా ఇజ్రాయిల్, చైనా, జపాన్ నుండి మనం నేర్చుకోవాలి. ఇజ్రాయిల్, జపాన్ దేశాలలో ప్రజలు స్వచ్ఛందంగా శ్రమిస్తారు. చైనాలో ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రజలు శ్రమిస్తారు. అదే తేడా!

ఇలాంటి అనేక కారణాల ప్రభావం వల్ల దేశంలో వలస కూలీల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.

వలస కార్మికుల సంఖ్య ను తగ్గించడం కోసం ఏమి చేయాలి?:

1. వలస కార్మికులను ఎక్కువమందిని బయటికి పంపే రాష్ట్రాలు:

దేశంలో ఎక్కువమంది వలస కార్మికుల బయటకు వంపే రాష్ట్రాలలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఈశాన్య రాష్ట్రాలు వంటి రాష్ట్రాలున్నాయి. కేరళలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్య గణనీయంగా ఉంది. ఒకే రాష్ట్రంలో కొన్ని జిల్లాల నుండే ఎక్కువమంది వలస కార్మికులు అదే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అలవాటు ఉంది. వలస కార్మికులు అంటే సంవత్సరంలో కొన్ని నెలలు ఇతర ప్రాంతాలకు వెళతారు. మిగిలిన నెలలు తమ గ్రామంలోనే ఉంటారు. కొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో కొన్ని సంవత్సరాలపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు మరోరకం. శ్రీకాకుళం, విజయనగరంకు చెందినవారు అనేక జిల్లాలలో శ్రమజీవులుగా పనిచేస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన మత్స్యకారులు సంవత్సరంలో గుజరాత్ పశ్చిమ తీరానికి వెళుతున్నారు. బీహార్ నుండి భవన నిర్మాణ కార్మికులు వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు.

ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువమంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాడు, ఆయా రాష్ట్రాలలోనే ఎక్కువమందికి ఉపాధి కల్పించటంకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఎక్కువ చొరవ చూపించారు.

2. ఒకే రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలనుంది ఎక్కువమంది వలస కార్మికులు ఇతర జిల్లాలకు, రాష్ట్రలకు వెళుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జిల్లాలలో వ్యవసాయము, పరిశ్రమలు, ఇతర ఉపాధి పథకాలకు ప్రాముఖ్యతని ఇవ్వాలి.

3. ప్రధాన మెట్రో నగరాలు, రాష్ట్ర ముఖ్య పట్టణాలు:

ఎక్కడ ఉపాధి సులభంగా దొరుకుతుందో అక్కడకు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు రావడం సహజం. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, కలకత్తా, బెంగుళూరు లాంటి మెట్రో సిటీలలో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు.
ఉదాహరణకు: ఛత్తీస్గడ్ నూతనంగా ఏర్పడిన ప్రాంతం. ఈ ప్రాంతపు కేంద్రం రాయపూర్. రాయపూర్ ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు ఎక్కువగా నిర్మాణమవుతున్నాయి. స్థానిక రాజకీయాలు తక్కువ. కనుక దేశం వలస కార్మికుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. మొత్తంనుండి కార్మికులు రాయపూర్ వస్తున్నారు. వలస కార్మికుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. వీటి అమలుకోసం ఆలోచించే వారే కరువయ్యారు. ఇలాంటి నగరాలలో ఏ ఏ ప్రాంతం వారికయినా ఎలాంటి భేదభావాలు లేకుండా వనిని కల్పించే వ్యవస్థ రూపొందాలి. మెరుగైన సౌకర్యాలు కల్పించబడాలి. ఈ వలస కార్మికుల కోసం తాత్కాలిత గృహాలు, అక్కడే ప్రభుత్వ రేషన్ అందే వ్యవస్థ(దేశమంతా ఒకే రేషన్కార్డు), శిశువులకు భద్రతా వ్యవస్థ ఇలాంటి విభాగాలు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహింపబడే. హైస్కూలు పిల్లల కోసం వారి సొంత జిల్లాలలోనే ఆవానంతో కూడిన పాఠశాలలను నిర్వహించాలి.

4. వలస కార్మికుల సంతానం వలస కార్మికుల సంతానం కళాశాల, వి. జి. చదువు విషయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు చదువు నిలిపివేసే వరిస్థితి ఉంది. ఇలాంటి విద్యార్థుల కోసం వివిధ విశ్వవిద్యాలయాలు వీరి కోరకు ఒక ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలి. వీటివల్ల వీరి చదువుకు ఆటంకం ఏర్పడదు.

5. దేశంలోని 10 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. వివిధ పార్టీలు, వారి ప్రభుత్వాలు వలస కూలీల సమస్యపై ఒకరిపై ఒకరు నిందించుకోవటం కాకుండా పోటీపడి తమతమ రాష్ట్రాలలో వలస కూలీలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఈ సమస్య పరిష్కారంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి.